సాక్షి, గుంటూరు: స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాం కేసులో.. పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెగ బాధపడిపోతున్నట్లున్నారు. అందుకే ఎక్స్(ట్విటర్ వేదికగా) ఆమె ఓ పోస్ట్ చేశారు. అయితే.. ఆ పోస్ట్‌కి ఏపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. అయితే.. పురందేశ్వరి ట్వీట్‌కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ చేస్తే తప్పేంటి..? అని.. ఏపీ సీఐడీ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లోని సెక్షన్ల.. ఏయే నేరాలను అవి వర్తిస్తాయో ప్రస్తావించారు మంత్రి రోజా. చంద్రబాబు అరెస్ట్ ఎందుకు సమర్థనీయం కాదు? అని పురందేశ్వరిని నిలదీశారామె. అలాగే.. బీజేపీని మీ బావ జనతా పార్టీ గా మార్చేశారంటూ పురంధేశ్వరికి గట్టి కౌంటరే ఇచ్చారామె.
క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్ , CRPC 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు, 9/12/2021 న సిఐడి EOW వింగ్ FIR నమోదు, 120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, IPC సెక్షన్ 420 మోసం,… https://t.co/F5y5ghzsjO
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 9, 2023
Comments
Please login to add a commentAdd a comment