సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ఊహించని పరిణామాల మధ్య కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆమోదించడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో, మునుగోడులో ఉప ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలతో సహా అధికార పార్టీ సైతం ఫోకస్ పెట్టింది.
ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో వామపక్షాలు సైతం పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై వామపక్షాల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అయితే, మునుగోడులో వామపక్షాల కేడర్ బలంగా ఉన్నందున పోటీలో ఉండాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. గతంలో అధికార టీఆర్‌ఎస్‌కు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తామన్న భావనలో వామపక్షాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మునుగోడు ఉపఎన్నికపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment