సాక్షి, అమరావతి: విభేదాలు విడనాడి అందరూ కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా కష్టపడి పనిచేయాలని సీఎం చెప్పారన్నారు. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రులు, పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి సచివాలయాలను ఎమ్మెల్యేలు తప్పక సందర్శించాలని సీఎం ఆదేశించారన్నారు.
చదవండి👉: గేర్ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి: సీఎం జగన్
‘‘ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించి సమస్యలను అక్కడి బుక్ లో రాయాలని ఆదేశించారు. సచివాలయంలో రాసిన సమస్యలను తాను తీసుకుని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. జూలై 8న ప్లీనరీ నిర్వహణపైనా చర్చ జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సీఎం ఆదేశించారు. అభివృద్ది సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. సీఎం త్వరలో జిల్లాల పర్యటనలకు వస్తారు. విభేదాలు, సమస్యలను వెంటనే పరిష్కరించాలని రీజినల్ కో-ఆర్డినేటర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నారు. 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలింది. సర్వేల్లో కొంత మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది. కొందరు ఎమ్మెల్యేల గ్రాప్ 50 నుంచి 40 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. గ్రాప్ పెంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చుతామని సీఎం చెప్పారు. సీఎం ఇచ్చిన మరో అవకాశాన్ని ఎమ్మెల్యేలు అందరూ వినియోగించుకోవాలని’’ కొడాలి నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment