
సాక్షి, సిద్దిపేట: తొగుట మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... మల్లన్న సాగర్ బాధితులను మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీ వారేనన్నారు. ఓట్లు అనగానే కాంగ్రెస్ పార్టీకి ముంపు గ్రామాల ప్రజలు గుర్తోస్తున్నారని విమర్శించారు. మల్లన సాగర్ ముంపు గ్రామాల వారికి ఇప్పటికే 70 శాతం నష్టపరిహారం అందించామని తెలిపారు. ముంపు గ్రమాల యువత మొత్తం టీఆర్‌ఎస్ పారటీలో చేరుతున్నారని, కొండపోచమ్మ సాగర్ ముంపు ప్రజలకు అందిన నష్టపరిహారం లాగే మల్లన సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు అందిస్తామని చెప్పారు.
ఆ బాధ్యత తానే తీసుకుంటున్నానన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదని, ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ వారు ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల నీటి సమస్యలు తీర్చామని, కాంగ్రెస్ హయాంలో రైతులను కష్టపెట్టి వారి ఉసురు పోసుకున్నారని విమర్శించారు. హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలిచి ఎంచేసిందని ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు.. అక్కడ గెలిచి తాము 30 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉత్తమ్‌కు కార్యకర్తలు లేరని, ఆయన మీటింగ్ పెడితే 20 మంది కూడా రావడం లేదని మంత్రి ఎద్దేవ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment