మూసీమే లూటో.. ఢిల్లీలో బాటో: కేటీఆర్‌ | BRS KTR Serious Comments On CM Revanth Over Musi River | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఫినిష్‌ చేస్తా అన్నవాళ్లే ఫినిష్‌ అయ్యారు: కేటీఆర్‌

Nov 16 2024 1:23 PM | Updated on Nov 16 2024 1:48 PM

BRS KTR Serious Comments On CM Revanth Over Musi River

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పేరుతో సంపాదించిన డబ్బుల మూటలను ఢిల్లీకి తరలించడమే సీఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అలాగే, మూసీమే లూటో.. ఢిల్లీలో బాటో.. రేవంత్‌ బాసులు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. వాళ్లకు డబ్బులు పంపిస్తారు అని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌ వల్లే మూసీ పాడైపోయినట్లు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం లక్షా యాభై వేల కోట్లు కేటాయించారు దేని కోసం?. ఎవరి కోసం లక్షా యాభై వేల కోట్లు?. బఫర్‌ జోన్‌లో పర్మిషన్లు ఇచ్చి.. మీరే ప్రాపర్టీ ట్యాక్స్‌ కట్టించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇళ్లు కూలగొట్టి మాల్స్‌కు ఇస్తామంటున్నారు. మూసీమే లూటో.. ఢిల్లీలో బాటో.. రేవంత్‌ బాసులు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. వాళ్లకు డబ్బులు పంపిస్తారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. 

అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే!. కేసీఆర్‌ను ఫినిష్‌ చేస్తా అన్నవాళ్లే ఫినిష్‌ అయ్యారు. కేసీఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడకపోతే రేవంత్‌ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా?. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్‌ స్థానం శాశ్వతం. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్‌ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement