సీఎం రేవంత్‌రెడ్డితో మదన్‌రెడ్డి తదితరులు
జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి సుదీర్ఘ భేటీ
కడియం శ్రీహరి ఇంటికి వెళ్లిన మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు
నేడు కాంగ్రెస్‌లోకి కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సీఎంను కలసిన మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ సెక్రెటరీ జన రల్, ఎంపీ కె.కేశవరావు శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కేకే చాలాసేపు రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, కేకే కుమారుడు వెంకట్ కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నారు. మరోవైపు స్టేషన్‌ఘ న్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. సీనియర్ నేతలు మల్లు రవి, ఎస్.సంపత్‌కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనా రాయణ తదితరులు మున్షీ వెంట ఉన్నారు. వారు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యతో భేటీ అయి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
నేడు చేరికలు!
ఎంపీ కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కేకే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరుతారనేది స్పష్టతలేదు. ఇక నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి కూడా శుక్ర వారం రేవంత్‌ను కలిశారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా నేతలు కూడా..
నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన నేతలు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలంతా కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు రేవంత్ పలు సూచనలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గా రెడ్డి, ఆమె కుమారుడు భరత్‌సాయిరెడ్డి సీఎంను కలిశారు. తనకు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన చిత్తరంజన్ దాస్
కల్వకుర్తి రూరల్: మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, మళ్లీ సొంతగూటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment