hariah rao
-
హరీశ్‌రావు మంచి నేత
కరీంనగర్ టౌన్: ‘రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంచి రాజకీయ నాయకుడు. కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యతిరేకత ఉంది కానీ, హరీశ్ ఉద్యమ నాయకుడు.. జనంలో మంచి పేరు ఉంది. బీజేపీ లో చేరాలని చాలామంది బీఆర్ఎస్ నేతలకు ఉంది. కానీ మేం ఎవరినీ రమ్మని అడగట్లేదు. ఎవరొ చ్చినా పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ఒకవేళ హరీశ్‌రావు వ చ్చినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందే. ఇది మా విధానం. హరీశ్‌రావుకు ప్రజాభిమానం ఉంది. సులభంగా గెలుస్తారు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మా నం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, హరీశ్ బీజేపీలో చేర తారంటూ జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? ‘బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయబోతున్నారంటూ జరుగుతు న్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆ డుతున్న కుట్రలో భాగం. బీఆర్ఎస్ను కాపాడుకోవడానికి కేసీఆర్, దొంగ హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు ఆడుతున్న డ్రా మా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కేసీ ఆర్ ఆ పార్టీ లీడర్లను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నారు.అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరుతున్నారని మా ట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా.. నిజంగా మీ రు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీ లో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా? ప్రజలి చ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మె ల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. ప్రజలు పిచ్చోళ్లు కాదు. ఏ పార్టీ ని చూసి ప్రజలు మీకు ఓటేశారు. మీరు ఏ పార్టీలో కి వెళుతున్నారు?..’ అంటూ సంజయ్ మండిపడ్డారు. మాపై దాడులు ఎవరూ మర్చిపోలేదు ‘కేసీఆర్ హయాంలో నాతో పాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింస, జైళ్లలో వేయడాన్ని ఎవరూ మర్చిపోలేదు. మేం ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? అధికార పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించారు. ఇప్పుడు మాకున్న ఏకైక లక్ష్యం తెలంగాణను అభివృద్ధి చేయడమే. కాంగ్రెస్ పార్టీ మోసాలను, దొంగ హామీలను ప్రజలు గుర్తించారు. అందుకే కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనే ఇందుకు నిదర్శనం. యువతను రెచ్చగొడితే కాంగ్రెస్‌కే నష్టమని గుర్తుంచుకుని వ్యవహరించాలి..’ అని సంజయ్ అన్నారు. అదేమన్నా బ్యాంకు లోనా?! ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వన్ టైం సెటిల్మెంట్ ఏంటి? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నారా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేకపోతే వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి? ఏళ్ల తరబడి ఫీజు కట్టకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి..’ అని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. -
మధ్యప్రదేశ్ సీఎంతో హరీష్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయింది. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లలో పైప్ లైన్ ల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించారు. మద్యప్రదేశ్ భోపాల్ లోని నర్మద వ్యాలి డెవలప్మెంట్ అథారిటి (ఎన్‌వీడీఏ) కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సాగునీటిని విజయవంతంగా పైప్ లైన్ ల ద్వారా రైతులకు ఇస్తున్న తీరు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ గురించి ఈ సమావేశం సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ నడుస్తున్న తీరును స్వయంగా పరిశీలించాడానికి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి హరీష్ రావు తో అన్నారు. -
కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు
జోగిపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితిలో పొత్తు ఉండదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న జోగిపేట శివారులో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని, ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను తికమక పెట్టేందుకు పొత్తులు ఉంటాయంటూ చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణను కోరుకుంటున్నారని, ఆదిశగా టీఆర్ఎస్ కృషి చేయనుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచే గుర్రాలనే గుర్తించి టికెట్లను పార్టీ అధిష్టానవర్గం ఖరారు చేస్తుందన్నారు. ఆయనతోపాటు మాజీ ఎంపి పి.మాణిక్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, అందోల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి పి.కిష్టయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.శివశేఖర్, డాకూర్ సర్పంచ్ ఏ.శంకరయ్య, నాయకులు డిబి.నాగభూషణం, ఎల్లయ్య, అరవిందరెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు ఉన్నారు.