సాక్షి, ముంబై: ఎవరెన్ని విమర్శలు చేసినా భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త విస్తరణ ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్ర వెళ్లిన ఆయన.. మంగళవారం మధ్యాహ్నం పండరీపురం సర్కోలి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం బీఆర్‌ఎస్‌పై చేస్తున్న విమర్శలకు సర్కోలి వేదిక నుంచే కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని సరికొత్త భాష్యం చెప్పిన ఆయన.. ఇది తెలంగాణకే పరిమితమైన పార్టీ మాత్రం కాదన్నారు. ‘‘మేం బీజేపీకి బీ టీం.. కాంగ్రెస్‌కు ఏ టీం ఎంతమాత్రం కాదు. మాది రైతులు, పేదల టీం’’ అని పేర్కొన్నారాయన.
ప్రస్తుత దేశ జలవిధానాన్ని బంగాళాఖాతంలో కలిపాలని పేర్కొన్న కేసీఆర్.. కేంద్రానికి దమ్ముంటే ప్రతీ ఎకరానికి నీరు అందించాలని సవాల్ విసిరారు. దేశంలో 60 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారని, అలాంటిది.. రైతుల కోసం ఎందుకు చర్చించరని కేంద్రాన్ని నిలదీశారు. మన కంటే చిన్నదేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. రత్నగర్భ మహారాష్ట్రకు ఏం తక్కువ. అందుకే భారత్‌లో మార్పు కోసం బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ అధినేత పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి: తెలంగాణ వెనుకబాటుతనం బాధాకరం: గవర్నర్ తమిళిసై
Comments
Please login to add a commentAdd a comment