హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయింది. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లలో పైప్ లైన్ ల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించారు. మద్యప్రదేశ్ భోపాల్ లోని నర్మద వ్యాలి డెవలప్మెంట్ అథారిటి (ఎన్వీడీఏ) కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
సాగునీటిని విజయవంతంగా పైప్ లైన్ ల ద్వారా రైతులకు ఇస్తున్న తీరు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ గురించి ఈ సమావేశం సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ నడుస్తున్న తీరును స్వయంగా పరిశీలించాడానికి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి హరీష్ రావు తో అన్నారు.
మధ్యప్రదేశ్ సీఎంతో హరీష్ భేటీ
Published Sat, Dec 12 2015 9:46 PM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM
Advertisement
Advertisement