సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బయలేర్దారు. కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. మరో వైపు సీఎం రేవంత్‌పై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. ఇద్దరు నేతలు ఒకే సమయంలో ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమృత్ పథకంలో స్కాం జరిగిందని కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో రేవంత్ ఢిల్లీ టూర్‌కు వెళ్లడంతో కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్‌లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరినట్లు సమాచారం.
కాగా, మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సమయంలో గవర్నర్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన సస్పెన్స్‌గా మారింది. ఏసీబీ కేసు అనుమతి గురించి చర్చించేందుకా? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment