మీ ఫోనే.. మీ ఆయుధం | Election war in 18 days: andhra pradesh | Sakshi
Sakshi News home page

మీ ఫోనే.. మీ ఆయుధం

Published Wed, Apr 24 2024 6:05 AM | Last Updated on Wed, Apr 24 2024 6:05 AM

Election war in 18 days: andhra pradesh - Sakshi

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెల్ఫీ

సోషల్‌ మీడియా కార్యకర్తలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి

మీకు తోడుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఉంది

మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం

ఎంత మంది ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ భయపడడు

మన విశాఖ సిటీ ఆఫ్‌ డెస్టినీ.. త్వరలో ఏపీ డెస్టినీ

దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నట్లే!

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఇటువైపున జగన్‌ ఒకే ఒక్కడు... అటు­వైపున చూస్తే ఇంత మంది! దానికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెది­రింపులు, హెరాస్‌మెంట్‌.. అన్నీ  జరుగుతు­న్నాయి. మరిఇంత మంది, ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందులను  తట్టుకుని మీ జగన్‌ నిలబడగలుగుతున్నాడంటే కారణం? వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉండొచ్చు కానీ మనకు సోషల్‌ మీడియా ఉంది. సెల్‌ఫోన్‌ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్‌కు తోడుగా ఉన్నారు.

అందుకే జగన్‌ ఒంటరి కాదు. జగన్‌కు కోట్ల గుండెలు అండగా ఉన్నాయి’ అని సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 21వ రోజు ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర సందర్భంగా మంగళవారం విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్‌ కన్వెన్షన్‌ హాలు­లో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్య­కర్తలతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. రాత్రి బస ప్రాంతం నుంచి సీఎం అక్కడకు చేరుకున్నారు. పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర­వ్యా­ప్తంగా అన్ని జిల్లాల సోషల్‌ మీడియా కార్య­కర్తల­తోపాటు వివిధ దేశాల నుంచి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వర్చువల్‌గా హాజర­య్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

మీకు ఎంత చేసినా తక్కువే
ఆ దేవుడి దయమీద జగన్‌కు నమ్మకం ఉంది. జగన్‌ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మరి జగన్‌ ఒంటరి ఎలా అవుతాడు? మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నా. భార్గవ్‌ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్ట్రీమ్‌ లైనింగ్‌ చేయడంలో ముందు నిలిచి అడుగులు వేస్తున్నాడు. మీ వెనుక ఒక్క జగనే కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన మీద దుష్ట చతుష్టయం దాడులు పెరిగాయంటే దాని అర్థం మనం విజయానికి చాలా దగ్గరగా ఉన్నామనే!

ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ ఏదో ఉన్నట్లే!
దెబ్బ ఇక్కడ (నుదిటిపై) తగిలింది. ఇక్కడ (కంటిపై) తగల్లేదు. ఇక్కడా (కణతలపై) తగల్లేదంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. ఫోన్‌ అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని కోరు­తు­న్నా. వందల మంది చంద్రబాబులు, రామో­జీలు, దత్తపుత్రులు, ఎల్లో మీడియాలు వచ్చినా వైఎస్‌ జగన్‌ తొణకడు. కారణం.. పైన దేవుడు­న్నాడు, కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు.

ప్రత్యేకంగా యాప్‌..
సోషల్‌ మీడియా వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్‌ తయారు చేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి.  సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఆంధ్రా డెస్టినీ మన విశాఖ వచ్చిన మీరంతా ఈరోజు సిటీని చూస్తున్నారు కదా! ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తారో అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి  వస్తుంది. ఐటీని అత్యుత్తమ స్థానానికి చేర్చే పరిస్థితి కూడా వస్తుంది.

చెల్లి గీతాంజలి చావుకు కారకులు..
ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుంది. ఒక్క జగన్‌ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు,  ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీళ్లంతా చాలరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య వాళ్ల ఉక్రోషం ఏ స్థాయికి వెళ్లిందంటే సోషల్‌ మీడియాలో జగన్‌కు సపోర్ట్‌ చేసిందని చెల్లెమ్మ గీతాంజలిని ఎంత దారుణంగా వేధించారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచితో తన కుటుంబం బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయని తన సంతోషాన్ని అందరితో పంచుకోవటమే ఆమె చేసిన పాపం! చివరికి ఆ చెల్లి సూసైడ్‌ చేసుకునే పరిస్థితికి వెళ్లిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పేందుకు నిదర్శనం.

అన్నా.. జాగ్రత్త 
తెనాలిలో ఇంటి పట్టా తీసు­కున్న గీతాంజలి ఆనందంతో తన అభిప్రా­యాన్ని చెప్పుకుంది. కాయ­లున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. వైఎస్సార్‌సీపీ కాయలున్న చెట్టు అయితే టీడీపీ ముళ్ల చెట్టు లాంటిది. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఎంతో అండగా నిలిచింది. అన్నా మీరు జాగ్రత్త.. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్లు భావించాం. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు. – పి.నాని, బాపట్ల జిల్లా

విశాఖ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని..
విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫుడ్‌ కోర్టు టీడీపీ వాళ్లదని తెలియక గతంలో అక్కడ ఉద్యోగం చేశా. విశాఖ ఎయిర్‌పోర్టులో మీపై జరిగిన దాడి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను జగన్‌ అభిమానిని అని తెలిసి నన్ను చాలా వేధించారు. టీడీపీ నాయకులు లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్‌వో వేణుగోపాల్, హర్షవర్థన్‌ అందరూ ఒక కూటమిలా ఉండేవాళ్లు. చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నేను పీసీఎస్‌ రూల్స్‌ ప్రకారం నడుచుకుంటే నాపై దొంగ కేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో హింసించారు.

సీఎస్‌వో వేణు­గోపాల్‌ నిన్ను ఎక్కడా బతకనివ్వనని బెదిరించారు. మీ మీద హత్యా­యత్నం వ్యవహా­రంలో నాపై ఒత్తిడి తేవటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మా కుటుంబం అంతా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ ఉద్యోగం లేకుండా ఉన్నా. విజయవాడలో మీ మీద బొండా ఉమ ప్రోద్బలంతో జరిగిన దాడి చూశాక మౌనంగా ఉండలేక ఇవన్నీ బయట పెడుతున్నా. – సామ్రాజ్యం, మాజీ ప్రైవేట్‌ చీఫ్‌ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్‌పోర్టు

ముస్లింలంతా మీ వెనకే ..
2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ముస్లింలంతా భయపడుతూ బతికారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. మైనార్టీలను ఎమ్మె­ల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంగా, మండలి వైస్‌ చైర్‌పర్సన్‌గా చేశారు. ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ముస్లింల కోసం వైఎస్సార్‌ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు.               – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమాని

మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి.
అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్‌ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్‌ ఎగ్జాంపుల్‌. మీ లైఫ్‌ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి.    –హెబ్సిబా, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఫార్మసీ 

మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి.
అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్‌ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్‌ ఎగ్జాంపుల్‌. మీ లైఫ్‌ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి.         –హెబ్సిబా, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఫార్మసీ

మీ అభిమానిగా ఒక్క రోజైనా చాలు
తమ్ముడు భరత్‌కుమార్‌రెడ్డి ఫిబ్ర­వరిలో ఎన్నికల ప్రచారా­నికి వెళ్లి వస్తూ ప్రమాద­వశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్‌ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ము­డికి మీరే దైవం అన్నా. మీరు బాగుంటేనే మేమూ బాగుంటాం. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంపై ఎల్లోమీడియా దుష్ప్ర­చారం చేసేది. భార్గవ్‌ అన్న ఛార్జ్‌ తీసుకున్న తర్వాత వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ప్రతిపక్షాలు భయపడేంత స్ట్రాంగ్‌ అయ్యింది. మిమ్మల్ని కలుసుకుంటే నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బతికినా చాలు. – ఎం.అనిల్‌కుమార్‌ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం

మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా
జగనన్నా మీరు చేసిన సహాయాన్ని ఎప్ప­టికీ మర్చిపోలేను. మన­సుకు, దేహానికి ఎంత గాయమైనా చిరు­నవ్వుతో ఎదుర్కోవా­లని మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు. ఎప్పటికీ మీ అండదండలు ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి.
– బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త)

కడుపు కాలేవాడికి మీ పథకాల విలువ తెలుసు
సోషల్‌ మీడియా సైని­కుడైన మా అన్నయ్య 2022లో యాక్సిడెంట్‌­లో మరణించాడు. అది తెలిసి సజ్జల భార్గవ్‌ మా ఇంటికి వచ్చారు. మీకు సా­యం చేయాలని జగనన్న ఆదేశించారని చెప్పారు. మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. మా పిన్ని, బాబాయి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలో మె­ంబర్లు. వాళ్లకి సైతం పెన్షన్‌ మన ప్రభు­త్వంలో ఇచ్చారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. మా అన్న చనిపో­యిన­ప్పుడు కూలీ పనులు చేసుకునే వ్యక్తి ఒకరు ఫోన్‌ చేసి ఆ రోజు వచ్చిన రూ.600 సాయంగా పంపుతున్నట్లు చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా!  – వినయ్‌ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్‌ జిల్లా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement