
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లామని అందుకు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టే ప్రజల మద్దతు తమకు ఉందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగిస్తే ఉత్తమమని నారాయణ స్వామి సూచించారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్
Comments
Please login to add a commentAdd a comment