సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ బృందం ఆదివారం పర్యటించింది. బండ్లగూడ జాగీర్, హైదర్‌షాకోట్, గంధంగూడలో పర్యటించిన బీఆర్‌ఎస్ నేతలు.. మూసీ ప్రాంత వాసుల ధర్నాలో పాల్గొన్నారు. హడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్‌రావు, సబిత, తలసాని ముఖాముఖిగా మాట్లాడారు.
తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్‌ఎస్ బృందం బయలు దేరింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమ్మద్ హాలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందంలో ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, వివేక్ గౌడ్, కాలేరు వెంకటేష్ , మాధవరం కృష్ణారావు, సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం’
‘‘పేదల ఇళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రక్షణ కవచంలా నిలబడతాం. పేదల ఇళ్లు కూల్చాలంటే ముందుగా మా ఎమ్మెల్యేలపై జేసీబీ, బుల్డోజర్లు వెళ్లాలి. దేశాన్ని కాపాడే సైనికులు సైతం తమ ఇంటిని కాపాడుకోలేకపోతున్నారు. కొడంగల్‌లో సర్వే నంబర్ 1138లో ముఖ్యమంత్రి ఇల్లే చెరువులో ఉంది. ముఖ్యమంత్రికి ఒక రూల్.. ఆయన సోదరుడికి ఒక రూల్.. గరీబోళ్లకు మరొక రూలా?. హైడ్రా బలిసినోళ్ల కోసమే పని చేస్తుంది. ఇందిరాగాంధీ పేదరికాన్ని పోగడతానంటే.. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ పేదల బతుకులను కూల్చుతున్నాడు. బుల్డోజర్ రాజ్యం నడవదంటోన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’’ హరీష్‌రావు డిమాండ్ చేశారు.
‘‘హస్తం గుర్తు స్థానంలో కాంగ్రెస్.. బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి. హైడ్రా పుణ్యమాని మూడు ప్రాణాలు పోయాయి. లే అవుట్స్‌కు అప్రోవల్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు బలికావాలా ?. సీఎం రేవంత్ రెడ్డి పేదల ఉసురు పోసుకుంటున్నాడు. హామీలను అమలు చేయడానికి లేని డబ్బులు.. మూసీ సుందరీకరణకు నిధులెక్కడవి?. లక్ష కోట్లు డిపాజిట్ చేశాకనే మూసీ సుందరీకరణ చేయాలి. 1908లో మూసీకి వరదలు వస్తే.. నిజాం నవాబ్ గోడ నిర్మించాడు. ప్రభుత్వం చేసే తప్పులను అసెంబ్లీ లోపల, బయట ఎత్తిచూపుతునే ఉంటాం’’ అని హరీష్‌రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment