‘గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నరహంతకుడు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేని వాడు, అతన్ని మా రాష్ట్రానికి రానిచ్చే ప్రసక్తే లేదు, నియంత, మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయాలి’.. 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయ్‌ను డిమాండ్ చేసిన మాటలు ఇవీ..
‘బీజేపీ మతతత్వ పార్టీ, ఆ పార్టీతో జతకట్టి నేను పెద్ద నేరం చేశాను. క్షమించరాని తప్పు చేశాను. కాబట్టి చెంపలేసుకుంటున్నాను. ఇకపై బీజేపీతో కలిసేది లేదు’.. 2004లో ఎన్నికలకు పోతూ చంద్రబాబు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో అద్వానీ రథయాత్రలో రథం నుంచి దిగిపోయి చేసిన వ్యాఖ్యలు..
‘మోదీ గొప్ప రాజకీయ పరిణతి గల నాయకుడు, ప్రజాస్వామ్యవాది, నేడు దేశానికి మోదీలాంటి వ్యక్తి చాలా అవసరం’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 2014 ఎన్నికలు వెళుతూ చంద్రబాబు మాట్లాడిన మాటలు..
ఇక 2018 వచ్చే సరికి.. ‘భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏం పాలిస్తాడు. దేశ ప్రజలు యోగక్షేమాలు ఏం చూస్తాడు. ఆయన ప్రధానమంత్రి పదవికి పనికిరాడు. ఏపీ ప్రజలను మోసం చేశాడు, మా ముఖాన మట్టి కొట్టాడు. ఆయన మాకు చేసిందేం లేదు. రాజకీయాలకు పనికిరాడు’.. ఇవి ముఖ్యమంత్రిగా చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు పెట్టి, రాహుల్‌గాంధీతోపాటు ఇతర బిజేపీయేతర పక్షాలను పిలిపించి మాట్లాడిన మాటలు
కాగా 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మళ్లీ స్వరం మారింది. ఇప్పుడాయన ఎప్పుడెప్పుడు మోదీ ఒళ్లో వాలిపోదామా అని చూస్తున్నారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మోదీ కటాక్ష వీక్షణల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో కలిసిపోవాలనే కోరిక బాబు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూటర్న్ రాజకీయాలను ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఎండగట్టారు. 2000 సంవత్సరం నుంచి ఇటీవల జాతీయ ఛానల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడటం వరకు.. బాబు ఎప్పుడు, ఎవరితో పొత్తులు పెట్టుకున్నాడు, ఎవరి కటాక్షం కోసం వెంపర్లాడాడో పూసగుచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ వీడియో మీకోసం...
Comments
Please login to add a commentAdd a comment