దేవుడి ప్రసాదంపై రాజకీయాలు చేయడం మంచిది కాదు
రిపోర్ట్‌పై ఈవో ఒకటి, చంద్రబాబు మరొకటి చెబుతున్నారు
శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: తిశ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలని, అవసరమైతే సీబీఐకి అప్పగించాలని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం çసరి కాదని స్పష్టం చేశారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
చట్టాల్లో లొసుగులు ఆసరాగా చేసుకుని చట్టానికి అతీతంగా ప్రవర్తించినట్లు.. దేవుడితో అలాంటి రాజకీయాలు చేస్తే కచి్చతంగా ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా పత్రికలు, పారీ్టలు ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ప్రసాదాలకు వాడే పదార్థాల నాణ్యతను పరీక్షించిన తర్వాతే అనుమతిస్తారని, లేదంటే తిరస్కరించడం టీటీడీ ఆనవాయితీ అని గుర్తుచేశారు. అలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 18 ట్యాంకర్లు, అంతకు ముందు చంద్రబాబు హయాంలో 14 ట్యాంకర్లను వెనక్కు పంపారని తెలిపారు.
ఐవైఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా..
టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశం లేదన్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని.. కల్తీ జరిగినట్లు విచారణలో తేలితే నిందితులను శిక్షించాలన్నారు. లేని పక్షంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ 100 రోజుల పాలనలో ఏం చేశామో చెప్పలేక గత ప్రభుత్వంపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి ఏంటి? కనీసం గతంలో అమలైన అమ్మఒడి, రైతుభరోసా లాంటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినా ఇవ్వాలి కదా అని నిలదీశారు. ప్రసాదంపై ఈవో ఒకటి చెపుతుండగా, చంద్రబాబు మరొకటి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. విజయవాడ వరదల్లో ప్రభుత్వ వైఫల్యం గురించి అడిగితే.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశారని అబద్ధాలతో ఎదురు దాడి చేయడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్ర, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment