సాక్షి, జోగులాంబ గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని.. అలాగే, జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ పప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, గద్వాల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గద్వాలలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. పాత గద్వాలకు.. నేటి గద్వాలకు ఎంతో తేడా ఉంది. జిల్లా ప్రజలకు జోగులాంబ దీవెనలు ఉండాలి. గద్వాలకు త్వరలో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాం. మరో 5-10 ఏళ్లు ఇలాగే కష్టపడితే మనకు ఎదురుండదు. మానవీయ కోణంలో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రగతిలో మనకన్నా ఎత్తుగా ఉన్న అనే స్టేట్స్‌ను అధిగమించాం.
గతంలో మనం వలస పోయాం. ఇప్పుడు వేరే వాళ్లు ఇక్కడికి వలస వస్తున్నారు. గత పాలకులెవరూ ప్రజలను పట్టించుకోలేదు. రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చాం. ధరణి తీసేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిసేస్తామంటున్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చాం. ధరణితోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ధరణితో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాం. ధరణి ఉండాలా.. తీసేయాలా.. మీరే చెప్పండి అని ప్రజలను ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: నిధులు అడిగే దమ్ము లేదు.. అలాంటోడు మంత్రిగా ఉండడం నల్లగొండ దురదృష్టం
Comments
Please login to add a commentAdd a comment