![GHMC Elections 2020: 580 Nominations Filed On Second Day - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/19/580-Nominations-Filed-On-Se.jpg.webp?itok=NbZttKND)
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైన రెండో రోజు (గురువారం) 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేశారు. నేడు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీజేపీ నుండి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఐ(ఎం) నుండి నలుగురు, కాంగ్రెస్ నుండి 68, ఎంఐఎం నుండి 27, టీఆర్‌ఎస్ నుంచి 195 మంది, టీడీపీ నుండి 47.. రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 16 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: టీఆర్‌ఎస్ రెండో జాబితా ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment