Congress MP Uttam Kumar Reddy Reacts On Party Change Rumours - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వార్తలు.. స్పందించిన ఎంపీ ఉత్తమ్‌

Published Wed, Jul 26 2023 11:12 AM | Last Updated on Wed, Jul 26 2023 11:32 AM

Congress MP Uttam Kumar Reddy Reacted On Party Change News - Sakshi

సాక్షి, నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాకముందే పాలిటిక్స్‌ రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్‌ చేస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు సైతం ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీలు మారుతుండగా.. మరొకొందరు పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ కుమార్‌ రెడ్డి కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఉత్తమ్‌.. తాజాగా స్పందించారు. ఈ వార్తలను తప్పికొట్టారు. ఉత్తమ్‌ బుధవారం మీడియాతో​ మాట్లాడుతూ.. పార్టీ మార్పు అంశంపై సీరియస్‌ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడేదిలేదని క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదు.. కాంగ్రెస్‌తోనే తన ప్రయాణం అని వివరణ ఇచ్చారు. కొంతమంది కావాలనే తనపై విష ప్రచారం చే​స్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్లాన్‌ మార్చిన బీజేపీ.. కాంగ్రెస్‌కు షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement