అవి ఏమయ్యాయ్‌?.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ | Telangana: BRS Leader Harish Rao Open Letter To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అవి ఏమయ్యాయ్‌?.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Published Sat, Jun 22 2024 5:10 PM | Last Updated on Sat, Jun 22 2024 7:23 PM

Harish Rao Open Letter To Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారు.’’ అంటూ హరీశ్‌రావు నిలదీశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.’’ అంటూ హరీశ్‌ మండిపడ్డారు.

మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డునపడి అలమటించవలసిన పరిస్థితి తెచ్చారు. గ్రూప్ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది. బాధ్యత గల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను, బాధలను, వినతులను మీ దృష్టికి తెస్తున్నాను. వెంటనే ఈ అంశాలపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను’’ అంటూ లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement