సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన్ను పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి రేవంత్‌తోపాటు కాంగ్రెస్ నేతలు సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి వెళ్లారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తుమ్మలతో రేవంత్ బృందం చర్చించింది.
ఖమ్మం జిల్లా రాజకీ య సమీకరణాల్లో భాగంగా పార్టీలోకి రావాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. రేవంత్ ఆహా్వనం నేపథ్యంలో తుమ్మల సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆయన ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్‌లోకి వస్తారని చెబుతున్నారు. కాగా, తుమ్మల ఈసారి ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాలేరులో పోటీ సాధ్యం కాకుంటే ఖమ్మం అసెంబ్లీ నుంచి ఆయన బరిలో ఉంటారని, తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు కొత్త బలం వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లా నేతలను దూరం పెట్టడంపై విమర్శలు...
తుమ్మలతో భేటీకి పార్టీ ఖమ్మం జిల్లా నేతలను రేవంత్ దూరం పెట్టడం కాంగ్రెస్‌లో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బదులు నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డి, పాలమూరుకు చెందిన మల్లు రవిని తీసుకెళ్లి తుమ్మలను పార్టీలోకి ఆహా్వనించడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment