సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు హైస్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. పొలిటికల్ లీడర్లు.. ఒకపార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఇక, ఇటీవలే పొంగులేటీ శ్రీనివాస్‌ను బీఆర్‌ఎస్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన ఏపార్టీలో చేరుతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్థికంగా, సామాజికంగా బలమైన పొంగులేటికి అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందింది.
ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమ్ భేటీ అయ్యింది. ఈ క్రమంలో పొంగులేటిని వారు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితో ఖమ్మంలో క్లీన్‌స్వీప్ చేయవచ్చని టీమ్ సూచించినట్టు తెలుస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు పొంగులేటి ఇంట్లోనే మంతనాలు జరిపింది రాహుల్ టీమ్. దీంతో, పొంగులేటి నిర్ణయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇక, ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మధిరలో భట్టి విక్రమార్క ఉండగా.. భద్రాచలంలో పోదెం వీరయ్య ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జావిద్, సత్తుపల్లి నియోజకవర్గంలో సంబాని చంద్రశేఖర్, పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావు ఉన్నారు. ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే మధిర, భద్రాచలం నియోజకవర్గం మినహ మిగత నియోజకవర్గాల్లో పొంగులేటి చెప్పిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడానికి సైతం కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. పొంగులేటి చేరితే రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్‌లో జోష్ వస్తుందని చేరికలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే ఖమ్మంలోని అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిస్తానని పొంగులేటి శపథం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment