సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలని సీఎం కేసీఆర్ విసిరిన సవాల్‌కు బీజేపీ స్పందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ‘సీఎం కేసీఆర్ అవినీతి తనకు తెలుసని, జైల్లో పెడతామని సంజయ్ అంటున్నారు. నన్ను జైల్లో పెడతారా, దమ్ముంటే టచ్ చేసి చూడాలని కేసీఆర్ అంటున్నారు. టచ్ చేయమంటున్నారు కదా.. సంజయ్ టచ్‌చేయ్’ అని భట్టి వ్యాఖ్యా నించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, కేసీఆర్, సంజయ్‌ల మాటలన్నీ నాటకాలని, దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని కోరారు.
‘యాసంగిలో వరి వేయొద్దని సీఎం చెప్పడమేంటి? వరి కొత్తగా పండించట్లేదు. కేంద్రం కొనట్లేదు కాబట్టి తాను కొననంటే కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రణాళి కలు రాష్ట్రం బాధ్యతే కదా? నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే తన స్వ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను బీజేపీ ట్రాప్‌లో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్ని స్తున్నారు’అని మండిపడ్డారు.
ఏడేళ్లుగా నీటి వాటాల్లో బీజేపీ అన్యాయం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నారని, మరి ఏడేళ్లుగా బీజేపీ నీళ్లు ఇవ్వకుండా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడ లేదని, ఇప్పుడు నోరు విప్పితే ఎలా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తాను పెంచలేదని, అందుకే ఇప్పుడు పన్ను తగ్గించ నని కేసీఆర్ చెప్పడం సరైంది కాదన్నా రు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ప న్నులు తగ్గించాలని, వీటిని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment