సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకున్న వారు దరిద్రులని అన్నారు. జంజం వేసుకున్నటువంటి బ్రాహ్మణుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని అన్నారు. ఎంతో నియమ, నిష్ఠలతో హిందూ ధర్మాన్ని గౌరవించి, దేవుడిని కొలిచే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని పేర్కొన్నారు. సుబ్బారెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న భక్తి భావం చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుటుంబానికి ఉందా అని ప్రశ్నించారు. (ఏపీలో ఒక్కరోజే 74,710 కోవిడ్ పరీక్షలు)
రాజకీయ ప్రయోజనాల కోసం భగవంతుడిని వాడుకోవడం సమంజసం కాదని అన్నారు.వయసు పెరిగే కొద్ది ఆలోచనా విధానాలు మార్చుకోవాలి. గతంలో పాదయాత్ర ప్రారంభించే ముందు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని కొలిచిన వ్యక్తి, భక్తి విశ్వాసం ఉన్న వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. బ్రాహ్మణులకు, మిరాశి వ్యవస్థను చట్టం చేసి మరి మేలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. (సీఎం జగన్ కార్మిక వర్గానికి పెద్దపీట వేశారు)
Comments
Please login to add a commentAdd a comment