ఆ మాట ఇచ్చి నిలబెట్టుకున్నా: కేటీఆర్‌ | Former Minister Ktr Comments On Brs Defeat | Sakshi
Sakshi News home page

ఆ మాట ఇచ్చి నిలబెట్టుకున్నా: కేటీఆర్‌

Dec 6 2023 6:20 PM | Updated on Dec 6 2023 6:53 PM

Former Minister Ktr Comments On Brs Defeat - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చి నిలబెట్టుకున్నా.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఆయన నివాళుర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోరాటాలు మాకేం కొత్త కాదు.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల కోసం ప్రజల గొంతుకై మాట్లాడతాం. పవర్‌ పాలిటిక్స్‌లో అధికారం రావడం, పోవడం సహజం. నిరాశపడాల్సిన అవసరంలేదు. ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం’’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement