
సాక్షి, అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్/గార/కాశీబుగ్గ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/జగ్గయ్యపేట అర్బన్/ : ప్రభుత్వ ఖజానాను దోచేసి.. రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిన నిన్నెందుకు అరెస్టు చేయకూడదో చెప్పాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. నోటీసు రాగానే తనను అరెస్టుచేస్తారని ఆయన గావు కేకలు పెడుతున్నారన్నారు. ఐటీ నోటీసులపై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారని వారు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జునతోపాటు వేర్వేరు చోట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతరులు చంద్రబాబు తీరుపై శుక్రవారం స్పందించారు. వారు ఏమన్నారంటే..
కేవలం రూ.600 కోట్ల పనుల్లోనే చంద్రబాబు రూ.118.98 కోట్లను కమీషన్లుగా వసూలు చేసినట్లు ఐటీ శాఖ తేలిస్తే.. ఐదేళ్లలో ఫైబర్‌గ్రిడ్ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఈఎస్‌ఐ స్కాం, అసైన్డ్ భూకుంభకోణం, రాజధాని భూభాగోతం తదితర కుంభకోణాల్లో రూ.వేలాది కోట్లను చంద్రబాబు కొల్లగొట్టారు. తక్షణమే చంద్రబాబును అరెస్టుచేసి.. ఈ కుంభకోణాలన్నింటిపై విచారణ జరిపి.. మింగిన సొమ్మును కక్కించాలి.
నిన్నటిదాకా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ కలిసి ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ సవాల్ విసిరారు.. ఇప్పుడెందుకు అరెస్టు చేస్తారని పిరికిపందలా ఆయన భయపడుతున్నారు? ఇక సొంత ఖర్చులతో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తే చంద్రబాబు కుక్కలా మొరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పర్యటనల కోసం స్పెషల్ ఫ్లైట్లు, విలాసాలకు వందల కోట్లను దుబారా చేసింది నువ్వు కాదా చంద్రబాబూ?.
అవినీతికి పాల్పడకపోతే భయమెందుకు: మంత్రి అంబటి రాంబాబు
అవినీతికి పాల్పడకుంటే చంద్రబాబుకు అరెస్టు భయమెందుకు? ఐటీ నోటీసులకు ధైర్యంగా సమాధానం ఇవ్వచ్చు కదా.. బాబు ముడుపులు తీసుకున్న మాట వాస్తవమని విచారణలో తేలిన తరువాతే నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవటం చంద్రబాబుకు అలవాటే. యువగళం పాదయాత్రకు తమిళనాడు నుంచి జనాన్ని తెచ్చి తిప్పుతున్నారు. పుంగనూరు లాగా పోలీసులు మీద తిరుగుబాటు చేసి రాళ్లను విసిరి, పోలీసులను కొట్టాలని చూస్తే పోలీసులు, ప్రభుత్వమూ చూస్తూ ఊరుకోదు.
బాబు సానుభూతి డ్రామాలు నమ్మొద్దు: మంత్రి అప్పలరాజు
చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్నా చంద్రబాబు మాత్రం మౌనంగా ఉంటూ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు. దీనిపై పచ్చ మీడియా కూడా ప్రచారం చేయడంలేదు. దత్తపుత్రుడు సైతం నోరు మెదపడంలేదు. చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారు? పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అరాచక పాలన కావాలో.. సచివాలయాలు, వలంటీర్ల వంటి సేవలు కావాలో ప్రజలే తేలుస్తారు.
శాంతిభద్రతలకు బాబు విఘాతం: ఎంపీ మోపిదేవి వెంకటరమణ
చంద్రబాబు, లోకేశ్‌లు కులాలను రెచ్చగొడుతున్నారు. రౌడీమూకలతో దాడులు చేయించి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన వ్యక్తి జగన్ అయితే జనాన్ని మోసగించిన వ్యక్తి చంద్రబాబు. జగన్ పాలనలో చంద్రబాబు, లోకేశ్ తప్ప రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.
బాబు శిక్ష అనుభవించక తప్పదు: మంత్రి అమర్‌నాథ్
అవినీతికి పాల్పడి ఐటీ శాఖకు అడ్డంగా దొరికిపోయి, తప్పించుకు తిరుగుదామనుకుంటున్న చంద్రబాబు చంద్రమండలం మీద ఉన్నా తీసుకు వస్తారు. ఆయన శిక్ష అనుభవించక తప్పదు. సానుభూతి పొందడానికి తనను రెండు రోజుల్లో అరెస్టుచేస్తారంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారు. తప్పుచేస్తే అరెస్టుచేయరా? ఐటీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన ఆ ఇద్దరినీ దుబాయ్‌కి, అమెరికాకు ఎందుకు పంపించాల్సి వచ్చింది? తాను తప్పు చేయలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడంలేదు. మిత్రపక్షాలు కూడా ఎందుకు మౌనం వహించాయి?
బాబు భవిష్యత్‌కే నో గ్యారంటీ: ప్రభుత్వ విప్ ఉదయభాను
చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైంది. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయి. తండ్రీకొడుకులిద్దరూ పెద్ద అవినీతిపరులు. దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలవలేమనే వారిద్దరూ పిచ్చిపట్టినట్లు హింసను ప్రేరేపిస్తున్నారు. తక్షణం వారిని అరెస్టుచేయాలి.
బాబుకు జైలు భయం:ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్
చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్షల కోట్లు దోచేసి ఇప్పుడు ఐటీ శాఖకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు పవన్, ఎల్లో మీడియా గొంతులు మూగబోయాయి. కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టి వాటి ద్వారా చంద్రబాబు భారీగా లబ్ధిపొందారు. జైలుకు వెళ్లకతప్పదనే భయంతోనే చంద్రబాబు సానుభూతి నటన ప్రారంభించారు. తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పడంలేదు. ఆయనకు వినాశనం దగ్గర పడింది.
ఐటీ శాఖపై పరువునష్టం దావా వేయగలవా?: వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి
ఐటీ శాఖ తప్పుడు నోటీసులు ఇచ్చిందని భావిస్తే.. ఆ శాఖ మీద పరువు నష్టం దావా వేయగలవా? కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చి కోర్టులో విచారణ కోరవచ్చు కదా.. ఆ పని చేయకపోవడానికి కారణం భయమా? లేక ఇంకా లోతుగా విచారిస్తే మరింత అడ్డంగా దొరికిపోతామన్న ఆందోళనా? అనేక కోర్టు కేసుల్లో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారు.. ఇప్పుడు చంద్రబాబు పాపం పండింది.. విచారణ ఎదుర్కోక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment