
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది.
అయితే, తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన తరఫున ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో, ఎనిమిది మంది కూడా జనసేన గుర్తు గ్లాస్ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. జనసేన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు.
Comments
Please login to add a commentAdd a comment