ప్రజాభిమానం ఉంది
ఆయన బీజేపీలోకి రావాలన్నా రాజీనామా చేసి రావాల్సిందే
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఆ రెండు పార్టీలూ ఆడుతున్న డ్రామా
కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్ టౌన్: ‘రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంచి రాజకీయ నాయకుడు. కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యతిరేకత ఉంది కానీ, హరీశ్ ఉద్యమ నాయకుడు.. జనంలో మంచి పేరు ఉంది. బీజేపీ లో చేరాలని చాలామంది బీఆర్‌ఎస్ నేతలకు ఉంది. కానీ మేం ఎవరినీ రమ్మని అడగట్లేదు.
ఎవరొ చ్చినా పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ఒకవేళ హరీశ్‌రావు వ చ్చినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందే. ఇది మా విధానం. హరీశ్‌రావుకు ప్రజాభిమానం ఉంది. సులభంగా గెలుస్తారు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
ఆదివారం కరీంనగర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మా నం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం, హరీశ్ బీజేపీలో చేర తారంటూ జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా?
‘బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేయబోతున్నారంటూ జరుగుతు న్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆ డుతున్న కుట్రలో భాగం. బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవడానికి కేసీఆర్, దొంగ హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు ఆడుతున్న డ్రా మా. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కేసీ ఆర్ ఆ పార్టీ లీడర్లను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నారు.
అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని మా ట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా.. నిజంగా మీ రు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీ లో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా? ప్రజలి చ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మె ల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారు.
పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. ప్రజలు పిచ్చోళ్లు కాదు. ఏ పార్టీ ని చూసి ప్రజలు మీకు ఓటేశారు. మీరు ఏ పార్టీలో కి వెళుతున్నారు?..’ అంటూ సంజయ్ మండిపడ్డారు.
మాపై దాడులు ఎవరూ మర్చిపోలేదు
‘కేసీఆర్ హయాంలో నాతో పాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింస, జైళ్లలో వేయడాన్ని ఎవరూ మర్చిపోలేదు. మేం ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? అధికార పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించారు.
ఇప్పుడు మాకున్న ఏకైక లక్ష్యం తెలంగాణను అభివృద్ధి చేయడమే. కాంగ్రెస్ పార్టీ మోసాలను, దొంగ హామీలను ప్రజలు గుర్తించారు. అందుకే కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనే ఇందుకు నిదర్శనం. యువతను రెచ్చగొడితే కాంగ్రెస్‌కే నష్టమని గుర్తుంచుకుని వ్యవహరించాలి..’ అని సంజయ్ అన్నారు.
అదేమన్నా బ్యాంకు లోనా?!
‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వన్ టైం సెటిల్‌మెంట్ ఏంటి? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నారా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేకపోతే వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకోవడానికి? ఏళ్ల తరబడి ఫీజు కట్టకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి..’ అని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment