సాక్షి, హైదరాబాద్: రైతాంగం ప్రయోజనాలకు కేంద్రం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని మోదీ కి సీఎం కేసీఆర్ రాసిన బహిరంగ లేఖలో ఉన్నవన్నీ పచ్చిఅబద్ధాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డారు. జీవో 317ను సవరించాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహోద్యమానికి శ్రీకారం చుడుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధానికి లేఖ పేరిట కొత్త డ్రామాకు తెరదీశారని ధ్వజమెత్తారు.
మోదీకి కేసీఆర్ రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఈమేరకు గురువారం ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘మీ విధానాలు, నిర్ణయాలతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలుపై మీరు చేసిన అసంబద్ధ ప్రకటనల వల్ల ధాన్యం కుప్పలపై పడి 50 మందికిపైగా రైతులు ప్రాణా లొదిలారు. ఈ మూడేళ్లలో తెలంగాణలో ఎక్కడైనా ఒక్క రైతు పొలానికైనా కరెంట్ మీటర్లు బిగించినట్లు నిరూపిం చగలరా? ఒకవేళ మీరు నిరూపించకుంటే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నా సవాల్‌కు స్పందిం చండి.
ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్న మీ అవినీతి బండారాన్ని బయటపెట్టి చర్యలు తీసుకు నేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో రైతుల పేరుతో లేఖలు రాయడాన్ని ప్రజలు గమని స్తున్నారు. మీరెన్ని జిమ్మిక్కులు చేసినా, రాజకీయ డ్రామాలకు తెరలేపినా బీజేపీ ఆ ఉచ్చులో పడదు. 2017లో రైతులకు ఉచితంగా ఎరువుల సరఫరా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీ, వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ప్రకటిం చాలి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి. వీటిని ఉగాదిలోగా నెరవేర్చకపోతే మరో మహోద్యమానికి శ్రీకారం చుడతాం’ అని బండి లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment