చేగుంట (తూప్రాన్): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలకు కనీస అవగాహన లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 80 వేల కోట్లు ఖర్చు జరిగితే రూ. లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎలా సాధ్యపడుతుందని, కాంగ్రెస్ నేతలు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దు్రష్పచారం చేసి గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ప్రాజెక్టు మునిగిపోతే రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు దుష్ట రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
చిన్న లోపాలు సహజమే...
కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నచిన్న లోపాలను పెద్దవిగా చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తంటాలు పడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కొత్త ఇంటి నిర్మాణం చేసుకుంటేనే చిన్న లోపాలు ఏర్పడటం సహజమని, పెద్ద డ్యాం నిర్మిస్తే చిన్న లోపాలు జరుగుతాయని, వాటిని కాంగ్రెస్ నాయకులు పెద్దగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మల్లన్నసాగర్‌లో 3 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్‌లో 12 టీఎంసీలు, రంగనాయకసాగర్‌లో 10 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని గుర్తుచేశారు.
వానలు ఆలస్యంగా వస్తే దుబ్బాక నియోజకవర్గంలో రామాయంపేట కాల్వకు నీటిని వదిలి రైతులకు సహకరించిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకోవాలన్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణ ప్రచారంలో తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నట్లు చెప్పారని, రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్నారని విమర్శించారు. రైతులకు మేలు చేసే బీఆర్‌ఎస్ కావాలో.. రైతులను ఆగం చేసే కాంగ్రెస్ కావాలో గ్రామాల్లో ప్రజలు చర్చించుకోవాలని కోరారు. రూ. 14 వేల కోట్ల రుణమాఫీ చేశామని, మరో రూ. 4 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందనన్నారు.
సన్న బియ్యం అందుకే...
రేషన్ షాపుల్లో అందిస్తున్న దొడ్డు బియ్యాన్ని కొందరు అమ్ముకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పేద ప్రజలంతా రేషన్ బియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఅర్ రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment