పార్టీలో పోస్టుమార్టం చేసుకుంటాం : కేటీఆర్‌ | GHMC ELection Results : KTR Comments About TRS Winning | Sakshi
Sakshi News home page

ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు : కేటీఆర్‌

Published Fri, Dec 4 2020 9:01 PM | Last Updated on Sat, Dec 5 2020 3:51 PM

GHMC ELection Results : KTR Comments About TRS Winning - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనుకున్నంతగా సీట్లు రాలేదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఈ ఫలితాల్లో 20- 25 సీట్లు ఎక్కువగా వస్తాయని అనుకున్నాం. 12 చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాం. ఈ ఓటమితో నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదు. టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించినందుకు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మాకు అతి పెద్ద పార్టీగా అవకాశమిచ్చారంటే మాపై ప్రజలకున్న నమ్మకం ఇంకా పోలేదని భావిస్తున్నాం. ఓటమికి కారణాలను అన్వేషిస్తూ పార్టీలో పోస్టుమార్టం చేసుకుంటాం. మేయర్‌ పీఠం గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. 150 డివిజన్లలో కష్టపడిన టిఆర్ఎస్ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్‌కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ' కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా 2009లో కాంగ్రెస్‌, ఎంఐఎంలు మేయర్‌ పీఠాన్ని సంయుక్తంగా పంచుకున్నారు. ఇరు పార్టీలు చెరో రెండున్నరేళ్లు ‌మేయర్‌ పీఠాన్ని అధిష్టించాయి. తాజాగా 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ రావడంతో మరోసారి ఎంఐఎం కీలకం కానుంది. అయితే ఈ ఎన్నికలు మినహాయిస్తే ముందునుంచి చూసుకుంటే టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం మంచి అనుబంధమే కొనసాగిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement