
దౌల్తాబాద్‌లో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తదితరులు
కేసులకు భయపడం: మాజీ మంత్రి హరీశ్‌రావు
హత్నూర(సంగారెడ్డి) /జిన్నారం (పటాన్‌చెరు): బీజేపీతో జోడి లేకపోతే ఈడీ కేసులు బనాయిస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్, గుమ్మడిదల, జిన్నారం మండలం బొల్లారం మునిసిపాలిటీలో మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగిస్తూ బీజేపీతో తాము కలవకపోవడంతోనే ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, కేసులకు భయపడేది లేదన్నారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు నిధులు రాలేదని విమర్శించారు.
మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడం కోసమే బీజేపీ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఏకంగా భార్యాభర్తలను విడదీసి ఓట్లు వేయించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ అయిన బాండ్ పేపర్‌లాంటిదని, బాండ్ పేపర్ రిజెక్ట్ అయితే కేసులు ఎలా నమోదు చేస్తారో ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఏ ఒక్కరోజు పాల్గొనని రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. జై తెలంగాణ అన్న ఉద్యమకారులపై రైఫిల్ పట్టుకొని దాడి చేసిన రేవంత్‌రెడ్డికి ఈరోజు తెలంగాణ గుర్తుకొచి్చందా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment