సాక్షి, హైదరాబాద్: కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అంతా పథకం ప్రకారమే జరిగిందని.. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
కవిత అరెస్ట్ అనంతరం బీఆర్‌ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. కవితను అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్‌రావు అన్నారు. 19కి కేసు విచారణ ఉన్నప్పటికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలన్నదే ప్లాన్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
‘‘మాది ఉద్యమ పార్టీ అరెస్టులు, కేసులు కొత్త కాదు. రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?.. అసలు కథ ఎప్పుడు మొదలైంది?
Comments
Please login to add a commentAdd a comment