సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, కవిత డ్రామాలు ఆపాలి. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఘాటు విమర్శలు చేశారు.
కాగా, ఎంపీ అర్వింద్ పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఢిల్లీలో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు. ప్రధాని మాటలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారు. మొదట తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తీసుకుంది. తెలంగాణలో యువత ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కాదా?.
ఆత్మహత్యలకు సోనియానే కారణం..
అమరవీరుల ప్రాణ త్యాగాలకు కారణం సోనియా గాంధీ. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడా ఎటువంటి గొడవలు జరగలేదు. ఆందోళనలు చేయలేదు. అదే విషయం ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నేతలు చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారు.
కేటీఆర్‌పై ఫైర్..
యువత గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ సర్కార్ నిరుద్యోగులను, యువతను మోసం చేసింది. చదువుకునేందుకు స్కాలర్‌షిప్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు కేసీఆర్ సర్కార్. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టారు. తెలంగాణలో సారా ఏరులై పారుతోంది. ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ ట్వీట్లు చేస్తున్నాడు. కల్వకుంట్ల కుటుంబ తెలంగాణను లూటీ చేసింది. యూనివర్సిటీలను నాశనం చేశారు. చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.
కవితకు కౌంటర్..
ఎమ్మెల్సీ కవిత డ్రామాలు ఆపాలి. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల కోసం ఏం చేశారు?. కవిత ముందుగా తెలంగాణలో మహిళలకు మేలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేయాలి. కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలి అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. 30 స్థానాలకు లిస్ట్ ఫైనల్!
Comments
Please login to add a commentAdd a comment