Devulapally Amar
-
చంద్రబాబు యూటర్న్ రాజకీయ లీలలు.. ఎండగట్టిన దేవులపల్లి అమర్
‘గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నరహంతకుడు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేని వాడు, అతన్ని మా రాష్ట్రానికి రానిచ్చే ప్రసక్తే లేదు, నియంత, మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయాలి’.. 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయ్‌ను డిమాండ్ చేసిన మాటలు ఇవీ.. ‘బీజేపీ మతతత్వ పార్టీ, ఆ పార్టీతో జతకట్టి నేను పెద్ద నేరం చేశాను. క్షమించరాని తప్పు చేశాను. కాబట్టి చెంపలేసుకుంటున్నాను. ఇకపై బీజేపీతో కలిసేది లేదు’.. 2004లో ఎన్నికలకు పోతూ చంద్రబాబు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో అద్వానీ రథయాత్రలో రథం నుంచి దిగిపోయి చేసిన వ్యాఖ్యలు.. ‘మోదీ గొప్ప రాజకీయ పరిణతి గల నాయకుడు, ప్రజాస్వామ్యవాది, నేడు దేశానికి మోదీలాంటి వ్యక్తి చాలా అవసరం’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 2014 ఎన్నికలు వెళుతూ చంద్రబాబు మాట్లాడిన మాటలు.. ఇక 2018 వచ్చే సరికి.. ‘భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏం పాలిస్తాడు. దేశ ప్రజలు యోగక్షేమాలు ఏం చూస్తాడు. ఆయన ప్రధానమంత్రి పదవికి పనికిరాడు. ఏపీ ప్రజలను మోసం చేశాడు, మా ముఖాన మట్టి కొట్టాడు. ఆయన మాకు చేసిందేం లేదు. రాజకీయాలకు పనికిరాడు’.. ఇవి ముఖ్యమంత్రిగా చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు పెట్టి, రాహుల్‌గాంధీతోపాటు ఇతర బిజేపీయేతర పక్షాలను పిలిపించి మాట్లాడిన మాటలు కాగా 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మళ్లీ స్వరం మారింది. ఇప్పుడాయన ఎప్పుడెప్పుడు మోదీ ఒళ్లో వాలిపోదామా అని చూస్తున్నారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మోదీ కటాక్ష వీక్షణల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో కలిసిపోవాలనే కోరిక బాబు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూటర్న్ రాజకీయాలను ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఎండగట్టారు. 2000 సంవత్సరం నుంచి ఇటీవల జాతీయ ఛానల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడటం వరకు.. బాబు ఎప్పుడు, ఎవరితో పొత్తులు పెట్టుకున్నాడు, ఎవరి కటాక్షం కోసం వెంపర్లాడాడో పూసగుచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ వీడియో మీకోసం... -
జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
సాక్షి,అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారని, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసేందుకు హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ వెల్లడించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరోనా కారణంగా ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతిచెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయగానే.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్థన్‌లు కూడా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్టు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జనరల్ సెక్రటరీ దేవులపల్లి అమర్ జాతీయ మీడియా-అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.పి. సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి అభీష్టం ఉన్నంత ఉన్నంతవరకూ అమర్ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి విధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. -
అటార్నీ జనరల్ వ్యాఖ్యలను ఖండించిన ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: అధికారిక రహస్యాల చట్టం కింద ‘ద హిందూ’పత్రికపై చర్యలు తీసుకుంటామంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యాఖ్యానించడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. రఫేల్ ఒప్పందంలోని దొంగలించిన డాక్యుమెంట్ల ఆధారంగా కథనాలు రాశారని ఆరోపిస్తూ ఈ హెచ్చరికలు చేయడం సరికాదని ఐజేయూ అధ్యక్షుడు, భారత ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్ సబీనా ఇంద్రజిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనే వేణుగోపాల్ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి ప్రభుత్వంలోని అవకతవకలను బయటపెట్టకుండా మీడియాకు, వర్కింగ్ జర్నలిస్టులకు పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ముందే అటార్నీ జనరల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్ తన ప్రకటనను వెనక్కు తీసుకుని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తమ వార్త కథనాలకు ఆధారాలను బయటపెట్టమని ఒత్తిడి చేయరాదని హిందూ పత్రిక అధినేత ఎన్.రామ్ చేసిన ప్రకటనకు వారు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. -
ఎవరితోనూ పొత్తు ఉండదు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : సాక్షి : పాదయాత్ర మీ కుటుంబానికి కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేశారు. ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన వారందరూ అధికారంలోకి వచ్చారు. మీరూ వస్తారని ఆశిస్తున్నా. గత 14 నెలలుగా చేస్తున్న పాదయాత్రలో మీరు చాలా విషయాలపై మాట్లాడారు. స్పష్టత కూడా ఇచ్చారు. కానీ ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రాలేదని బయట అనుకుంటున్నారు. కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా.. రాజకీయాలు వదిలేసి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పోరాటం నుంచి దూరమయ్యారన్న విమర్శ ఉంది. మీరు ఏమంటారు? జగన్ : పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. పోరాటం అసెంబ్లీలో 2014 నుంచి చేస్తూనే ఉన్నాం. చివరకు 2017 దాకా కూడా చేశాం. అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించగలిగాం. కానీ, ఆ అసెంబ్లీ పనితీరులో ప్రజాస్వామ్యం అసలు ఉందా? లేదా? అన్నట్టుగా తయారైంది. ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా అధికార పార్టీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించలేదు. వారి రాజీనామా కోసం అసెంబ్లీలో ఒత్తిడి చేశాం. దాదాపు రెండేళ్ల పాటు వేచి చూశాం. 2014లో శాసనసభ మొదలైతే ఆ ఏడాది చివరి నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పశ్చాత్తాపం గానీ చేసింది తప్పనే భావన గానీ ఎక్కడా లేకుండా పోయింది. అదే తప్పును నిస్సిగ్గుగా వరుసగా చేయడం మొదలు పెట్టారు. చివరకు ఆ సిగ్గు లేని తనం ఏ స్థాయికి చేరిందంటే వాళ్లల్లో నలుగుర్ని ఏకంగా మంత్రులను కూడా చేశారు. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉంది. చట్టసభలకు మనం ఎవరమైనా వెళ్లేది ఎందుకంటే చట్టాలను చేస్తామని. ప్రజలు మనవైపు చూసేది అందుకే. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సాక్షి : ప్రతిపక్షం లేని శాసనసభలో ప్రత్యేక హోదా మొదలు పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు మీరు మీ పాదయాత్ర ద్వారా సమాధానం ఇచ్చామనుకుంటున్నారా? జగన్ : తప్పకుండా.. అసెంబ్లీలో ఉన్నా అంతకన్నా జవాబు ఇచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. అసెంబ్లీలో అయితే అది కూడా ఇవ్వనివ్వరేమో... ఎందుకంటే అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎలాగూ ఖూనీ అయిపోయింది. 2014 నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక వ్యవస్థను ఆ స్పీకర్ అనే వ్యక్తే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించరు. ఏదైనా మాట్లాడబోతే మైకులు కట్ చేస్తారు. అడుగడుగునా అవాంతరాలు కల్పిస్తారు. అటువంటి పరిస్థితుల్లో జనం మధ్యనైనా మేము చెప్పదలచుకున్నది ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పగలుగుతాం. బాధితులు ప్రజలు. ప్రజల దగ్గరకే మేము పోతున్నాం. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అక్కడ జరిగిన అన్యాయాలు.. రాజధాని దగ్గర్నుంచి మొదలుకుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వరకు, చివరకు ఆయన ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ.. దాన్నే ధర్మపోరాట దీక్షలుగా మళ్లీ అభివర్ణిస్తూ ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారో, మోసం చేస్తున్నారో అవన్నీ ప్రజలకు అసెంబ్లీలో కన్నా మంచిగా వివరించగలిగాం. ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు మాదిరి బుక్కులు బుక్కులు తయారు చేయను. కులానికో పేజీ పెట్టి, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలన్న ఆరాటంతో మేనిఫెస్టో చెయ్యను. నా మెనిఫెస్టో ఒకటి.. మహా అయితే రెండు పేజీలుంటాయి. ఆ మేనిఫెస్టోలో అంశాలు ఇవీ అని ప్రజలకు చూపించి, ఓట్లు వేయించుకున్న తర్వాత నేను అది అమలు చేయలేకపోతే నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు మనస్తత్వం నాకు లేదు. నాకు అపారమైన విశ్వసనీయత ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే, చెయ్యగలిగితే ప్రజలకు మంచి చేస్తాను. సాక్షి : శాసనసభలో మీ సభ్యుల్ని కొనుగోలు చేసినట్టే లోక్‌సభలోనూ మీ సభ్యుల్ని టీడీపీ కొనుగోలు చేసింది. అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి చేసినట్టుగా లోక్‌సభ స్పీకర్‌పై అంత ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదన్న విమర్శ ఉంది? జగన్ : అక్కడా, ఇక్కడా తీవ్రంగానే ఆక్షేపించాం. తప్పుబట్టాం. అక్కడా ఇక్కడా అదే పరిస్థితి. టీడీపీ, బీజేపీలు ఇద్దరూ కలిసి నాలుగేళ్లు సంసారం చేశారు. అక్కడ వాళ్లు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని తొక్కిపెట్టారు. సాక్షి : ఇప్పుడు విడిపోయామంటున్నారు, ఇప్పుడైనా చర్య తీసుకుని ఉండాల్సింది కదా? జగన్ : ఆ మేరకు వ్యవస్థలు దిగజారిపోయాయి. బహుశా బీజేపీకి, చంద్రబాబుకు మధ్య లోపాయికారిగా సంబంధాలు కొనసాగుతున్నాయేమో.. సాక్షి : చంద్రబాబు నాయుడు తాజాగా మీ మీద చేసిన ఆరోపణ.. సీనియర్ మోదీ కేసీఆర్ అయితే జూనియర్ మోదీ మీర (జగన్)ని. అసలు మోదీ, సీనియర్, జూనియర్ మోదీలు ముగ్గురూ ముసుగులు తీసి కలిసి పోటీ చేయండంటున్నారు. మీరేమంటారు? జగన్ : మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఒకటుంది. అసలు ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరు ఎవరితో కాపురం చేస్తున్నారు? చేశారు? 2014 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ముగ్గురూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మా మీద యుద్ధం చేశారు. అప్పుడు వారన్న మాటలు కూడా చూడండి. జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు వేసినట్టే అని చంద్రబాబు అన్నాడు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు. తనకున్న ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ప్రచారం కూడా చేయించారు. ఆ తర్వాత ఏమి జరిగింది? 2014 ఎన్నికలు అయిపోయాయి. 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదేళ్లలో మేము ఎక్కడా కాంగ్రెస్ పార్టీతో కలవలేదు. కానీ అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2018 దాకా నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశాడు. ఆ సమయంలో బీజేపీని టీడీపీ, టీడీపీని బీజేపీ పరస్పరం విపరీతంగా పొగుడుకున్నాయి. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడం, చంద్రబాబు కోరిక మేరకు ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చెప్పడం.. దానికి ఏకంగా అసెంబ్లీలో ఈ చంద్రబాబు నాయుడు తీర్మానాలే చేసి బీజేపీని పొగడడం, చివరకు 2017 జనవరి 27న ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిందనడం, చేసి ఉంటే చెప్పండని ప్రతిపక్షాలను సవాల్ చేయడం జరిగింది. ఆ దశ వరకు ఆ ఇద్దరూ చిలకా గోరింకల్లా సంసారం చేశారు. కేవలం ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయనగా చంద్రబాబు నాయుడు తాను చేసిన మోసాలకు, అన్యాయాలకు, అవినీతి, అబద్ధాలకు ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలని బలిపశువు కింద కేంద్రంపై ఆరోపణలు నెట్టేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీని ఆవేళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అన్యాయంగా విభజించిందని చెప్పిన వ్యక్తి, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని అన్న వ్యక్తి, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి మళ్లా వస్తుందన్న ఇదే పెద్దమనిషి తానే కంకణం కట్టుకుని అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి అబద్ధాలు చెప్పారో ఈవేళ కూడా.. అదే ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయుడు గొప్పగా పాలిస్తాడు, గొప్పగా మేలు చేస్తాడనే పాత హామీలనే మళ్లీ తెరపై చూపిస్తున్నాడు. ఏదైనా ఆరోపణ చేయాలంటే దానికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి. కానీ చంద్రబాబు చేసే వాటికి అటువంటివేమీ ఉండవు. ఆ మనిషి ఏది చెప్పాలనుకుంటే అది చెబుతాడు, తాను ఏది చేస్తే అది కరెక్టు, అలా కాదన్నవాళ్లపై బురద జల్లుతారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాల పాలన అనైతిక పొత్తుల్లోనే కాదు.. నాలుగున్నరేళ్ల పాలనలోనూ అదే కనిపిస్తుంది. ఆయన నైజమే అంత. ఎన్నికలప్పుడు రైతులకు 87,612 కోట్ల రూపాయల పంట రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈవేళ ఏమైంది? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణ మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబూ ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటీ? ఆయన చేసిన మోసంతో రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ కాకపోగా సున్నా, పావలా వడ్డీలకు రుణాలు రాకుండా పోయాయి. సున్నా, పావలా వడ్డీల కోసం గత ప్రభుత్వాలు వీళ్ల తరఫున వడ్డీ డబ్బులు కట్టేవి. చంద్రబాబు వచ్చాక ఆ డబ్బుల్ని కట్టకుండా అన్యాయం చేశాడు. ఆయన చేసిన మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఏ చదువు లేకపోయినా పర్వాలేదమ్మ.., ఇంటింటికీ ఉద్యోగమో, ఉపాధో చూపిస్తా. లేకుంటే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ రెండు వేలూ పోయే, ఉద్యోగాలూ రాలేదు, చివరకు ఉద్యోగాలు వచ్చేందుకు అంతో ఇంతో అవకాశం ఉన్న ప్రత్యేక హోదానూ ఖూనీ చేశారు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, మోసాలే. దారుణమైన పరిపాలన. ఎదుటి వాళ్ల మీద బురద జల్లడం, మీడియా మేనేజ్మెంట్ వంటి అన్యాయమైన పాలన చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు దాన్ని ఖూనీ చేశాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని, అదేమన్నా సంజీవినా అన్నాడు. హోదా అంటే జైల్లో పెడతాను. పీడీ యాక్ట్ తెరుస్తాను అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాట్లాడితే ఇక ప్రత్యేక హోదా సాధన ఎలా జరుగుతుంది? కాబట్టి వీళ్ళందరూ మోసం చేశారు. అలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేశాడు. హోదాకు మద్దతుగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని కూడా అన్నాడు. అంటే ప్రత్యేక హోదా కోసం మన 25 మంది ఎంపీలు వినిపిస్తున్న వాణికి మరో 15 మంది తోడవుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చిన ప్రత్యేక హోదా కావాలని అడిగే స్వరం 25 నుంచి 42 మందికి పెరిగింది. ఆ అడుగు వేసేందుకు కేసీఆర్ ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. సాక్షి : తెలంగాణ ఫలితం చూశారు కదా.. మీకు ఏమనిపించింది? జగన్ : ప్రజలు చంద్రబాబు అనుకున్నంత పిచ్చోళ్లు కాదు. అది చంద్రబాబుకు అర్థం అయ్యేలా ప్రజలు బుద్ధి చెప్పారు. బయటి నుంచి ఎవరైనా మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే ఏమిటీ వ్యవస్థ అనిపిస్తుంది. రాజకీయ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఈ రాజకీయ నాయకుల్ని ఎలా క్షమించగలం అనేలా వ్యవస్థను దిగజార్చారు. అటువంటి అన్యాయమైన పరిస్థితిలోకి ఈ వ్యవస్థను దిగజార్చి మళ్లీ అవే అబద్ధాలతో తెలంగాణకు వెళ్లి అవే మాటల్ని చెబితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు నిజంగా చైతన్యవంతులు కాబట్టి.. జరుగుతున్నది చూస్తున్నారు కాబట్టి.. అనైతిక పొత్తులకు, అనైతిక వ్యవహారాలకు తెర దింపే విధంగా తీర్పు ఇచ్చారు. అత్యధికంగా ఆంధ్రా సెటిలర్లు ఉన్న ఏరియా హైదరాబాద్. అనైతిక పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు 40, 50, 60 వేల తేడాతో గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లోనే ఓడిపోయిన పరిస్థితి. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లే ఓటేయలేదంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు చంద్రబాబుపై ఏ స్థాయిలో కోపం పెంచుకుని ఉన్నారో అనేదానికి అదే నిదర్శనం. సెటిలర్లే ఓటేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు వేస్తారు? సాక్షి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చంద్రబాబును ఉద్దేశించి ఒకమాట అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో నేను ఇక మొదలు పెడతానన్నారు? జగన్ : కేసీఆర్ గారు ఏమన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు గానీ వాస్తవం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ గారు ఏదయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడిన మాటల్ని స్వాగతించాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను ప్రధాన మంత్రికి లెటర్ కూడా రాస్తానని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తానన్న మాటలు హర్షించదగినవి. ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని చట్టంలో చేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడింది. అదే కాంగ్రెస్ పార్టీ ఆవేళ రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉన్నా బాగుండేది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీ కలిసి ఏమి చెప్పారో ఈవేళ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కలిసి అవే హామీలు ఇస్తున్నారు. సినిమా ఒక్కటే.. యాక్టర్లే వేరు. ఇందులో విరుద్ధ (ఐరానిక్) విషయం ఏమిటంటే ఇద్దరితోనూ కాపురం చేసింది చంద్రబాబే. బీజేపీతో కాపురం చేసి విడాకులు ఇచ్చారు, మళ్లీ కాంగ్రెస్‌తో సంసారం చేస్తున్నాడు. ఇద్దరితోను కాపురం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెసే. మరి ఏ రకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. తలాతోకా ఉండదు. సాక్షి : మీరు ప్రత్యేక హోదా సాధించుకునే క్రమంలో ఇలా చెబుతున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నదేమిటి? తాను తెలంగాణకు వెళ్లి పోటీ చేస్తే టీఆర్ఎస్ దాన్ని సెంటిమెంట్‌కు ఎలా వాడుకుందో, ఇక్కడా అదే రీతిలో తెలంగాణ సీఎం వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలవబోతున్నాడని, జగన్, మోదీ, కేసీఆర్ కలవబోతున్నారని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. దానివల్ల ఇక్కడ ఎలాంటి పరిణామాలుంటాయి? జగన్ : అక్కడా కేసీఆర్.. కాంగ్రెస్, మోదీతో విభేదించి పోటీ చేశాడు. మోదీ హైదరాబాద్‌కొచ్చి తిట్టిపోయాడు. కేసీఆర్ కూడా మోదీని తిట్టాడు. కాంగ్రెస్, బీజేపీతో పోటీపడి ఆయన గెలిచాడు. ఎక్కడా కూడా బీజేపీతో కలిసి పోటీ చేసిందీ లేదు. కలిసి సపోర్ట్ చేసిందీ లేదు. పోనీ ఐదేళ్లలో ఆయన చేశాడా అంటే అదీ లేదు. అంతో ఇంతో చంద్రబాబు నాయుడు బీజేపీతో సంసారం చేశాడు తప్ప, ఆయనేం చేయలేదు. అదే వ్యక్తితో పొత్తు పెట్టుకునేందుకు ఇదే చంద్రబాబు నాయుడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో ప్రతిపాదన చేశానని నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. ‘తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, కలిసి పోటీ చేద్దామని నేను ప్రతిపాదించాను. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు. అందుకే నేను కాంగ్రెస్‌తో జత కట్టాన’ని తనంతట తానే చెప్పాడు. ఇది చెప్పి రెండు నెలలు కాలేదు. అక్టోబర్‌లో హరికృష్ణ చనిపోయాడు. ఇది జరిగి నాలుగు నెలలు కాలేదు. అంటే నాలుగు నెలల క్రితం కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆయనే సంసిద్ధత వ్యక్తం చేశాడు. అంటే దానర్థమేంటి? కేసీఆర్ మోదీతో లేనట్టే కదా? అలాంటి చంద్రబాబు నాలుగు నెలల తర్వాత చెప్పిందేంటి? ఆయన తప్ప కేసీఆర్, నేను మోదీతో ఉన్నామట. సాక్షి : 2014 ప్రస్తావన తెచ్చారు మీరు. పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి టీడీపీ అధికారంలోకొచ్చింది. అదీ ఒకటి ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో. అప్పట్లో మీరు అలాంటిదేదన్నా చేసుంటే అధికారంలోకి వచ్చుండే వారు. ఇప్పటికైనా పవన్‌తో పొత్తు పెట్టుకుంటే మీకు అధికారం చాలా సులభంగా వస్తుందని చెబుతున్నారు. జగన్ : రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు. ఈ పరిస్థితికి ఎవరు కారణమని ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్. ఆ రోజు ముగ్గురూ ఒక కూటమిగా ఏర్పడి, ప్రతీ హామీని మేం నెరవేరుస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇదే పవన్‌కళ్యాణ్ ఊరూరా తిరిగి చంద్రబాబుకు ఓటేయమన్నాడు. ఆయనకు అనుభవం ఎక్కువగా ఉందని, ఆయనిచ్చిన హామీలకు తాను పూచీ అంటూ చెప్పాడు. చంద్రబాబు గురించి చెప్పాడు. మోదీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాడు. ఎన్నికలయిపోయిన తర్వాత జరిగిందేమిటి? ప్రత్యేక హోదా విషయమే కాకుండా, రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, చదువుకున్న పిల్లలను.. అందరినీ చంద్రబాబు ఎలా మోసం చేశాడు? ఆయన మేనిఫెస్టో చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా చేస్తానని ప్రతీ కులాన్ని నమ్మించాడు. తన చేతుల్లో లేనిది కూడా చెప్పి ప్రతి కులాన్నీ మోసం చేశాడు. మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక పేజీ కేటాయించాడు. ఎంత నేర్పుగా మోసం చేయగలమన్న దానిపై పీహెచ్డీ చేసి మరీ మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం నోటీసులు రైతుల ఇళ్లకు వస్తున్నాయి. చివరకు ఆయన చేసిన రుణమాఫీ అన్నది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతుల రుణాలు ఆవేళ 87,612 కోట్ల రూపాయలు ఉంటే 2018 వచ్చే సరికి రైతుల రుణాలు 1,26,000 కోట్లకు చేరాయి. వడ్డీలకు వడ్డీలు తడిసి మోపెడయి ఈయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. సాక్షి : మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. హోదా ఇస్తానన్న పార్టీకే మద్దతిస్తామంటున్నారు. రాçహుల్ గాంధీ హోదా ఇస్తానంటున్నాడు. కాంగ్రెస్‌తో కలిసిపోతారా? జగన్ : నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇప్పటి వరకూ మేం చాలా మోసపోయాం. హోదా ఇస్తామని అంతా మోసం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ హోదాను చట్టంలో చేర్చకుండా మోసం చేసింది. బీజేపీ చేస్తానని ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. వాళ్లూ మోసం చేశారు. ఎవరో ఏదో చేస్తామని చెబితే నమ్మే పరిస్థితుల్లో మేం లేం. ఏపీ ప్రజలను కోరేది ఒకటే. 25కు 25 ఎంపీ స్థానాలను మనం సొంతం చేసుకుందాం. ఎవరికీ మద్దతునివ్వాల్సిన పనిలేదు. గెలిచిన తర్వాత సంతకం పెట్టు మద్దతిస్తామందాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి హోదాకు సంతకం పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. ఇవాళ మద్దతిస్తే.. ఇప్పుడు జరిగినట్టే మళ్లీ వాళ్లు చేతులెత్తేస్తే హోదా ఇవ్వకపోతే ఎవరిని అనగలుగుతాం? సాక్షి : సంతకం పెట్టాలంటే వాళ్లు అధికారంలోకి రావాలిగా? జగన్ : ఆ పరిస్థితి ఉంటేనే. ప్రధాని అయిన ఒకటో రోజో.. రెండో రోజో హోదా ఇస్తానని చెప్పు. అప్పుడు నేనొస్తా. చంద్రబాబునాయుడు మాదిరి నాలుగేళ్లు నిరీక్షించే అవకాశమే ఉండదు. వారమో... రెండు రోజులో ఎప్పుడో చెబితే నేను మద్దతిస్తా. సాక్షి : పోలవరం, అమరావతితో పాటు తాను చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మేం రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ ఆపేస్తాడని చెబుతున్నారు.. జగన్ : అసలు అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? పోలవరం ప్రాజెక్టు పునాది దాటి ముందుకెళ్లలేదు. గట్టుదాటి ముందుకు కదల్లేదు. ఒక బొట్టు నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు. డీపీఆర్ ఇంకా అవ్వలేదు. 48 గేట్లకు ఒకే ఒకటి పెట్టారు. ఒకటి పెట్టడానికి రెండు నెలలు పడుతుందట. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇక రాజధాని వ్యవహారం ఓ పెద్ద స్కాం. ఇంతకన్నా పెద్ద స్కాం ప్రపంచంలో ఎక్కడా కన్పించదేమో. రాజధాని ప్రాంతం ఎందుకు ముందుకు కదలడం లేదంటే అది స్కాం కాబట్టే. పర్మినెంట్ అనే పేరుతో రాజధానిలో ఒక్క ఇటుకా పడలేదు. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం ఏదీ లేదు. హైకోర్టు భవనం కూడా తాత్కాలికమే. ఆ తాత్కాలిక భవనాల నిర్మాణానికి అడుక్కు రూ.10 వేలు. మళ్లీ భూమి ఉచితంగా వచ్చిందే. ఇక దాని నాణ్యత ఎలాంటిదంటే, బయట మూడు సెంటీమీటర్లు వర్షం పడితే, లోపల ఆరు సెంటీమీటర్లు నీళ్లొస్తాయి. అభివృద్ధి పేపర్ మీదే తప్ప ఎక్కడన్నా కన్పిస్తోందా? తనకున్న ఎల్లో మీడియా సామ్రాజ్యంతో, తనకున్న ఛానళ్లు, పేపర్లతో మభ్యపెట్టేందుకు చేస్తున్న గోబెల్స్ ప్రచారమే తప్ప అభివృద్ధి ఉందా? సాక్షి : అభివృద్ధి గురించి శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా? జగన్ : శ్వేతపత్రాల్లో ఉన్నదంతా పూర్తిగా అవాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో ఏం జరుగుతోందనేది ఏ సామాన్యుడిని అడిగినా చెబుతారు. ఎంత అన్యాయమైన, దౌర్భాగ్యమైన పాలన సాగుతుందనేది అందరూ చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అనే పదానికి అర్థమేంటి? పేదవాడి ఇంట్లో మంచి జరిగితే, పేదవాళ్లకు మంచి జరిగితే, పేదవాడి పొలంలో మంచి జరిగితే, పేదవాడు వెళ్లే స్కూల్లో మంచి జరిగితే, హాస్పిటల్లో మంచి జరిగితే అదీ అభివృద్ధి. ఇలా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అంతా దిగజారిపోయింది. చివరకు పంట పడించే సాగు విస్తీర్ణం తగ్గిన పరిస్థితి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనిపిస్తోంది. పంట దిగుబడి తగ్గిన పరిస్థితి ఉంది. దీన్ని అభివృద్ధి అంటారా? ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో పెట్టి ఉంటే కనీసం సుప్రీంకోర్టుకన్నా వెళ్లి దాన్ని అమలు చేయమని అడిగే పరిస్థితన్నా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఆ రెండూ చేయకుండా ఆ విధంగా అన్యాయం, మోసం చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా. వాళ్లు అధికారంలో ఉన్నారు.. చేసే హోదాలో ఉన్నారు, చేస్తామని పార్టీ ప్రణాళికలో పెట్టారు. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని మాట్లాడారు. మోదీ అయితే ఏకంగా తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. చేసే పొజిషన్లో ఉండి చేయకుండా వాళ్లు రాష్ట్రానికి అన్యాయం చేశారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం సాక్షి : విడిపోయిన రాష్ట్రానికి రాజధాని అవసరం కదా? జగన్: అక్కడ జరిగిన స్కాంలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు. ఫలానా చోట రాజధాని వస్తుందని తనకు తెలిసి ఉన్నా, నూజివీడు ప్రాంతంలో వస్తుందని, నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందంటూ తప్పుదారి పట్టించారు. మేలో తాను అధికారంలో కొస్తే, డిసెంబర్ చివరి దాకా రాజధాని ఎక్కడొస్తుందనేది చెప్పలేదు. కానీ రాజధాని ఎక్కడొస్తుందనేది మాత్రం ఆయనకు, ఆయన బినామీలకు మాత్రం తెలుసు. అందరినీ పక్కదారి పట్టించి, ఆయన, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ ఏకంగా 14 ఎకరాలు కొనుగోలు చేసింది. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అనౌన్స్మెంట్ చేసే మధ్య కాలంలో కొనుగోలు చేశారు. ఎక్కడ రాజధాని వస్తుందనేది తెలిసి రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు ముఖ్యమంత్రి, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ మొదలు పెట్టారు. అదెంత అన్యాయమంటే, తను, తన బినామీల భూములను మినహాయించారు. లింగమనేని అనే వ్యక్తి విషయాన్ని చూస్తే, ఆయన భూముల దాకా వచ్చి ల్యాండ్ పూలింగ్ ఆగిపోతుంది. ఇక్కడేమో లింగమనేని తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. కొంతమంది బినామీలను ల్యాండ్ పూలింగ్‌లో తక్కువ శాతం భూములిచ్చేట్టు వాడుకున్నాడు. ఎక్కువ శాతం బినామీల భూములు పూలింగ్‌కు ఇవ్వకుండా ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ, గుంటూరు జిల్లాలు జోనింగ్ అన్నాడు. తన బినామీలకు చెందిన భూములను రియల్ ఎస్టేట్ జోన్లలో పెట్టాడు. మిగతా రైతులు పోటీకి రాకూడదని వాళ్లను వ్యవసాయ జోన్లో పెట్టాడు. ఆ తర్వాత మరో స్కాం. ఇంకో అడుగు ముందుకేశాడు. తను రైతుల దగ్గర్నుంచి బలవంతంగా సేకరించిన భూమిని తన ఇష్టమొచ్చిన రేట్లకు, ఇష్టమొచ్చినన్ని ఎకరాలు, ఇష్టమొచ్చిన వ్యక్తులకు శనక్కాయలు, బెల్లాలకు కట్టబెట్టాడు. రాజధాని భూముల్లో ఈ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు జరుగుతుంటే ఇవి విచారణకు పోవా? రాజ్యాంగ అవసరాలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోనని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. దీన్ని ఓత్ ఆఫ్ సీక్రసీ అంటారు. స్టాక్ మార్కెట్లో ఇలాగే చేస్తే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇలా చేస్తే సాధారణంగా బొక్కలో పెడ్తారు. అలాంటి నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తి, ఇంత అవినీతి చేసిన పరిస్థితుల్లో వాటిపై విచారణ కచ్చితంగా జరుగుతుంది. అసలు రాజధాని అంటే ఏమిటనేది ఓ స్పష్టత ఉండాలి. రాజధాని అంటే ఓ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు. ఈ మూడు ఎక్కడుంటే అది రాజధాని. మిగిలిందంతా రైతులను ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రిగా ఆయన చేసే పనేంటి? ఎలా సంపాయించుకుని బాగుపడాలని ఆలోచించడం కాదు. రైతులు ఎలా బాగుపడాలని ఆలోచించాలి కదా? రియల్ ఎస్టేట్ చేయాలంటే రైతులకు అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మనమేంటి తక్కువకు తీసుకుని, ఇష్టమొచ్చినవాళ్లకివ్వడం? ఎంటైర్ ల్యాండ్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్. రైతుల దగ్గర్నుంచి అటువంటి పరిస్థితులు లేని భూమి ఉంటే చూడాలి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా చేస్తే ఫర్వాలేదు గానీ, రైతుల దగ్గర్నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి అన్యాయం చేయాలన్న రీతిలో అవినీతి చేయడం నిజంగా దుర్మార్గం. చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది. అదే కోడి కత్తి పొరపాటున భుజంపైన తగిలింది. అదే గొంతు మీద తగిలి.. మూడు సెంటీమీటర్ల లోతు తెగితే మనిషి బతికుండే వాడా? ప్రమాదకరమైన పథకం వేశారనేందుకు ఇదే నిదర్శనం. సాక్షి : 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మీ విశ్వసనీయత పెరగడానికి అలవికాని హామీలు నేను ఇవ్వనన్నారు. రైతు రుణమాఫీని సమర్థించనన్నారు. అందువల్ల విశ్వసనీయత పెరిగింది. ఇప్పుడు మీరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు కాకుండా పాదయాత్ర సందర్భంగా అన్ని సామాజిక వర్గాలకు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే వీటన్నింటినీ పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? జగన్ : రైతు రుణమాఫీని నేను సమర్థించను అని నేను ఏనాడూ అనలేదు. అది చెయ్యలేనిది, సాధ్యం కానిదనే ఆ రోజు చెప్పాను. నిజంగా కేంద్రం ముందుకొచ్చి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానంటే నా కన్నా సంతోష పడేవాళ్లు ఎవరూ ఉండరు. బంగారంగా చెయ్యమనే చెబుతాను. కానీ సాధ్యమవుతుందా? కాదా? అనేది తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయనకూ తెలుసు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఏమిటి? నంబర్ ఏమిటి? ఏమేర చెయ్యగలుగుతాం? చెయ్యలేము అనేది ప్రతిపక్ష నాయకుడిగా నాకూ అవగాహన ఉంది. నాకూ సలహాదారులున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై సరైన అవగాహనతో ఉన్న వ్యక్తిని నేను. బాధ్యతగల వ్యక్తులుగా మనం మాట్లాడాలి. ముఖ్యమంత్రిగా కాగల వ్యక్తులమని చెప్పి ప్రజల దగ్గర ఓట్లడుగుతున్నాం. అలాంటి మనకు విశ్వసనీయత ఉండాలి. మనం ఏదైనా మాట చెప్పి, అది చెయ్యలేకపోతే ప్రజలు మనల్ని క్షమించరు. చరిత్ర హీనులమవుతామనేది అర్థం కావాలి. దేవుడు ఆశీర్వదించి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు మాదిరి ఈ రోజు ఎంత సంపాదించాను, రేపు ఎంత సంపాదిస్తాననే అలోచన కోసం రావడం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం అంతకన్నా లేదు. నాకు ఒక్కదాని మీదే వ్యామోహం ఉంది ఒక్కటే... చరిత్ర సృష్టించాలి. ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్తే ప్రజలకు ఎంత మంచి చేయాలంటే... ఆ మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలనేది నా కల. దాని కోసం తాపత్రయపడుతున్నాను. దేవుడు ఆశీర్వదించి నాతో చేయించగలిగితే అది చేస్తాను. నాతో కుదరదు అంటే నేను తప్పుకుంటాను. ఇంకొకటి లేదు. సాక్షి : రైతులకు తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మమతా బెనర్జీ కూడా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇలాంటిది ఏమైనా చేస్తారా? జగన్: వీరందరికంటే ముందు రైతు భరోసా అని చెప్పింది మనం. ఈ స్కీమ్ గురించి ఎవరూ చెప్పకముందే నా పాదయాత్రకు ముందు గుంటూరులో జరిగిన మా పార్టీ ప్లీనరీలో నవరత్నాల సందర్భంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించాం. తర్వాత కొన్ని నెలల తర్వాత పాదయాత్ర ప్రారంభించా. ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు మే మాసంలోనే ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు ఇస్తామని నవరత్నాల్లో భాగంగా ప్లీనరీలో ప్రకటించాం. వీళ్లెవరూ ఆలోచించకముందే నేను చెప్పిన మాట ఇది. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అర హెక్టారు (1.25 ఎకరాల లోపు భూమి) భూమి ఉన్న కుటుంబాలు అక్షరాలా 42 లక్షలు ఉన్నాయి. అనగా రైతు కుటుంబాల్లో సగమన్నమాట. హెక్టారు వరకూ ఉన్న వారిని తీసుకుంటే ఈ 42 లక్షలకు మరో 19 లక్షల కుటుంబాలు కలుస్తాయి. అనగా సుమారు 60 లక్షల కుటుంబాలు. అనగా మొత్తం రైతుల్లో 70 శాతం మంది హెక్టారు (2.5 ఎకరాల లోపు భూమి ఉన్న)లోపు ఉన్న వారే. అందువల్ల ఎకరాకు ఇంత అని ఇస్తే వీరు ఎప్పటికీ బాగుపడరు. ఆ రోజుల్లో వీళ్లెవరూ చెప్పకముందే రైతుల కోసం మేం రూ.4 వేలు ఇవ్వాలా? రూ.5 వేలు ఇవ్వాలా? రూ.8 వేలు ఇవ్వాలా? అని ఆలోచన చేశాం. అయితే రూ.8 వేలు లేదా రూ.9 వేలు ఇచ్చినా ఇలాంటి చిన్న రైతులకు నేను మేలు చేయలేను. అందువల్లే రైతు కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామని చెప్పాం. పెద్ద రైతులకు బహుశా మనం ఇచ్చేది పెద్ద ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ చిన్న రైతులకు మనం ఇచ్చే మొత్తం వల్ల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గనుంది. బహుశా చాలా పంటలకు ఉత్పత్తి వ్యయాన్ని మనం ఇచ్చినట్లవుతుంది. అప్పు పుట్టని పరిస్థితిలో ఉన్న పేద రైతులకు రూ.12,500 చేతిలోకి వస్తుంది. రెండోది ఏమంటే ఒకవేళ రుణమాఫీ లాంటి పథకాలకు పోయామంటే అవి రైతులకు చేతికి రావు. బ్యాంకుల్లోకి వెళ్లిపోతాయి. దానివల్ల రైతులకు మానసికంగా అప్పులు తీరిపోయినట్లు అనిపిస్తుందే గానీ రైతు జీవితం బాగుపడదు. ఆ రోజు నవరత్నాల గురించి మాట్లాడిన సందర్భంగా ధరల స్థిరీకరణ నిధి గురించి కూడా చెప్పా. ఈ రోజు చంద్రబాబు అనే వ్యక్తి దళారీలకు కెప్టెన్ అయ్యారు. నువ్వే (చంద్రబాబు) వ్యాపారిగా, దళారీలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు రైతులు ఎన్నడూ బాగుపడలేరు. మేమైతే రూ.3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కరువు లేదా వరదలు వస్తున్నాయి. అందువల్లే రూ.4,000 కోట్లతో విపత్తు సహాయక నిధి తీసుకొస్తామని చెప్పాం. నవరత్నాల్లో ఇవన్నీ ఉన్నాయి. రూ.2,000 కోట్లు రాష్ట్రం పెడితే రూ.2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. సాక్షి : ఆంధ్రప్రదేశ్‌కు మేం రూ.20 వేల కోట్లు ఇస్తే ఎవరి జేబుల్లోకి పోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు కదా? దీనిని బట్టి ఏమనిపిస్తోంది? జగన్ : 2017 జనవరి 27న చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసినంత మేలు ఏరాష్ట్రానికైనా చేసిందా? అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంటే దాని అర్థం 2014 – 15, 2015 – 16, 2016 – 17 బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన సహాయం ఓకే అన్నట్లే. ఎందుకంటే వీళ్లే (టీడీపీవారే) కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో వీరి మంత్రులు ర్యాటిఫై చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు మైక్ పట్టుకుని బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని, మోదీ బాగా చేస్తున్నారని పొగిడారు. 2017 – 18 బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి నెల ముందు అంతా బాగుందని మోదీని పొగిడారు. మరి.. చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి డబ్బు రాలేదనడం ఏమిటి? నన్ను ప్రేమించే వారెవరైనా నన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధపు ఫ్లెక్సీని సృష్టించారు. ఆ ఫ్లెక్సీ మీద గరుడ పక్షి ఫొటో పెట్టారు. ఎవరైనా ఫ్లెక్సీ వేసేవారు గరుడ పక్షిని పెడతారా? మా అమ్మ ఫొటోనో, మా నాన్న ఫొటోనో పెడతారు. సాక్షి : బహుశా సమకాలీన భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల్లో మీరు నష్టపోయినంతగా ఎవరూ నష్టపోయి ఉండరు. వాటిని అడ్డుకోవడానికి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? జగన్ : రాజకీయ నాయకుడికి తనమీద తనకు నమ్మకముండాలి. ప్రజలమీద నమ్మకముండాలి. దేవుడి మీద నమ్మకముండాలి. ఫలానా ఎమ్మెల్యే రావడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకో. యూ షుడ్ హావ్ ద కరేజ్.. రాజీనామా చేసి రమ్మను. వచ్చిన తర్వాత బై ఎలక్షన్ కు వెళ్లు. మీ పార్టీ గుర్తుతో గెలిపించుకో. సాక్షి : అది మీరు చేస్తున్నారు.. అన్ని రాజకీయ పార్టీలు అలా చేయడం లేదు కదా.. ఇటీవల మాకు గాంధీభవన్‌లో జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు. అందుకే మా శాసనసభ్యులు అమ్ముడు పోతున్నారని ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్నారు. ఓ జాతీయ పత్రికలో వార్త వచ్చింది. జగన్ : వాళ్ల నాయకుడు రాహుల్‌గాంధే అమ్ముడు పోయినప్పుడు కింది వాళ్లను అని ఏం లాభం. ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబునాయుడు మీద 2018లో జూన్ 8, జూన్2న పుస్తకాలు రిలీజ్ చేశారు. నాలుగేళ్ల బాబు అవినీతి పాలన మీద రాహుల్‌గాంధీ ఫొటో పెట్టి అన్యాయపు పరిపాలనపై చార్జిషీట్ అనే పేరుతో పుస్తకం రిలీజ్ చేశారు. ఇది జరిగి మూడు నెలలు తిరక్క ముందే బాబు అవినీతి సొమ్ములో వాటా ఇవ్వగానే, ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకుని అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. పై వాళ్లకే లేనప్పుడు చిన్న చిన్న ఎమ్మెల్యేలు, చిన్నా చితక లీడర్లకు విలువలుండాలని ఎక్స్పెక్ట్ చెయ్యడం కూడా తప్పే. సాక్షి : మీరు అవకాశం ఇవ్వనందునే రాహుల్ గాంధీ చంద్రబాబుతో వెళుతున్నారని అంటున్నారు? జగన్ :అవకాశం ఇవ్వాలి అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చెయ్యాలి. నీ బలం మీద నువ్వు పోటీ చెయ్యి. ప్రజలను నమ్ముకో. నువ్వు కష్టపడు. ఎవడో సపోర్ట్ చెయ్యాలి, ఎవడి భుజాలమీదో పరుగెత్తాలని అనుకుంటున్నావ్. నువ్వే విలువలను అమ్మేసుకుని, నువ్వే దిగజారిపోయి, రాంగ్ మెసేజ్ ఇచ్చావ్. నీకే విలువలు లేనప్పుడు వాళ్లు అమ్ముడు పోతే తప్పేముంది? సాక్షి : జనవరిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ తరహాలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాడని చెబుతున్నారు. మీరు కూడా ఇచ్చాపురం బహిరంగ సభలో అలాంటి సంచలన ప్రకటన ఏమైనా చెయ్యబోతున్నారా? జగన్ :అలాంటిదేమీ లేదు. అనౌన్స్ చెయ్యడమే ఒక సంచలనం అని ఎందుకనుకోవాలి? ఈ రోజుకు కూడా పాదయాత్ర జరుగుతూండగానే పార్లమెంటరీ వ్యూస్ తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌ను పిలిపించుకుని మాట్లాడుతున్నాం. మేము చేయించుకుంటున్న సర్వేలను బట్టి.. వాటిపై ఒకరికొకరం డిస్కస్ చేసుకుంటున్నాం. సాక్షి : ఎలక్షన్ మేనేజ్మెంట్లో చంద్రబాబును మీరు తట్టుకోలేరని కదా? జగన్ :బేసికల్లీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే.. ‘సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్’ అని సామెత ఉంది. శ్రీశ్రీ గారు తెలుగులో ఇలాంటివే చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ నేను నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరు. నెత్తురు కక్కుతూ నేను నేలకు ఒరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే. క్లిక్ అయితే నువ్వు అపర మేధావివి. కాలేదనకో నీకు తొందరెక్కువ.. నీకు దుడుకెక్కువ అంటూ.. ఇవన్నీ సర్వ సహజంగా జరిగేవే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏది చేసినా విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ప్రజలు మన జడ్జిలు, దేవుడు మన జడ్జి అనేది ఎప్పుడూ మరచిపోకూడదు. అదే నేను నమ్ముతా. సాక్షి : ఎప్పుడైనా ఏ మూలనైనా ఎందుకీ రాజకీయాలు అని విరక్తి కలిగిందా? జగన్ : ఒక్కోసారి అనిపిస్తుంది.. కానీ ఇన్ని కోట్ల మంది.. లాస్ట్ ఎలక్షన్స్‌లో 1.30 కోట్ల మంది నన్ను నమ్మి నాకు ఓట్లేశారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసినా ఆయనకు 1.35 కోట్ల మంది మాత్రమే ఓట్లేశారు. నాకంటే కేవలం 5 లక్షల మందే ఎక్కువ. కోటి ముప్పయి లక్షల మంది నామీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసినప్పుడు కష్టాలు వచ్చినాయి కదా అని వదిలేసి పోతే.. వీళ్లందరికీ అన్యాయం చేసినవాడినవుతానేమోనన్నది ఆల్వేస్ బిహైండ్ మై హెడ్. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రావాలి. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు కూడా వస్తుంది కదా.. బాబు ఇక్కడ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు. తెలంగాణకు పోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యపు పని లేదంటాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఓడించండని ప్రజలకు పిలుపునిస్తాడు. ఆంధ్రాలోనేమో ఎమ్మెల్యేలను నిర్లజ్జగా కొనుగోలు చేసి నలుగుర్ని మంత్రుల్ని చేస్తాడు. మళ్లీ అదే వ్యక్తి తెలంగాణకు పోయి మరోమాట మాట్లాడతాడు. ఆంధ్ర రాష్ట్రం ఒక మనిషి అనుకుంటే దాన్ని పొడిచెందెవరు? ఒకరు కత్తిచ్చారు. ఇంకొకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మూడో వ్యక్తి పొడిచాడు. ఇందులో ముగ్గురూ నేరస్తులు. అలాంటి వ్యక్తులు కూటమిగా వచ్చినా, విడివిడిగా వచ్చినా ఢీకొంటాం. ఇంతకు ముందు కూడా మేం కాంగ్రెస్, బీజేపీ.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోం. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకమెక్కువ. కాబట్టి ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. హైకోర్టును విభజించండని అఫిడవిట్ ఇచ్చింది బాబే సాక్షి : జగన్‌పై ఉన్న కేసుల విచారణను జాప్యం చేయడం కోసమే హైకోర్టును విభజించారు. హడావుడిగా విజయవాడకు తీసుకొచ్చారనే ఆరోపణపై మీరేమంటారు? జగన్ :అసలు నాకు అర్థం కానిదేమంటే, హైకోర్టుకు, నాకు సంబంధం ఏముంది? హైకోర్టును విభజించాలని, వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని నేను ఎన్నడూ కోరలేదు. నేను ఏనాడూ డిమాండు చేయలేదు. నేను ఏనాడూ లేఖ రాయలేదు. పది సంవత్సరాలు మనకు హైదరాబాద్‌లోనే ఉండటానికి హక్కుంది. నువ్వు అక్కడింత వరకూ పర్మినెంట్ అనే పేరుతో ఒక్క భవనం కట్టలేదు. పర్మినెంట్ అనే పేరుతో హైకోర్టే కట్టకుండా హైకోర్టును షిఫ్ట్ చేయాలని ఏ బుద్ధి ఉన్న వాడూ అడగరు. ప్రతిపక్ష నాయకుని బాధ్యతలో నేనున్నప్పుడు అసలు అడగనే అడగను. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి జరుగుతుందో పూర్తిగా తెలిసి ఉండి కూడా హైకోర్టును ఎట్టిపరిస్థితుల్లోనూ విభజించండని విజ్ఞప్తి చేస్తూ.. దానికి సంబంధించిన భవనాలన్నీ తయారైపోయాయి.. మీరు షిఫ్ట్ చేయండి.. అని తానంతట తానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. దానికి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదు, అవసరమైతే ఒక భవనం కూడా ఇస్తామని రివర్స్ అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కారు భవనాలు ఇస్తామని అంటున్నప్పుడు ఆ రాష్ట్రానికి హైకోర్టు షిఫ్ట్ కావడం ధర్మం కదా? ఎందుకు మీరు షిఫ్ట్ చేయడం లేదు? అంటూ పలానా తేదీ నుంచి షిఫ్ట్ చేయండని కేంద్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. ఆ నేపథ్యంలో హైకోర్టు షిఫ్ట్ అయింది. చంద్రబాబు నాయుడి కోరిక మేరకు హైకోర్టు బదిలీ అయితే దాన్ని తిరిగి రాజకీయం చేసి వేరే వాళ్లపై బురద చల్లేందుకు ఉపయోగించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది. ఇంతటి దారుణమైన వ్యక్తి మరొకరు ఉండరు. నేను విశాఖలో అడుగు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాలు ఆగిపోయాయి సాక్షి : మీపై హత్యాయత్నానికి సంబంధించిన కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. దీనిపై చంద్రబాబు కామెంట్ చేశారు. దీనిని మీరేమంటారు? జగన్: అసలు దాడి ఎక్కడ జరిగింది.. ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వీఐపీ లాంజి అనేది అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అలాంటి ప్రదేశంలోకి ఒక కత్తి.. అన్ని సెక్యూరిటీ ప్రమాణాలను దాటి ఎలా రాగలిగింది? అక్కడ పనిచేసిన ఆ మనిషి ఆ కత్తిని ఎలా తేగలిగాడు? ఆ మనిషి తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరుడు హర్షవర్దన్ చౌదరికి చెందిన రెస్టారెంట్లో పని చేయగలిగాడు కాబట్టే ఆ కత్తిని తీసుకుని రాగలిగాడు. ఆ హర్షవర్దన్ చౌదరి 2014లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ఆశించారు. ఆయనకు చంద్రబాబునాయుడి దగ్గర నుంచి లోకేశ్ వరకూ చివరకు విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ చౌదరి దాకా అందరితో సంబంధాలు ఉన్నాయి. హత్యాయత్నం చేసిన ఆ వ్యక్తి గతంలోనే హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్నారట. అలాంటి వ్యక్తికి పోలీసులు ఎన్ఓసీ ఎలా ఇచ్చారు? ఇంకో అడుగు ముందుకెళ్లి చూస్తే మొన్న కోర్టు అడుగుతున్న ప్రశ్నల్లో మరొకటి ముందుకొచ్చింది. నా పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే నాటికే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నాపై హత్యాయత్నం జరిగేంత వరకూ ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు పని చేయలేదట. అంటే దాదాపుగా మూడు నెలల పాటు విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. అదీ కరెక్టుగా ఎప్పుడు పనిచేయడం మానేశాయంటే విశాఖపట్నం జిల్లాలోకి జగన్ అనే వ్యక్తి అడుగు పెట్టిన తర్వాతే. ఇంత దారుణమైన కుట్ర జరుగుతున్నప్పుడు సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు దారుణం. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నాపై హత్యాయత్నాన్ని వెటకారం చేస్తూ దాడి చేసిన వ్యక్తి జగన్ అనుచరుడని తేల్చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైతే అదీ బ్లూకలర్‌లో ప్లెక్సీ వేస్తాడు. కానీ ఆ ఫ్లెక్సీ ఎల్లో కలర్లో ఉంది. దానిపైన గరుడ పక్షి బొమ్మ పెట్టి మార్ప్డ్ ప్లెక్సీ ఎవడైనా పెట్టగలుగుతాడా? ఆ ఫ్లెక్సీని అప్పటికప్పుడు పాత ఫ్లెక్సీ మీద తయారు చేయించారు. ఎయిర్ పోర్టులో నాపై హత్యాయత్నం జరిగాక నేను చాలా హుందాగా చంద్రబాబు మీదగానీ, మరొకరి మీదగానీ అనవసరమైన ఆరోపణలు చేయలేదు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం ధర్మం కాదని అన్ని విషయాలు తెలిసిన తర్వాతే మాట్లాడాలని సంయమనం పాటించి మౌనంగా ఉన్నాను. ప్రథమ చికిత్స చేసిన తర్వాత అందరి ముందే చొక్కా మార్చుకుని ఒక్క మాట మాట్లాడకుండా హైదరాబాద్‌కు వచ్చి నేరుగా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నా. దాన్ని కూడా ఏ రకంగా చిత్రీకరించారంటే అన్యాయంగా మాట్లాడారు. అసలు దీని వెనుక ఎవరున్నారు? కత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా రాగలిగింది? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న పోలీసుల చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? బాబు, పవన్‌లు ముసుగు తీసి కలిసి రండి.. సాక్షి : మరి ఆయన (మోదీ) నిస్సహాయతను ఏమనుకోవాలి? జగన్ : ఇక్కడ ఎన్ని స్కామ్‌లు చేసినా, కుంభకోణాలు చేసినా మోదీ మాత్రం మన చంద్రబాబే కదా? పోనీలే అనుకుంటూ వదిలేసిన పరిస్థితులూ కనిపిస్తున్నాయి. సాక్షి : తాను, పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్‌కు ఎందుకు బాధ అని చంద్రబాబు అంటున్నారు.. జగన్ : నాకెక్కడ బాధండీ. నాకసలు బాధ లేదు. నేను వాళ్లను కలవమనే చెబుతున్నాను. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు? ఇంతకు ముందు కలిసి మీరు పోటీ చేశారు. ఇప్పుడు విడిపోయినట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? ముసుగు తీసేసి కలిసికట్టుగా రండయ్యా.. నాకు భయం లేదు. నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఇవ్వాళ కూడా నేను ఒక్కడినే పోటీ చేస్తానని చెబుతున్నా. మీరందరూ మళ్లీ కలిసి రండయ్యా అని చెబుతున్నా. పొత్తులు ఏమీ ఉండవని చెబుతున్నా. అసెంబ్లీలో రాజ్యాంగానికి ఏకంగా తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను ఏకంగా మంత్రులను చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము మళ్లీ శాసనసభలోకి ప్రవేశిస్తే దాన్ని కూడా అంగీకరించినట్టే అవుతుంది. అధికార పార్టీ ఈ మాదిరిగా చేసినా కూడా ఆమోదయోగ్యనీయమే అనే స్థాయికి ప్రజాస్వామ్యం వెళ్లిపోతుంది. అందువల్ల దీనికి ఎక్కడో చోట పుల్‌స్టాప్ పెట్టాలి. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. అప్పుడే ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితుల నుంచి మంచి పరిస్థితులు వస్తాయి. అందుకే ఏకంగా ప్రజల వద్దకే వెళ్లి ఈ విషయం చెబుదాం అని పాదయాత్రకు శ్రీకారం చుట్టాం. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా నేషనల్ మీడియా కూడా దీనిపై దృష్టి సారించేలా చేశాం. – వైఎస్ జగన్ -
‘మీడియాకు అదే పెద్ద సవాల్’
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పత్రికా దినోత్సవం (నవంబర్ 16) సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. జూరీ ఎంపిక చేసిన జర్నలిస్టులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. హిందూ పత్రిక చైర్మన్ ఎన్ రామ్‌కు ఆయన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డును అందజేశారు. అవార్డులు పొందిన వారికి అరుణ్ జైట్లీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు, జ్యూరీ కన్వీనర్ దేవులపల్లి అమర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో జైట్లీ ప్రసంగించారు. ఈ టెక్నాలజీ యుగంలో సమాచారాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. టెక్నాలజీ ప్రెస్ సెన్సార్ షిప్ ను అనుమతించదని తెలిపారు. ‘మీడియా తన విశ్వసనీయతను తిరిగి పొందడం అనేది ప్రస్తుతం ఉన్న అసలైన సవాల్’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా దుర్వినియోగం అయితే దాని మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.‘ఎన్ రామ్‌కు రామ్మోహన్ రాయ్ పేరుతో అవార్డు ఇవ్వడం నాకు గౌరవప్రదంగా ఉంది. ఇది మరింత బాధ్యతను పెంచే విధంగా ఉంది’ అని చెప్పారు. -
ఆపత్కాలంలో ‘అనివార్యత’ ముసుగు
బలమైన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నించే నేరబుద్ధి చంద్రబాబుకు ముందునుంచీ ఉందని వంగవీటి రంగా హత్యోదంతం తేల్చి చెప్పింది. అలాగే వైఎస్ జగన్‌ని హత్య చెయ్యడానికి జరిపిన కుట్ర.. కాస్తలో విఫలమైందని జనం గట్టిగా నమ్మడంతో దిక్కుతోచక ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో కాంగ్రెస్‌తో దోస్తీ ప్రహసనాన్ని అడ్వాన్స్ చేశారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నిటినీ కూడగడతానని బయలుదేరిన బాబును ఈ జాతీయ పార్టీలన్నీ నిలదీసి, ముందు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వంసాన్ని ఆపి, వాటిని స్వతంత్రంగా పనిచేయనిచ్చి అప్పుడు జాతీయ స్థాయిలో ప్రక్షాళనకు రమ్మని ఎందుకు అడగవు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఒక కొత్త పదం దొరికింది. అది ‘‘ప్రజాస్వామ్య అనివార్యత’’ (democratic compulsion. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్‌తో జత కట్టడానికి బాబు ఎన్నుకున్న పదం ఈ ప్రజాస్వామ్య అనివార్యత. ఈ అనివార్యత ఏమై ఉంటుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. దానితోపాటు ఇంకో మాట చెప్పాడాయన. వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నారు, వాటిని కాపాడటమే ఆ ప్రజాస్వామ్య అనివార్యత అని. ఈ గొప్ప లక్ష్య సాధన కోసమే గతాన్ని మరిచి పోయి కాంగ్రెస్‌తో చెలిమికి సిద్ధపడ్డామని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు ఏ ప్రజాస్వామ్య అని వార్యతలో భాగంగా ఏయే వ్యవస్థలను రక్షించడానికి నడుము కట్టారో, అసలు ఆ వ్యవస్థలను సమూలంగా నాశనం చెయ్యబూనుకున్నది ఎవరో దేశానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆయన చెప్పిందేమిటి ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ వంటి వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ద్వారా వాటిని ధ్వంసం చేస్తున్నదని కదా. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, మామ పంచన జీవి స్తున్నా ఈ వ్యవస్థలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అనడానికి బోలెడు నిదర్శనాలు ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. ఆదినుంచీ అవకాశవాదమే... కాంగ్రెస్‌తో చంద్రబాబు బహిరంగంగా కలవాల్సిన అనివార్యత గురించి చెప్పుకుని అప్పుడు ఆ విషయాల్లోకి వెళ్దాం. బహిరంగంగా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన కాంగ్రెస్‌లో పుట్టి రాజకీయ అవకాశవాదంతో మామ పంచన చేరిన దగ్గరి నుంచీ కాంగ్రెస్‌తో రహస్య స్నేహం కొనసాగిస్తూనే ఉన్నాడు. పాపం రాజకీయ ఎత్తుగడలు తెలియని ఎన్టీరామారావు ఇది గమనించలేదు. 1995లో మామగారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడు ఆ అధికారాన్ని నిలబెట్టుకోడానికి అప్పటి కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం శరణు జొచ్చాడు. ఎన్టీరామారావు చేసిన విజ్ఞప్తిని ఆనాడు పీవీ నరసింహారావు పట్టించుకుని ఉంటే, ఇవాళ చంద్రబాబు రాజకీయాల్లో ఉండేవాడు కాదు. ఆ తరువాత కొద్ది మాసాలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల తరువాత చంద్రబాబు చక్రం తిప్పిన యునైటెడ్ ఫ్రంట్ కాకుండా ఎన్టీఆర్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి ఆయన ప్రధాన మంత్రి కూడా అయ్యేవారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కంటే తక్కువ స్థాయి నాయకుడేమీ కాదు ఎన్టీఆర్. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే ప్రధాని అయి చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలు తప్పేవి కాదు. తాను చక్రం తిప్పానని చెపుతున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నడపడానికి కూడా కాంగ్రెస్ మద్దతు తీసుకోడానికి చంద్రబాబు వెనకాడలేదు. ఇక కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న తాను కేసుల నుంచి తప్పించుకోడానికి చక్కగా వీలుంటుంది. గతంలో చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ మంత్రి చిదంబరాన్ని కలసిన విషయం ఆ మంత్రే చెప్పారు, చంద్రబాబు దాన్ని ఖండించలేదు. యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి అసెంబ్లీలో అవిశ్వాసం సందర్భంగా వోటింగ్ నుంచి చంద్రబాబు గైర్హాజర్ కావడం కూడా చూశాం. ఆ తరువాత అదే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయి ‘‘వ్యవస్థలను వాడుకుని‘‘ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు బెయిల్ కూడా రాకుండా చూసిన ఘనత చంద్రబాబుదే. ఇవీ ఆయన ప్రజాస్వామ్య అనివార్యతలు. వెంటాడుతున్న ఓటుకు కోట్లు కేసు కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి స్నేహాన్ని, ఇప్పుడు వెలుగులోకి తెచ్చేసిన కొత్త ప్రజాస్వామ్య అనివార్యత ఏమిటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వోటుకు కోట్లు కేసులో శిక్ష అనుభవించక తప్పని ‘‘అనివార్యత’’ చంద్రబాబును కాంగ్రెస్ పంచన చేర్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసు నీరు గార్చేయ్యవచ్చునన్న ధీమా ఆయనది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని నిధులయినా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఛీ కొడితే కాంగ్రెస్‌తో అక్కడ ఎట్లా కలిసి వెళతారు అనే సందేహం ఎవరికయినా సహజంగానే వస్తుంది. అది కూడా ఒక అనివార్యతే. ఆ అనివార్యత పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకత్వంలోని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీజీపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నాడు పొలిట్ బ్యూరోతో సంప్రతిం పులు, సీనియర్ నాయకులతో చర్చలు అని ప్రదర్శిం చిన నాటకానికి కూడా తావులేకుండా ఇప్పుడు చటుక్కున ప్రత్యేక విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించడం వెనక ఉన్న తక్షణ అనివార్యత జగన్ మోహన్‌రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి. ఈ దాడి జరిగిన కొద్ది సేపట్లోనే రాష్ట్ర డీజీపీ ఆయన వెనకే బాబు మీడియా గోష్టి ఏర్పాటు చేసి, జగన్ అభిమానే దాడి చేశాడనీ, జగన్‌కు సానుభూతి పెరగడానికే ఈ దాడి చేయించుకున్నారనీ స్థాయి మరిచి దిగజారుడు ప్రకటనలు చేసి నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు. నిజమే, జగన్ మీద జరిగిన దాడికి చంద్రబాబునాయుడు ఇదే రంగు పూయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తాను చేసినట్టే అందరూ చేస్తారని నమ్మించజూస్తారు ఆయన. ప్రత్యర్థుల నిర్మూలన అలవాటే ఒక్కసారి మల్లెల బాబ్జీని జ్ఞాపకం చేసుకుందాం. 34 ఏళ్ళ కిందట ఎన్టీ రామారావు మీద బాబ్జీ అనే యువకుడితో దాడి చేయించి తద్వారా సానుభూతి పొందడానికి స్కెచ్ వేసింది చంద్రబాబేనని తర్వాతికాలంలో మల్లెల బాబ్జీ ఆత్మహత్య తరువాత బయటపడింది. ఆ విషయం ఇండియాటుడే వంటి ప్రతిష్టాత్మక జాతీయ ఆంగ్ల వారపత్రిక రాసిన విషయం తెలిసిందే. విషయంలోకి వస్తే, మల్లెల బాబ్జీ అనే వ్యక్తి హఠాత్తుగా ఎన్టీఆర్ వద్దకు వచ్చి ఆయన బొట నవేలిపై బ్లేడుతో గాయం చేశాడు. దీంతో సభలో కలకలం చెలరేగింది. ఎన్టీఆర్ కూడా బొటనవేలికి పెద్ద కట్టు కట్టుకుని కొద్ది రోజులు తిరిగారు. అయితే ‘అదంతా డ్రామా..’ అని అప్పట్లోనే ప్రజలు భావిం చారు. వాస్తవం ఏమిటంటే ప్రజల్లో ఎన్టీఆర్ ప్రభ తగ్గుతున్నవేళ మల్లెల బాబ్జి (పేద కాపు కులస్థుడు)తో ఆయన మీద ఉత్తుత్తి హత్య ప్రయత్నం చేయించి అందుకు బదులుగా మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి తరువాత మాట తప్పి చంద్రబాబు బాబ్జీ చేతిలో 30 వేలే పెట్టాడని ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధి రాశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు మల్లెల బాబ్జీ రాసిన రెండు లేఖలు దొరికితే వాటిలో ఈ నిజాలు బయటపడ్డాయని ఇండియా టుడే రాసింది. అప్పట్లో ఆ లేఖలు బయటపడితే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ రామారావు (ఆయన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు) ఇబ్బందుల్లో పడతారని పోలీసులూ, ఆ నాటి విజయవాడ ఎగ్జిక్యూటివ్ మేజి స్ట్రేట్ టీబీ బెనర్జీ దాచేశారని కూడా ఇండియా టుడే రాసింది. బాబ్జీ ఆత్మహత్య చేసుకున్న తరువాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంఘం ఎదుట ఈ లేఖలు బయట పడ్డాయని కూడా ఆ పత్రిక రాసింది. ఇంతకూ మల్లెల బాబ్జీది ఆత్మహత్యేనా అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఇటువంటి నేర బుద్ధి ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తూనే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి మీద దాడి తరువాత తాము మల్లెల బాబ్జీ చేత చేయించిన పనిని ఈ సంఘటనకు కూడా అంటగట్టి తప్పించుకోవచ్చనే నేర బుద్ధి కావచ్చు. అందుకోసం చాలా ప్రయత్నాలే చేశారు. ఫ్లెక్సీలు సృష్టించారు, పార్టీ నాయకులతో అడ్డగోలుగా మాట్లాడించారు, నెపం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. జగన్మోహన్ రెడ్డిని హత్య చెయ్యడానికి జరిగిన కుట్రలో భాగంగానే ఈ విఫలయత్నం జరిగిందని జనం గట్టిగా నమ్మడంతో దిక్కుతోచక కాంగ్రెస్‌తో దోస్తీ ప్రహసనాన్ని అడ్వాన్స్ చేశారు చంద్రబాబు. తన మీద తానే దాడి చేయించుకోవలసిన అవసరం జగన్‌కు ఏముంది? ఆనాడు ఎన్టీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది కాబట్టి సానుభూతి కోసం చంద్రబాబు మల్లెల బాబ్జీని ప్రయోగించారు. ఏడాది పొడుగునా పాదయాత్ర చేస్తూ రోజురోజుకూ జనాభిమానం పెంచుకుంటున్న జగన్‌కి ఆ అవసరం లేదు. నిజంగా ఆయనే చేయించుకుంటే ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రుజువు చెయ్యడం క్షణాల్లో జరిగే పని. దర్యాప్తు క్షుణ్ణంగా చేయించి నిజాలు నిగ్గు తేల్చండని జగన్ మోహన్‌రెడ్డి పట్టుబడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తూతూ మంత్రంగా జరిపించి మూసెయ్యాలని చూస్తోంది అంటేనే నేరం వెనక ఉన్నదెవరో, అది బయటపడుతుందని భయపడుతున్నదెవరో అర్థం అవుతున్నది. తానే దాడి చేయించుకుంటే నిందితుడు శ్రీనివాస్ దగ్గర దొరికిన 11 పేజీల లేఖలో ఈ దాడి చంద్రబాబు చేయించాడు అని రాసుకుంటారు కానీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానిని అని రాసుకోరు కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? అయినా ఆత్మహత్య చేసుకునే వారు కారణాలు తెలుపుతూ లేఖలు రాస్తారు (మల్లెల బాబ్జీ లాగా). వంగవీటి రంగా హంతకులెవరు? హత్యలు చేసేవారు ఆధారాలు తెలిపే లేఖలు రాసి వెంటపెట్టుకున్న చోద్యం మొదటిసారి చూస్తున్నాం. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవడం, అందుకోసం ప్రజాభిమానాన్ని చూరగొనడం కాకుండా కుట్ర పద్ధతుల్లో, అవసరం అయితే భౌతికంగా అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉందని ఆ పార్టీలో చాలా కాలం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన మాటల్లోనే ‘‘రంగాను హత్యచేయడానికి జరిగిన కుట్ర వెనక చంద్రబాబు, ఉపేంద్ర, సిరీస్ సుబ్బరాజుల హస్తాలు ఉన్నాయని శివరామరాజు నాతో చెప్పిన మాట నేను నమ్మాను. తెలుగుదేశం పార్టీ వారు ఒక కాపు నాయకుడిని తమకు వ్యతిరేక పార్టీలో ఉండి జనాదరణ పొందుతున్నాడన్న కారణంతో పాశవికంగా హతమార్చడం నన్ను కలచి వేసింది‘. హరిరామ జోగయ్య మాటలు విన్నాక రోజురోజుకూ పెరిగిపోతున్న జనాదరణ కారణంగా జగన్‌ను అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన ఎవరికి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. రంగా హత్యకు ముందు ఎన్టీ రామారావు హరిరామ జోగయ్యను పిలిచి మీ కులస్తులు ఎందుకు మన పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అని అడిగితే, రంగా భద్రతను తగ్గించడం కూడా ఒక కారణం అని జోగయ్య చెప్పారట. రంగా భద్రత పెంచడానికి అంగీకరించిన ఎన్టీఆర్ మరునాడు జోగయ్యను పిలిచి చంద్రబాబు తదితర నాయకులు ఇప్పుడు య«థాస్థితి కొనసాగించమని అంటున్నారు కాబట్టి భద్రత పెంచే వీలులేదని చెప్పారట, ఆ తరువాత కొద్ది కాలానికే రంగా దారుణ హత్యకు గురయ్యారు. ఇక చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ కేసులు తరుముకొస్తాయన్న భయం పట్టుకున్నట్టు స్పష్టం అవుతున్నది. నన్ను మీరే కాపాడాలి అని ప్రజలతో పదేపదే చెప్పుకోవడం, ఎవరో వ్యాపారుల మీద ఆదాయపు పన్ను దాడులు జరిగితే హాహాకారాలు చేస్తూ రాష్ట్రం మీద, ప్రభుత్వం మీదా దాడి జరిగినట్టు యాగీ చెయ్యడం ఆయనలో రోజురోజుకూ పెరుగుతున్న అభద్రతాభావానికి నిదర్శనం. వీటితో బాటు ప్రజా వ్యతిరేకత కారణంగా ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించాలి, రేపు ఏమయినా జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్నందువల్లనే కక్ష సాధిస్తున్నారని చెప్పుకోవాలి. ఇదీ చంద్రబాబు అనివార్యత. బాబు నోట విలువల విధ్వంసమా? ప్రజాస్వామ్య అనివార్యతలో భాగంగా వ్యవస్థలను రక్షించడానికి బయలుదేరానని చెపుతున్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలనూ తాను ఎలా ధ్వంసం చేసిందీ కనిపించక పోవడం ఆశ్చర్యకరం. ఈ విషయం శరద్ పవార్‌కో, ఫరూక్ అబ్దుల్లాకో తెలియదంటే అర్థం చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో రోజూ చంద్రబాబు దుష్పరిపాలన మీద పోరాటం చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికీ, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకూ ఎట్లా తెలియకుండా పోయింది? ముందు మీ రాష్ట్రంలో వ్యవస్థలను పునరుద్ధరించి అప్పుడు జాతీయ స్థాయి మాటలు మాట్లాడండి అని ఎందుకు అడగరు? నాలుగేళ్ళు బీజేపీ ఒళ్ళో కూర్చుని ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం దాన్ని వదిలేస్తే సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి నాయకుడు చంద్రబాబును భేష్ అని ఎట్లా వెన్నుతడతారు? బీజేపీని వ్యతిరేకిస్తే అన్నీ మాఫ్ చేసేస్తారా? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ధ్వంసం చెయ్యని వ్యవస్థ ఏదయినా ఉందా? ప్రతి పక్ష శాసన సభ్యులను, ఎంపీలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ఒడిగట్టి శాసన వ్యవస్థను, శాసన సభాపతి స్థానాన్ని భ్రష్టుపట్టించింది ఎవరు? శాసనసభను పార్టీ కార్యాలయంగా మార్చేసింది ఎవరు? అధికార యంత్రాం గాన్ని మొత్తం తన అదుపులో పెట్టుకున్నది ఎవరు? రాష్ట్రంలో చెలరేగిపోతున్న రకరకాల మాఫియాలకు అండగా నిలుస్తున్నది ఎవరు? బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నిటినీ కూడగడతానని బయలుదేరిన చంద్రబాబును ఈ జాతీయ పార్టీలన్నీ నిలదీసి ముందు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వం సాన్ని ఆపి, వాటిని స్వతంత్రంగా పని చేయనిచ్చి అప్పుడు జాతీయ స్థాయిలో ప్రక్షాళనకు రమ్మని ఎందుకు అడగరు? తన మీద వచ్చిన నేరారోపణల మీద స్టేలు తెచ్చుకుని అధికారంలో కొనసాగుతున్న నాయకుడికి విలువల గురించి, వ్యవస్థల విధ్వంసం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
ఇక్కడ పుట్టుకైనా చావైనా అంతా రాజకీయమే!
కారు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణిస్తే అంత హడావుడి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని అసలు పట్టించు కోలేదు. తానేం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే అహంకారం కేసీఆర్‌ది కాగా, రాజకీయ లబ్ధికి దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్రబాబుది. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా మార్చేయ చూసిన నేత చంద్రబాబు. ఆ దుర్ఘటనపై బాబు ప్రభుత్వం వేసిన ఒక కంటి తుడుపు కమిషన్ సమర్పించిన నివేదిక ఒక న్యాయ విచారణ నివేదికలా లేదు. ఇక్కడ పుట్టుకైనా చావైనా, మంచైనా చెడైనా అంతా రాజకీయమే. జనం అంటే తమకు అధికారం తెచ్చిపెట్టే ఓట్లు, తాము అధికార పీఠం చేరుకోడానికి నిచ్చెన మెట్లు, డబ్బు పారేస్తే కొనడానికి దొరికే వస్తువులు. వాళ్ళు మనుషులు కాదు. మనుషులు ఎందుకు? ఓట్ల మిషన్ మీద తమకు ఓటేయడానికి నొక్కే వేలు ఉంటే సరిపోదా? దానికి ఆకలి ఉండదు, ఆలోచనా ఉండదు. అప్పుడు మనుషుల ఆకలి తీర్చడానికి నయా పైసా ఖర్చుండదు. తమను అధికారం నుంచి దింపి వేస్తారేమో ననే భయం ఉండదు. చాలామంది రాజకీయ నాయకుల ఆలోచన ఇలా ఉంటుంది. అలాంటి నాయకులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ కాలపు ప్రతినిధులు. ఇంకే రాజకీయ నాయకుడయినా వారిని చూసి నేర్చుకోవాల్సిందే. అధికారం దీర్ఘకాలం.. మళ్లీ మాట్లాడితే శాశ్వతంగా తమ వద్దనే ఉండిపోవడం కోసం ఏమైనా చేస్తారు. కొడు కులూ ఇంకా మనుమలకు అధికారాన్ని వారెంత సామర్ధ్యం లేనివారైనా, బదలాయించడానికి వెనకాడరు. పుట్టుకైనా చావైనా, మంచైనా చెడైనా అంతా రాజకీయం. కేసీఆర్, చంద్రబాబు గురించి ఇంత తీవ్రంగా మాట్లాడుకోడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొన్ననే తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సంస్థ బస్సు ప్రమాదం జరిగి 60 మంది గ్రామీణులు మరణించారు. వారంతా పేదలు. అంతకు కొద్ది రోజుల ముందే తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ట రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలం గాణ ఏర్పడిన కొద్ది మాసాలకే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీకొన్న ఘటనలో అమా యక పసిపిల్లలు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్క రాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట కారణంగా 29 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. నేరాలకు శిక్షలుండవా? నందమూరి హరికృష్ణ తెల్లవారుజామునే కారు స్వయంగా నడిపి ప్రమా దంలో చనిపోయారు. ముఖ్యమంత్రి హుటాహుటిన హరికృçష్ణ ఇంటికి వెళ్లి, పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలు జరిగిన మహా ప్రస్థానంలో 450 గజాల స్థలంలో స్మృతిచిహ్నం నిర్మాణానికి నిర్ణయిం చారు. ఇదంతా హరికృష్ణ మీద గౌరవమో ప్రేమో అనుకుంటే పొర పాటు. ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కనీసం 25–30 నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్ల మీద ప్రేమతోనే ఇదంతా. హరికృష్ణ మరణంతో పోలిస్తే కొండగట్టు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం పెను విపత్తు. అది ప్రభుత్వం చేసిన సామూహిక హత్య. విశ్రాంతి లేకుండా నాలుగు రోజులుగా ఆ డొక్కు బస్సు నడుపుతూ అలసిపోయిన డ్రైవర్, ఏమాత్రం ప్రయాణా నికి పనికిరాని రోడ్డు, లాభాపేక్షతో కెపాసిటీకి మించి బస్సులో కుక్కిన 110 మంది ప్రయాణికులు... ప్రమాదానికి ఇవీ కారణాలు. ఆర్టీసీలో 6,000 డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 300 కొత్త బస్సుల అవ సరమున్నా పట్టిం చుకునే నాథుడు లేడు. హరికృష్ణ మరణిస్తే అంత హడావుడి చేసిన ముఖ్యమంత్రి జాడే లేదెందుకు కొండగట్టు దగ్గర? వారంతా ఓటర్లు మాత్రమే కాదు, తెలం గాణ పోరాటంలో సమరశీల పాత్ర పోషించిన జగిత్యాల ప్రాంత ప్రజలు. కానీ, అక్కడ చనిపోయిన ఓటర్ల సంఖ్య 60 మాత్రమే. వారేమీ 25–30 స్థానాల్లో గెలుపోటములు ప్రభావితంచేసే వారు కాదు అనుకుని ఉండొచ్చు. 100 నియోజకవర్గాల ప్రజలు ఇది గమనిస్తున్నారన్న విషయం సీఎం మరిచిపోయినట్టున్నారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ నిర్ల క్ష్యమే కారణమైనప్పుడు నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలి. కనీసం రవాణా మంత్రి లేదా ఆర్టీసీ అధిపతికైనా ఉద్వాసన జరగాలి. డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఏపీ సీఎంకు అన్నీ ఈవెంట్లే! ఇక ఏపీ సీఎం చంద్రబాబు తీరు మరో రకం. ప్రతిదీ రాజకీయ లబ్ధికి వాడుకునే అలవాటు ఆయనది. ప్రతి సంక్షోభాన్నీ వాడుకుంటారు. ఆయనకు అన్నీ ‘ఈవెంట్లే’. జనం మరణాలను కూడా తనకు అను కూలమైన ఈవెంట్‌గా మార్చుకొనే ప్రయత్నం చేయడంలో దిట్ట. నేనేం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే అహంకారం కేసీఆర్‌ది. రాజకీయ లబ్ధికి దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్రబాబుది. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా మార్చేయ చూసిన నేత చంద్రబాబు. ఆ దుర్ఘటన తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఒక కంటి తుడుపు కమిషన్ నిన్న కాక మొన్న తన నివేదికను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికారపక్షం ఆమోదం పొందిన ఆ నివేదిక గతంలో ఎంతో ప్రతిష్ట కలిగి ఉండిన జస్టిస్ సీవై సోమయాజులు రాసి నట్టుగా లేదం టున్నారు. అసలు అది ఒక న్యాయ విచారణ నివేదికలా లేదనే అభి ప్రాయం వ్యక్తమైంది. పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు ప్రజల విశ్వాసాలకు సంబంధించినవి. ప్రభుత్వాలకు వాటితో ఏ సంబంధమూ ఉండకూ డదు. పుష్కర స్నానాలు చేసే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిం చడం, పెద్ద సంఖ్యలో జనం వస్తారు కాబట్టి నేరాలూ, ప్రమాదాలూ జర గకుండా చూడటం, శాంతి భద్రతలను పరిరక్షణ–ఇంత వరకే ప్రభు త్వాల పాత్ర పరిమితం కావాలి. కానీ చంద్రబాబుకు ప్రతిదీ ఈవెంట్‌గా మలచుకునే అలవాటు కాబట్టి గోదావరి పుష్కరాలను ఒక అంతర్జా తీయ ఈవెంట్ చేయాలనుకున్నారు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందడానికి చేసిన పనే 29 మంది అమాయక భక్తుల దుర్మ రణానికి కారణమైంది. ఒక విదేశీ టీవీ చానల్లో ప్రదర్శన కోసం ఆయన నిర్మించిన ప్రచార చిత్రం కారణంగానే తొక్కిసలాట జరిగింది. జనం పెద్ద సంఖ్యలో కనపడేట్టు సినిమా తీయాలన్న కీర్తి కండూతి కారణంగా వీఐసీ ఘాట్‌లో కాకుండా మామూలు భక్తులు స్నానం చేసే ఘట్టాల దగ్గర చంద్రబాబు కుటుంబం పుణ్యస్నానాలు చేసినందువల్ల, ఆయన రక్షణ కోసం, అప్పటి దాకా ఆపి ఉంచిన జనాన్ని ఒక్క సారిగా వదిలేసరికి తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. న్యాయ విచారణ జరపాల్సింది ఈ అంశంపైనే. అయితే ఇది తప్ప చాలా అనవ సరపు విషయాలు జస్టిస్ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్ నివేదికలో ప్రస్తావించారు. మీడియాలో ప్రచారమే కొంప ముంచింది! పుష్కరాల ప్రారంభ దినాన ఉదయం ఒక ముహూర్తంలోనే స్నానాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ప్రభుత్వమే మీడియాకు విడుదల చేసిన వ్యాపార ప్రకటనల్లో ఊదర గొట్టింది. ఆ విషయం పక్కన పెట్టి సోమయాజులు గారు తన నివేదికలో ‘అసలే పిచ్చి నమ్మకం. ఆపై ప్రసార మాధ్యమాలలో అతిశయోక్తులతో కూడిన సిద్ధాంత రాద్దాంతం. ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది?’ అని దుర్ఘటన కారణాలను భక్తుల నమ్మకం మీదా, మీడియా మీదా నెట్టేశారు. ‘ఫలానా ముహూర్తంలోనే స్నానం చెయ్యండి, పుణ్యం వస్తుంది’’ అని ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని పక్కన పెట్టి ‘స్నానాలు ఎప్పుడు చేసినా పుణ్యం వస్తుందన్న విషయాన్ని సరిగా చెప్పలేక చానళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించాయి’ అని బాధ్యతను మీడియా మీదకు నెట్టేశారు జస్టిస్ సోమయాజులు. మరో పక్క గోదావరిని ఒక బ్రాండ్‌గా ప్రమోట్ చెయ్యడానికి సంవత్సరం ముందు నుంచే రూ.1500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ప్రణాళికలు రచించిందోనని కొనియాడారు న్యాయమూర్తి. ‘కోటగుమ్మం దగ్గర ఉన్న పుష్కర ఘాట్ మార్గం ఇరుకుగా ఉండటం వల్ల ముఖ్యమంత్రి, తదితర ప్రముఖులు స్నానాలు ముగించుకు వెళ్ళే దాకా జనాన్ని ఆపి ఉంచడం వల్ల ఇబ్బంది అయింది’ అని చెపుతూనే ప్రభుత్వం తప్పేమీ లేదని, అంతా ప్రతిపక్షాల ఓర్వలేనితనమేనని తేల్చేశారు తన నివేదికలో. ఇది జస్టిస్ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్ నివేదికలా లేదని చెప్పడానికి సాక్ష్యాధారాలుగా ఈ కింది పంక్తులు చాలు. ‘సమ కాలీన పరిస్థితులు ఏం చెపుతున్నాయంటే అధికారంలో లేని పార్టీలు, లేదా అధికార పక్షానికి వ్యతిరేకులయిన, అంత స్నేహంగా లేకపోయిన పార్టీలు, వాటి నాయకులూ అధికార పక్షం మీద బురద చల్లడానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టవు. చిన్న సంఘటనను, ఉప ద్రవాన్ని కూడా సొమ్ము చేసుకో జూస్తాయి’. ఈ నివేదికలో ఇంతకంటే దుర్మార్గమైన వ్యాఖ్యానం ఏమిటంటే, సీఎం బాబు పన్నెండు రోజులూ రాజమండ్రిలోనే బస చేసి ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కొని యాడుతూ ‘అన్య మతస్తులు కూడా అనేకులు పుణ్య స్నానాలు ఆచరిం చడం ఆనవాయితీ. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి వైఎస్సార్‌కి తీర్థ విధి నిర్వహించారు. ఆ విషయం మీడియాలో ప్రసారం కూడా అయింది’ అని. ఒక దుర్ఘటనకు సంబంధించి నిజాని జాలు విచారణ జరిపి, న్యాయబద్ధంగా నివేదిక ఇవ్వాల్సిన న్యాయ మూర్తి వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయా? ఈ నివేదికలో జగన్మోహన్రెడ్డి ప్రస్తావన ఔచిత్యం ఏమిటో సోమయాజులు గారే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రకటన లాంటి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఈ నివేదికలో చాలా ఉన్నాయి. స్థలాభావం వల్ల వాటన్నిటినీ ఇక్కడ పేర్కొనడం లేదు. వ్యాసకర్త దేవలపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జ్యోతిష్యుల సలహా మేరకే కేసీఆర్..
సంపాదకుడితో రాజీనామా చేయిస్తే తప్ప వ్యాపార ప్రకటనలు ఇవ్వకుండా ఓ పత్రికను చంపేసే పరిస్థితి, తమకు అనుకూలంగా మాట్లాడడం లేదని ఓ పాత్రికేయుడి టాక్ షో ఆపించేసి ఆయనను రోడ్డు మీదకు నెట్టడానికి చేసిన ప్రయత్నం మనం ఇవ్వాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూశాం. తెలంగాణాలో అధికార పక్షానికి ఉన్న సొంత మీడియా (తెలుగు, ఇంగ్లిష్‌లో రెండు దినపత్రికలూ, ఒక తెలుగు న్యూస్ ఛానల్)ను మించిపోయి ఈ బాపతు మీడియా సంస్థలు ప్రభుభక్తిని చాటుకోవడాన్ని మించిన విషాదం ప్రజాస్వామ్యానికి ఇంకోటి ఉండబోదు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పరిస్థితి ప్రభువును మించిన విధేయత అనే మాటలకు అద్దం పడుతోంది. ఇంకా తొమ్మిది మాసాలు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా సరే తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు శాసనసభను రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయించి ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రక టించి 24 గంటలు తిరక్కుండానే ఎన్నికల ప్రచార భేరి మోగించిన కేసీఆర్‌ను చూసి మీడియా మురిసి ముక్కలయింది. యువహీరో మహేష్‌బాబు సినిమా పేర్లన్నీ పెట్టి కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచేసింది. దూకుడు, ఒక్కడు, ఆగడు, ఖలేజా ఎన్నెన్ని పేర్ల తోనో ఆయన సాహసాన్ని పత్రికల పేజీల్లో పరిచేసి, చానళ్ల స్క్రీన్ల మీద పులిమేసి ప్రభుభక్తిని చాటుకోని పత్రికలను వేళ్ల మీద కూడా లెక్కపెట్టలేము . ఈ నెల ఆరున కేసీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అయిదు నిమిషాల్లో ఆ తంతు ముగించేసి హుటాహు టిన రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ గారికి సమాచారం అందించి మీడియాతో మాట్లాడటానికి తెలంగాణా భవన్ చేరుకున్నారు. ఈ లోగానే రాజ్‌భవన్ నుంచి దాన్ని ఆమోదించినట్టు, ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగమన్నట్టూ అధికార ప్రకటన వెలువడింది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే ఇదేదో అందరూ ముందుగానే అనుకుని చేసినట్టుగా కని పించి రాజ్యాంగ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచేసింది. తెలంగాణా భవన్లో విలేఖరులు అడి గిన ఒక్క ప్రశ్నకు కూడా కేసీఆర్ సమాధానం చెప్ప కుండా కసురుకుని, హేళన చేసి, ఇవేం ప్రశ్నలయ్యా అని కోప్పడ్దారు. చివరికి ఆయన తన ప్రసంగంలో, ‘‘మీకు తెలియకుండా నేను ఈ విషయంలో చాలా కసరత్తు చేశాను. మీరు తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నిటినీ అడ్డు కొట్టాను’’ అని విజయ దరహాసం ఒకటి విసిరి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో, ఎన్నికల కమిషనర్లతో తాను ముందే మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చానని తేల్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్‌భవన్, కేంద్ర ఎన్నికల సంఘం మీదా అనుమానాలు రావడంలో తప్పేముంది? అసలు ఇంతకీ కేసీఆర్ తొమ్మిది నెలల ముందే ఎన్ని కలకు ఎందుకు పోతున్నట్టు? ఆయన చెపుతున్నట్టు రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతూంటే ఇప్పుడే ఎందుకు ఎన్నికలకు వెళ్ళడం? అసెంబ్లీ రద్దుకు ఆయన చెపుతున్న కారణం ఏమంటే ప్రతి పక్షాల గోల ఎక్కువ అయిందని. భాష వేరుగా ఉన్నా భావం ఇదే. తాను చేయించిన 15, 16 సర్వేలు కూడా నూటికి తక్కువ కాకుండా స్థానాల్లో గెలుపు ఖాయమని చెప్పినట్టు ప్రకటించారు. అంత ధీమా ఉంటే అసెంబ్లీ రద్దయిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఇంటికి పరుగెత్తి ఆయనను పార్టీలోకి ఎందుకు తెచ్చుకున్నట్టు? నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికయి, అయిదేళ్లు స్పీకర్ పదవి అనుభవించిన సురేష్‌రెడ్డికి గత నాలుగేళ్లుగా కనిపించని అభివృద్ధి హఠాత్తుగా ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పాలకపక్షాలకు మీడియా సానుకూలం! ఒకే రోజు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిం చడం, అదీ సిట్టింగ్‌లందరికీ (ఆరుగురికి మినహా ) టికెట్లు ఇవ్వడం వెనక ఉన్న మతలబు ఏంటి? వీరిలో కనీసం 30 నుంచి 40 మంది పని తీరు ఏమాత్రం బాగా లేదన్న విషయం ఆయనకు బాగా తెలిసినా ఎందుకు వారికే మళ్లీ టికెట్లు ఇచ్చారు? టికెట్ రాని వారు గోడ దూకకుండా ఈ పథకం రచించారా? ప్రతిపక్షాలు సర్దుబాట్లు చేసుకుని అభ్య ర్థులను ప్రకటించాక కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చేస్తారా? అప్పుడు వారు పక్క పార్టీలోకి దూకినా ఫలితం ఉండదు కాబట్టి పడి ఉంటారను కుంటున్నారా? ఏ పరిస్థితి ఎదురైనా అదుపు చెయ్యగలనన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా ఆయన ఓ రాజకీయ జూద క్రీడకు తెర లేపారని పిస్తోంది. అభ్యర్థులతో సంబంధం లేకుండా తనను చూసి తెలంగాణా ప్రజలు ఓట్లేస్తారన్న అతి నమ్మకం కూడా దీనికి కారణం కావచ్చేమో. అయితే ప్రభువును ప్రసన్నం చేసుకోడంలో తరించిపోతున్న మీడియాకు మాత్రం ఇవన్నీ ప్రశ్నలుగా అనిపించలేదు. తెలంగాణాలో జరుగుతున్న ఈ తంతు అంతా చూస్తుంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా దూసుకుపోతున్న ఒక వీడియో ఇంటర్వ్యూ గుర్తొస్తుంది. ప్రసిద్ధ పాత్రికేయుడు పరంజయ్ గుహ ఠాకుర్తా, మరో ప్రముఖ జర్నలిస్టు బర్ఖా దత్‌ను ఓ యూ ట్యూబ్ చానల్ కోసం న్యూస్ క్లిక్ అనే కార్య క్రమంలో చేసిన ఇంటర్వ్యూ అది. అధికారంలో ఉన్న వారు తనను ఏ మీడియా సంస్థలోకీ అడుగు పెట్టకుండా ఎలా అడ్డుకుంటున్నదీ, తాను స్వయంగా ప్రారంభించాలనుకుంటున్న మీడియా ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ఎట్లా ఆపుతున్నదీ చెపుతూ, ‘దేశంలో జర్నలిజంపై రాజకీయాల అదుపు పెరిగిపోతోంది,’ అని బర్ఖా అన్నారు. పరంజయ్, బర్ఖా ఇద్దరూ కూడా బడా వ్యాపారవర్గాలూ, అధికార పక్షాల బాధితులే. దేశమంతటా పరిస్థితి ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు మీడియాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోడానికి అన్ని అస్త్రాలనూ ప్రయోగించాయి. ఒకటి రెండు మిన హాయింపులు తప్ప తెలుగు రాష్ట్రాల మీడియా మొత్తం సర్కారీ గజెట్గా మారిపోయిందనడంలో సందేహం లేదు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే మీడియాను పది కిలోమీటర్ల లోతున బొంద పెడతానన్న నాటి నుంచీ మొన్న ఆయన అసెంబ్లీని రద్దు చేసే వరకూ మీడియా వ్యవహరించిన తీరు చూస్తే మీడియా ఆయన నియంత్రణలోకి వెళ్లిపోయిందని అర్థమౌతుంది. వాస్తవాలకు రంగుల పరదాలు కప్పి మీడియా ప్రజలను ఎలా మోసం చేస్తోందో మొన్నటికి మొన్న ఓ మీడియా సంస్థ అధిపతి రాసిన సంపాదకీయ వ్యాసం మచ్చు తునక. ఈయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభువులకు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు కేసీఆర్ పది కిలోమీటర్ల లోతున బొంద పెడతానన్న రెండు న్యూస్ చానళ్లలో ఈ పెద్ద మనిషి నడుపుతున్న చానల్ కూడా ఉంది. కొన్ని మాసాల పాటు ఆ చానల్ ప్రసారాలను ఎంఎస్ఓలను బెదిరించి ఆపి వేయించడం కూడా అందరికీ తెలుసు. ఉమ్మడి ఏపీలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎవరయినా నాలుగు మంచి మాటలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడితే చాలు ఆయన తన రాతల్లో విరుచుకు పడేవాడు. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలన్నా నచ్చేది కాదు. ఆ మాట అనే వాళ్లను అప్రతిష్ట పాల్జేసే పిచ్చి రాతలు రాసి మీడియా కచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించ వలసిందేనని సుద్దులు చెప్పేవాడు. ఇప్పుడా యజమాని రెండు రాష్ట్రాల్లో పాలకుల పల్లకీ మోస్తున్న రాతలే రాస్తున్నాడు. బొంద పెడతానన్న దగ్గరి నుంచి ట్విన్ టవర్లు కట్టుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని పుట్నాలు, పేలాల ధరకు కట్టబెట్టడం వరకూ మారిన పరిణామాలే ఈ రాతలకు కార ణమనే ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రతిపక్షాల పొత్తులూ, అభ్యర్థులూ ఒక కొలిక్కి రాక ముందే తెలంగాణాలో అధికారపక్షం 80 సీట్లు గెలవబోతున్నదని తన కాలమ్‌లో జోస్యం చెప్పేశాడా ఆ పత్రికా యజమాని. టీఆర్ఎస్ నాయకులే కచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప లేని సందిగ్ధంలో ఉన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యం జోతిష్యం మీద ఆధారపడి నడుస్తున్నట్టు కనిపిస్తోంది. జ్యోతిష్యుల సలహాతోనే... జ్యోతిష్యుల సలహా మేరకే కేసీఆర్ గడువు కన్నా ముందే ఎన్నికలకు వెళుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్య మంత్రి ఆగ్రహానికి గురయి పది కిలోమీటర్ల లోతు బొంద బెదిరింపును ఎదుర్కొన్న మరో 24 గంటల న్యూస్ చానల్ తరువాత కాలంలో తన అధీనంలోనే ఉన్న మరో చానల్ నిర్వహణను ప్రభుత్వ కోటరీకి అప్పజేప్పేయాల్సిన పరిస్థితి తప్పలేదు. ఇప్పుడా చానల్ నిర్వాహకుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరితో భర్తీ చెయ్యాలన్న ఆదేశాల కోసం ప్రగతి భవన్ వైపు కన్నార్పకుండా చూస్తున్నారట. సంపాదకుడితో రాజీనామా చేయిస్తే తప్ప వ్యాపార ప్రకటనలు ఇవ్వకుండా ఓ పత్రికను చంపేసే పరిస్థితి, తమకు అనుకూలంగా మాట్లాడటం లేదని ఓ పాత్రికేయుడి టాక్ షో ఆపించేసి ఆయనను రోడ్డు మీదకు నెట్టడానికి చేసిన ప్రయత్నం మనం ఇవ్వాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూశాం. ఆ సంపాదకుడు, ఆ పాత్రికేయుడు బయటికి వెళ్లిపోయాక సదరు దినపత్రిక, ఆ న్యూస్ చానల్ ప్రభువుల ఆదే శాలను తూచా తప్పకుండా పాటించి సుఖంగా బతికేస్తున్నాయి. తెలంగాణాలో అధికార పక్షానికి ఉన్న సొంత మీడియా (తెలుగు, ఇంగ్లిష్‌లో రెండు దినపత్రికలూ, ఒక తెలుగు న్యూస్ చానల్)ను మించి పోయి ఈ బాపతు మీడియా సంస్థలు ప్రభు భక్తిని చాటుకోవడాన్ని మించిన విషాదం ప్రజాస్వామ్యానికి ఇంకోటి ఉండబోదు. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో మీడియా పరిస్థితి ప్రభువును మించిన విధేయత అనే మాటలకు అద్దంపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల సమస్యలు, ప్రతిపక్షాల ఆందోళన అక్కడి మీడియాకు కనిపించదు. వినిపించదు. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో మీడియా మీద పెరిగిపోతున్న అధికార రాజకీయాల అదుపు ప్రజాస్వామ్యానికి చేటు అనడంలో సందేహం అక్కర లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రాపకం కోసం వెంపర్లాడే మీడియా పెద్దలు తమ విశ్వసనీయత పది కిలోమీటర్ల లోతుకు దిగజారిపోతోందని గుర్తిస్తే మంచిది. ఒక్కటి మాత్రం నిజం. మీడియా ఏం రాసుకున్నా, ఏం చూపించినా ప్రజలు వాటితో ప్రభావితం అయి ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే. అందుకు 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు బ్రహ్మాండమైన ఉదాహరణ. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జర్నలిస్టులు పోరాటాలకు సిద్ధం కావాలి: అమర్
సాక్షి,హైదరాబాద్: వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులు బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సభ్యుడు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సŠ(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అమర్ పాల్గొని ప్రసంగించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో 200కి పైగా జర్నలిస్టులు మృతి చెందారని, వారిలో ఎక్కువ శాతం గుండెపోటుతోనే మరణించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో జాతీయ స్థాయి పోరాటాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. టీయూడబ్ల్యూజే సలహాదారు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ విలేకరులు దీనస్థితిలో కుటుంబాలను పోషించుకుంటున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు ఆమోదించారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, ఐజే యూ సెక్రటరీ వై.నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యు డు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూ జే ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్, కోశాధికారి మహిపాల్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘చంద్రుల’ కల నెరవేరేనా?
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ చంద్రబాబు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. రాత్రంతా కన్న పీడ కలలనే రోజంతా ఉపన్యాసాలలో ‘కేసులు పెడతారేమో, వేధిస్తారేమో’ అన్న మాటలతో తిరిగి జనానికి చెపుతున్నారు. మరోవైపున ఎన్ని సర్వేలు చేయించుకున్నా తెలంగాణలో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అధికారపక్షానికి అర్థమవుతోంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమి సక్సెస్ కోసం కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరి వల్లనయితే లాభం పొందారో, వారినే ఓడించాలన్న స్థితి తెలుగు సీఎంలది. రెండు తెలుగు రాష్ట్రాలు , ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు బలమైన కోరి కలు. ఇద్దరు చంద్రుల రెండు వేర్వేరు కోరికల్లో ఏదో ఒక కోరికే తీరే అవకాశం ఉంది. ఎవరి వల్లనయితే లాభం పొందారో, ఎవరి నిర్ణయాల కారణంగా తాము అధికారంలోకి వచ్చారో వారినే ఓడించాలన్న కోరిక ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదీ. వచ్చే నెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అక్కడి ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకూ జీవన్మరణ సమస్యే. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసి ఈ నాలుగేళ్ల కాలంలో కొంతమేరకు పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఆ పార్టీ నైతిక స్థయిర్యానికి అత్యంత అవసరం కాగా, మసకబారుతున్న ప్రతిష్టను నిలబెట్టుకోడానికి కర్ణాటకలో గెలవడం బీజేపీకి అంతకన్నా ఎక్కువ అవసరం. సర్వేలు కర్ణాటక ఫలితం హంగ్ అవుతుందని చెపుతున్నా ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. పోటీదారులకంటే ‘చంద్రు’లకే టెన్షన్ ప్రత్యక్షంగా పోటీ పడుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల కంటే కర్ణాటక ఎన్నికల ఫలితం కోసం అత్యంత ఉద్విగ్న క్షణాలు గడుపుతున్నది చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్రావులే. రెండుసార్లూ బీజేపీ సహాయంతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని కోరిక. తెలం గాణ రాష్ట్రం ఇచ్చిన, రాష్ట్ర సాధన కారణంగా ప్రజలు తనను గెలిపించిన చంద్రశేఖరరావుకు అదే కాంగ్రెస్ ఓడిపోవాలన్న కోరిక. (కాంగ్రెస్ నిర్ణయం కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒప్పుకోను అంటే కుటుంబ సమేతంగా ఎందుకు సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారో కేసీఆర్ వివరణ ఇచ్చుకోవాలి). చంద్రబాబు గత ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలోనే బీజేపీ ఓడిపోవాలని చాలా కోరుకున్నారు. తన శక్తి మేరకు ప్రయత్నం కూడా చేశారు. అయినా అత్తెసరు మార్కులతో బీజేపీ అక్కడ బయటపడటం బాబుకు మింగుడు పడని విషయమే. గుజరాత్ ఎన్నికలకూ, కర్ణాటక ఎన్నికలకూ మధ్య బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ చంద్రబాబు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. రాత్రంతా కన్న పీడ కలలనే రోజంతా ఉపన్యాసాలలో ‘కేసులు పెడతారేమో, వేధిస్తారేమో’ అన్న మాటలతో తిరిగి జనానికి చెపుతున్నారు. ఓడించాలి.. అయినా రాజీ చేసుకోవాలి మనం తప్పులు చెయ్యకపోతే భయపడటం ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం ఆయన చుట్టూ ఉన్నవాళ్ళలో ఒక్కరికయినా లేదాయె. కర్ణాటకలో ఓడిపోతే తప్ప బీజేపీ దూకుడును అడ్డుకోవడం సాధ్యం కాదన్న ఆలోచన కారణంగానే బాబులో ఆ కోరిక రోజురోజుకూ మరింత బలపడుతున్నది. బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటూనే మరో పక్క అదే పార్టీతో మళ్లీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు ఆయన మానలేదు. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒక ‘సేఫ్ ప్యాసేజ్’ ఏర్పాటు చేసుకోవడం ఆయనకు అలవాటే. 2004–2014 మధ్యకాలంలో కూడా ఆయన యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నానని చెపుతూనే కేంద్రంలో కొందరు పెద్దలతో సంబంధాలు నెరపిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడూ ఎన్డీయేలో ఆ ‘సేఫ్ ప్యాసేజ్’ ఏర్పాటు చేసుకునే మరోవైపు పోరాటం చేస్తున్న పోజులు మీడియాకి ఇస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే ఇక విజృభించవచ్చు అన్నది ఆయన ఆలోచన. ఆయన కల నెరవేరుతుందో లేదో కానీ పీడకలలు మాత్రం ఆయనను వదలడం లేదు. నిన్నటికి నిన్న ద్వారపూడిలో మాట్లాడుతూ మీరంతా నా చుట్టూ ఉండి నన్ను రక్షించుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. శాసనసభలో మాట్లాడుతూ కూడా నన్ను వేధిస్తారేమో అన్నారు. ఒకరోజు దీక్షలో వచ్చిన వాళ్ళందరి చేతా కాళ్లు మొక్కించుకున్న ఉదంతం ఆయనలో పెరిగిపోయిన లేదా పేరుకుపోయిన ఆత్మన్యూనతకు నిదర్శనం. కాళ్ళు మొక్కుతున్న వాళ్ళను కనీసం వారించే ప్రయత్నం కూడా చెయ్యని చంద్రబాబు తన బావమరిది, శాసనసభ్యుడు బాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వచ్చీరాని పిచ్చి హిందీలో దుర్భాషలాడుతుంటే తన్మయంగా వింటూ ఉండిపోయారు. పొంచివున్న ప్రమాదంతో కలవరం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ, రెండు రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్‌లతో సమావేశం వంటివి చూసిన వాళ్లకు, ఈ మధ్య బీజేపీ వారు ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణ జరిపించాలని పదే పదే డిమాండ్ చెయ్యడం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆ వెనువెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ కావడం తరువాత మంగళవారం నాడు ప్రధానమంత్రినీ, కేంద్ర హోంమంత్రిని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితుల మీద నివేదిక సమర్పించనున్నట్టు వార్తలు రావడం ఏం సూచిస్తున్నట్టు? కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దగ్గర, రాష్ట్ర గవర్నర్ దగ్గర చంద్రబాబు ఏం మొరపెట్టుకున్నారు? వారు కేంద్రానికి ఎటువంటి సమాచారంతో కూడిన నివేదికలు ఇవ్వనున్నారు? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలే జవాబు చెపుతాయి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇప్పటికే బలం పుంజుకుని తన మీదికి దూసుకొస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నైతిక శక్తి మరింత పెరుగుతుందని చంద్రశేఖర్‌రావు ఆందోళన. ఎన్ని సర్వేలు చేయించుకున్నా వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పక్షం 40 నుండి 45 స్థానాలు మించి గెలవదనే తేలుతుండటం టీఆర్ఎస్ అధినేతను కలవరపెడుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే తాను ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి మద్దతు సాధించే నెపంతో ఆయన బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను కలిసి చర్చలు జరిపివచ్చారు. ఆయన వెనకే ఆయన ప్రియ మిత్రుడు, మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా బెంగళూరు వెళ్లి కర్ణాటక ఎన్నికల్లో తన పార్టీ పోటీ చెయ్యకుండా దేవెగౌడ పార్టీ జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పి వచ్చారు. మజ్లిస్, బీజేపీల మధ్య పరోక్ష సంబంధాలను గురించి గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా చర్చ పెద్ద ఎత్తునే జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ను బలహీనపరిచి, వీలైతే జేడీఎస్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం వచ్చేట్టు చూడాలన్నది చంద్రశేఖర్‌రావు ఆలోచన. ప్రథమ శత్రువే ప్రధాన లక్ష్యం బీజేపీ, కాంగ్రెస్‌ల నాయకత్వంలోని యూపీఏ, ఎన్డీఏలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని తానే ఏర్పాటు చేసి నాయకత్వం కూడా వహిస్తానని బయలుదేరిన చంద్రశేఖర్‌రావు బీజేపీని గెలిపించే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అన్న సందేహం రావచ్చు ఎవరికైనా. తెలంగాణలో ఇవ్వాళ ఆయన ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే కానీ బీజేపీ కాదు కాబట్టి. అసలు ఆయన ఆలోచిస్తున్న ప్రత్యామ్నాయ కూటమి ఆలోచన వెనక రెండు కారణాలు ఉన్నాయని ప్రచారం. ఒకటి వివిధ రాజకీయ పక్షాలు కాంగ్రెస్ వెనక చేరకుండా చూడటం ద్వారా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి సహాయపడటం అయితే మరొకటి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు కుమారుడికి అప్పగించే క్రమాన్ని సులభతరం, వేగవంతం చెయ్యడం. ఎవరినీ సంప్రదించకుండా, ఎవరితోనూ చర్చించకుండా చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో మీడియా ముందు ప్రకటించడం బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని, బెంగళూరు వెళ్లి దేవెగౌడను కలిసి రావడం జార్ఖండ్ నేత హేమంత్ సోరెన్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తదితరులు ఆయన ప్రయత్నానికి మద్దతు ప్రకటించడం అయ్యాక ఇప్పుడు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే విషయంలో ఎల్లుండి జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో నిర్ణయిస్తారని ప్రకటించడం వెనక ఉన్న మర్మం ఏమిటి? ముందు ఇల్లు చక్కబెట్టుకుని ఆ తరువాత ఇండియాను మార్చవచ్చునన్న ఆలోచనే కావచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడమే కీలకం తెలంగాణ ప్రజలు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అమలు చేస్తున్న కార్యక్రమాలపట్ల పెద్దగా వ్యతిరేకంగా లేరు. కానీ జనంలోకి బలంగా వెళ్లిన ప్రతికూల అంశాలు స్వయంగా ముఖ్యమంత్రి ధోరణి. సచివాలయం ముఖం చూడకపోవడం నుంచి ప్రగతి భవన్ నిర్మాణం దాకా, మంత్రుల నుంచి మొదలుకుని కార్యకర్తలకూ, ప్రజలకూ అందుబాటులో లేకుండా పోవడం దాకా, భిన్నాభిప్రాయాన్ని సహించని అప్రజాస్వామిక వైఖరితో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల గొంతులు నొక్కడం వరకూ అన్నది సత్యం. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందా అన్నది వచ్చే ఏడాది కాలంలో తెలియాల్సి ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో అధికారికంగా అస్తిత్వంలోకి రానున్న ప్రొఫెసర్ కోడండరాం నాయకత్వాన ఏర్పడిన తెలంగాణ జన సమితి ఒకవైపు, మార్క్సిస్ట్ పార్టీ చొరవతో ఏర్పడ్డ దళిత లెఫ్ట్‌ఫ్రంట్, భారత కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుని ముందుకు పోగలిగితే తెలంగాణలో 2019లో నిస్సందేహంగా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బాబు జూదంలో విలువలు బలి
ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు బీజేపీని మాత్రమే బోనులో నిలబెట్టాలన్న చంద్రబాబు ప్రయత్నానికి ఇంటా బయటా చుక్కెదురే అయ్యేట్టుంది. ఢిల్లీలో తానూ రెండు రోజులు వేసిన పగటి వేషాల గురించి వివరిస్తాను రమ్మని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క రాజకీయ పార్టీ కూడా హాజరు కాకపోవడం మించి ఒక ముఖ్యమంత్రికి అవమానకరం అయిన విషయం ఏముంటుంది? ప్రతిపక్షాల అవసరమే రాష్ట్రానికి లేదన్న అహంభావిని అదే ప్రతిపక్షాలు గుండు గుత్తగా తిరస్కరించడం మనం ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మించిన జూదగాడు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరనడంలో సందేహం అక్కర లేదు. రాజకీయాల్లో గెలుపు కోసం, అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం ఆయన ఈ నలభై ఏళ్లలో ఆడని జూదం లేదు. ఆ జూదంలో ఆయన ఎవరినయినా సరే పావులను చెయ్యడం, వారిని చంపుడు పందెంలో పణంగా పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ పావులు కాసేపు ప్రజలు కావొచ్చు, మరి కాసేపు తన సొంత పార్టీ వాళ్లే కావచ్చు, చివరికి ఆప్తమిత్రులూ, రక్త సంబంధీకులు కూడా కావచ్చు. ఆయనకు కావాల్సింది అధికారంలో చిరకాలం ఉండటం. జూద క్రీడలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి, కొంత నీతిని పాటించాల్సి ఉంటుంది. పక్కా జూదగాడు కూడా వాటిని పాటిస్తాడు. రాజకీయాలు జూద క్రీడ కాదు. ప్రజల జీవితాలను బాగుపరిచేవి రాజకీయాలు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే జూద క్రీడలోనే నియమాలు పాటిం చాల్సి ఉన్నప్పుడు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే రాజకీయాల్లో ఇంకెంత నీతిమంతంగా ఉండాలి అన్న విషయం చంద్రబాబుకు పట్టదు. ఆట తన సొంతం కావడానికి ఆయన ఏమయినా చేస్తారు. ఆటను క్రీడాస్ఫూర్తితో తీసుకోవడం ఆయన ఎరగడు. ఎప్పుడూ తనదే గెలుపు కావాలి. అందుకోసం ఎవరిని బలిపెట్టడానికి అయినా సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా కోసం జరుగుతున్న పోరాటంలో ఆయన అటువంటి ఒక ఆటను ప్రమాద స్థాయికి తీసుకుపోతున్నారు. ఈ ఆటలో ఆయన ఈసారి బలి చెయ్యదలుచుకున్నది కేంద్రంలో నిన్నటి దాకా తానూ అధికారం పంచుకున్న భారతీయ జనతా పార్టీని. నిన్న విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. సునాయాసంగా అసత్యాలు మాట్లాడటంలో తెలుగుదేశం నాయకులందరికీ నాయకుడి నుంచే శిక్షణ లభించినట్టుంది. బాబు జూదంతో రాష్ట్రానికి పెను నష్టం కొడాలి నాని ఈ మాట అనడానికి రెండు రోజుల ముందు ఏం చేసయినా సరే చంద్రబాబు నాయుడు చేతిలో నుండి అధికారం జారిపోకుండా చూడడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న ఒక మీడియా యజమాని రాసిన విషయాలు గుర్తు చేసుకుంటే చంద్రబాబూ, ఆయన పార్టీ ఈ నాలుగేళ్లలో మోదీనీ, బీజేపీనీ ఎదిరించారా లేక వెన్నుపోటు పొడవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారా అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పక్కకు పోయి ప్యాకేజీ వ్యవహారం ముందుకు వచ్చినప్పుడు పార్టీలో చర్చ జరిగితే ఇప్పుడు వచ్చే నిధులు తీసుకుందాం రెండేళ్ల తరువాత బీజేపీతో ఎవరుంటారు, వొదిలేద్దాం అన్నారట. రెండేళ్ల తరువాత అంటే ఎన్నికల సంవత్సరంలో బీజేపీని వదిలేసి వేరే దారి చూసుకోవాలని చంద్రబాబు అప్పుడే నిర్ణయించుకున్నారన్న మాట. ఈ విషయం వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలుసుకున్న బీజేపీ నాయకత్వం అప్పటి నుండే నిధుల విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నదనీ, కొన్ని నిధులను వాపసు తీసుకుందనీ తెలిసింది. విభజన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది అనుభవజ్ఞుడు అయితే గట్టెక్కిస్తాడని స్టేట్స్‌మన్ చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇస్తే ఆయన ఆడిన ప్రమాదకరమయిన జూదం రాష్ట్రానికి ఎంత నష్టం చేసిందో ఇది స్పష్టం చెయ్యడం లేదా. అమరావతిలో అంతర్జాతీయ ఆనంద నగరాల సదస్సు ప్రారంభంలో మాట్లాడుతూ ఆయన సంతోషంగా ఉండడానికి ప్రజలకు కొన్ని చిట్కాలు చెప్పారు, ఆడండి పాడండి, అవేవీ చెయ్యలేకపోతే వారానికి ఒకసారి రెండు మూడు గంటలు గట్టిగా అరవండి అని. మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పారాయన. తన రాజకీయ జీవితం మొత్తంలో గెలిచిన రెండుసార్లూ అందుకు కారణం అయిన బీజేపీని షరామామూలుగానే మళ్ళీ బలి చెయ్యడానికి పథకం రచించిన క్రమంలో చంద్రబాబు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారనీ అందులో నుంచి బయట పడటం కోసం ప్రతిపక్షం లేని శాసనసభ సమావేశాలను కొద్ది రోజులు పొడిగించి మరీ గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చారని అధికార పక్షం వారే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న జూదంలో పావులుగా మారి బలి అయిపోవడానికి ప్రస్తుత బీజేపీ నాయకత్వం వాజ్‌పేయి, అడ్వాణీల చేతుల్లో లేదు, తాడిని తన్నే వాడుంటే తలదన్నే వాడు ఉంటాడన్న చందంగా బీజేపీ నాయకత్వం ఇప్పుడు మోదీ, అమిత్ షాల చేతుల్లో ఉంది. అక్కడే చంద్రబాబు తన ఎత్తు జిత్తుల్లో విఫలం అయ్యాడు. చివరి సంవత్సరంలో బీజేపీని వదిలేసి, ఈ నాలుగేళ్ళూ జరిగిన అసమర్థ పాలనకు బాధ్యత కేంద్రం మీదకు నెట్టి తాను తప్పుకుని మళ్ళీ ప్రజల మద్దతు పొందాలన్నది ఆయన ఆలోచన. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నది అదే. ఇంటా–బయటా చుక్కెదురే! ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుని దేశ రాజధానిలో రాష్ట్ర ప్రజల సమస్యను ఎలుగెత్తి చాటుతుంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మాత్రం పగటి వేషాలు కూడా ఎక్కువసేపు వెయ్యలేక ప్రధాన మంత్రి ఇంటి దగ్గర ధర్నాతోనూ, మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళితోనూ సరిపుచ్చి అమరావతి దారి పట్టారు. ఈ నాలుగేళ్ళు రాష్ట్రంలో జరిగిన అసమర్థ, అవినీతి పాలన నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి రాష్ట్రమంతటా బస్ యాత్రలు చేసి బీజేపీని విమర్శించండి అంటే అందుకు కూడా టీడీపీ పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా లేనందువల్ల వాయిదా పడ్డట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు బీజేపీని మాత్రమే బోనులో నిలబెట్టాలన్న చంద్రబాబు నాయుడు ప్రయత్నానికి ఇంటా బయటా చుక్కెదురే అయ్యేట్టుంది. ఢిల్లీలో తానూ రెండు రోజులు వేసిన పగటి వేషాల గురించి వివరిస్తాను రమ్మని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క రాజకీయ పార్టీ కూడా హాజరు కాకపోవడం మించి ఒక ముఖ్యమంత్రికి అవమానకరం అయిన విషయం ఏముంటుంది? ప్రతిపక్షాల అవసరమే రాష్ట్రానికి లేదన్న అహంభావిని అదే ప్రతిపక్షాలు గుండు గుత్తగా తిరస్కరించడం మనం ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. అఖిల పక్షం పేరిట ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కొందరు భజనరాయుళ్ల పొగడ్తలే మిగిలాయి తప్ప రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకలేదు. రాష్ట్రానికి, ప్రజలకూ కావాల్సింది ఏమిటో గుర్తు చేసి ఆ దారిలోకి తననూ తన పార్టీని మళ్లించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే రాష్ట్రాధినేతగా మద్దతు ప్రకటించకపోతే కనీసం సానుభూతి కూడా తెలుపని ఏలికను బహుశా చంద్రబాబు నాయుడులోనే చూస్తాం. పైగా తన అనుకూల మీడియాలో ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష పాండవులు చేస్తున్న పోరాటం ప్రజలకు చేరకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మెజారిటీ మీడియా ఒక ముఖ్యమంత్రికి ఇంతగా లొంగిపోవడం భారతదేశ చరిత్రలో ముందెన్నడూ లేదు. ఏపీకి అన్యాయం చేసింది బీజేపీయేనా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు తానూ బీజేపీతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రతిపక్షానికి ఆ పార్టీతో సంబంధం అంటగట్టే ప్రయత్నం, బీజేపీని మాత్రమే దోషిగా నిలబెట్టే ప్రయత్నమూ చెయ్యడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసింది, అయితే ఆ అన్యాయం బీజేపీది మాత్రమే అని చెప్పదలచుకున్న చంద్రబాబునాయుడు ఎత్తుగడ రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా? ఆయన ప్రయత్నాలను మోదీ షా ద్వయం చూస్తూ ఊరుకుంటారా? ఈ నాలుగేళ్ళలో తాము ఇచ్చిన నిధులు, వాటి దారి మళ్లింపు గురించిన సమాచారంతో బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే నెల జరగనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతి చిట్టాను బయట పెట్టేందుకు అంతా సిద్ధం అయిందన్న వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రస్తావన వొచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు ప్రజలు ఉద్యోగ, వ్యాపార అవసరాల దృష్ట్యా పెద్ద సంఖ్యలో కర్ణాటక రాజధాని బెంగళూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణాలో కూడా లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువాళ్ళు ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్త రోజుల్లో అక్కడ ఎన్నికల్లో వేలు పెట్టబోయి ఎదుర్కొన్న పరాభవం చాలదన్నట్టు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కూడా తల దూర్చడానికి సిద్ధపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. గతంలో గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీ ఓటమి కోసం కాంగ్రెస్ వారికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారన్న ప్రచారం బలంగా ఉంది. బీజేపీ నాయకత్వం ఆ విషయంలో చాలా ఆగ్రహంతో ఉన్నది. మిత్ర పక్షంగా ఉండి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడే ఆ పని చేస్తే ఇప్పుడు ఆ బంధాలన్నీ తెగిపోయాక కర్ణాటకలో బహిరంగంగానే దిగుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి ఇప్పటికే కర్ణాటకకు ప్రచారానికి వెళ్ళారు. కాంగ్రెస్‌తో ఏర్పడుతున్న కొత్త బంధాన్ని మరింత పదిలపరచుకునే ప్రయత్నంలో అక్కడి తెలుగు ప్రజలను ఇబ్బందుల పాలు చేసే మరో ప్రమాదకర జూదానికి చంద్రబాబు తెర లేపారు. ‘‘కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో రాయి ఏర పోయింద’’న్న సామెత ఆయన విషయంలో అక్షర సత్యం. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఏ వెలుగులకీ ప్రజాధనం?
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సచివా లయాన్ని అక్కడి నుంచి మార్చే ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం విషయంలో కూడా ఆయనకు మొదటి నుంచి విముఖతే ఉంది. మనుషులకు విశ్వాసాలు ఉండటం సహజం. ఎవరి మత విశ్వాసాలు, వాస్తు నమ్మకాలు వారివి. అయితే అవి వ్యక్తిగతం కావాలి కానీ పరిపాలకుడి హోదాలో వాటిని ఆచరిస్తానంటేనే, అందుకోసం ఇంతింత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తానంటేనే అభ్యంతరం. మన రాజకీయ నాయకులు ప్రజల డబ్బుతో ఆడంబరాలకు పోయినప్పు డల్లా భారతదేశంలో రెండవ పెద్ద రాష్ట్రం బిహార్‌కు రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ గుర్తుకొస్తారు. గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన అధికారిక గృహ సముదాయ ప్రవేశం చేసినప్పటి దృశ్యాలు టీవీలలో చూసినప్పుడు, వార్తాపత్రికలలో ఆ వార్తలు చదివినప్పుడు కర్పూరీ ఠాకూర్ మరొక్కసారి గుర్తుకొచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కర్పూరీ ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని పితుంజియా. ఒక పేద క్షురకుల కుటుంబంలో జన్మించిన కర్పూరీ మొట్టమొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి. ఆయన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఆందోళనలో భాగస్వామి కూడా. ప్రస్తుత క్రియాశీల రాజకీయ నాయకులు లాలూప్రసాద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వంటి పలువురు కర్పూరీ ఠాకూర్ శిష్యులే. బిహార్ ప్రజలు ఆయనను ‘జన నాయక్’ అని పిలుచుకునేవారు. కర్పూరీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన కుటుంబం స్వగ్రామంలోనే ఉండేది. భార్యాపిల్లలు, తండ్రి, తమ్ముడు అందరూ. ఆయన పూర్వీకుల ఆస్తి నాలుగు గుడిసెలు. ఒక ప్రముఖ పత్రికా విలేకరి ముఖ్యమంత్రి గ్రామానికి వెళ్లి ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్‌ను పలకరించినప్పుడు ‘‘కొడుకు ముఖ్యమంత్రి కదా! మీరేమిటి ఇలా?’’ అని అడిగితే ‘‘అయితే ఏమిటి’’ అని జవాబిచ్చాడట గోకుల్. ఆ విలేకరి రాష్ట్ర రాజధాని పట్నా తిరిగొచ్చి ముఖ్యమంత్రిని కలసి, ‘ఏమిటి? మీ కుటుంబం అలా పల్లెలో, పేదరికంలో?’’ అని అడిగితే ‘‘నేను అంత తెలివి గలవాడిని కాదేమో’’ అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట. ఒక రోజు కర్పూరీ ఠాకూర్ అప్పటి బిహార్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ వ్యవహారాలు ఏవో చర్చించి వెళ్లిపోయారు. మరునాడు పత్రికల్లో ముఖ్యమంత్రి కుమారుడి వివాహం జరిగిన వార్త చూసిన గవర్నర్ ఆయనకు ఫోన్ చేసి, ‘‘ఇదేమిటి నన్ను పిలవలేదు మీ ఇంట పెళ్ళికి?’’ అని అడిగితే ‘‘మీలాంటి వారిని పిలిచే స్థాయి, వనరులు నాకు లేవు సార్!’’ అని వినమ్రంగా జవాబిచ్చారట. ఈ రోజుల్లో ఇటువంటివి కనీసం ఊహించగలమా? పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల కుటుంబాలు పేదరికంలోనే ఉండిపోవాలని కాదు, ఈ ఉదాహరణ కర్పూరీ నిరాడంబరత్వాన్ని గుర్తు చెయ్యడానికి మాత్రమే. ఆడంబరాలకి అందలం పదవుల్లో ఉన్నవారు వీలైనంత నిరాడంబరంగా ఉండాలన్న స్పృహ, మనం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలదేనన్న స్పృహ రోజురోజుకూ రాజకీయ నాయ కుల్లో తగ్గిపోతున్నదని చెప్పుకోవడానికే ఇదంతా. ఇప్పటికి కూడా కర్పూరీ ఠాకూర్ లాగా నిరాడంబర జీవితం గడుపుతున్న నేతలు అక్కడక్కడా లేక పోలేదు. ప్రసిద్ధ ‘టైం’ పత్రిక 2012లో ప్రపంచంలోని అత్యంత ప్రభా వశీలురైన వ్యక్తులలో ఒకరిగా ఎంపిక చేసిన ‘ఫైర్ బ్రాండ్’ రాజకీయ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాడంబ రతకు పెట్టింది పేరు. వామపక్ష నాయకుడు 1998 నుంచి త్రిపుర ముఖ్య మంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ తన జీతభత్యాలన్నిటినీ మార్క్సిస్ట్ పార్టీకి విరాళంగా ఇచ్చేసి, నెల నెలా పార్టీ ఇచ్చే 5 వేల రూపాయలు తన సొంత ఖర్చులకు సర్దుకుంటారు. ఆయన కుటుంబానికి సొంత ఇల్లు కానీ, వాహనం కానీ లేవు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య స్వయంగా బయటికెళ్లి తన పనులన్నీ చక్కబెట్టుకుంటారు. ఈ నాయకుల రాజకీయాలు ఎట్లా ఉన్నా, వాటితో ఎవరికైనా అంగీకారం లేకపోయినా వారి జీవనశైలి మాత్రం అను సరణీయం, ఆదర్శనీయం కూడా. ఇప్పుడు అవసరమా? ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాస సముదాయం విషయానికి వస్తే - 150 గదులతో, తొమ్మిది ఎకరాల స్థలంలో 39 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొమ్మిది మాసాల్లో ఆగమేఘాల మీద నిర్మించారు. ముఖ్య మంత్రికి ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించడానికి అనువైన సౌకర్యాలు అవసరమే. అవి లేనప్పుడు వాటిని సమకూర్చుకోడంలో తప్పులేదు. ముఖ్య మంత్రి నివశించడానికి సొంత ఇల్లు లేకపోతే తప్పకుండా ప్రభుత్వ వసతి కూడా అవసరమే. పరిపాలనలో తీసుకునే అనేక నిర్ణయాల కారణంగా భద్రత కూడా అవసరమే కావచ్చు. అయితే ఈ ఏర్పాట్లన్నీ తెలంగాణ రాజ ధాని హైదరాబాద్‌లో ఇంతకు ముందు లేవా అన్నదే ప్రశ్న. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి, రాజధాని లేకుండా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి ఆ సమస్య ఉంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రికి కూడా ఆ అవసరం ఉంటే కూడా అర్థం చేసుకోవలసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది ఇంకో విడ్డూరం. ఆయన అమరావతి అనే ఎవరికీ అంతుపట్టని ఒక రాజధాని నిర్మాణం గురించి అందరినీ ఊరిస్తున్నారు. అందులో ముఖ్యమంత్రి అధికారిక గృహ సముదాయం ఎట్లా ఉంటుందో కానీ ఆయన ఇప్పటికే తమది కాని చోట, తనది కాని డబ్బు కోట్లలో తాత్కా లిక గృహ సముదాయాలకు తగలేశారు. హైదరాబాద్‌లో ఆయనకు కేటాయించిన సచివాలయ భవనాలు ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి అప్ప జెప్పాల్సిందే అని తెలిసీ వాటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల నిధులు కోట్ల కొద్దీ ఖర్చు చేశారు. తాత్కాలిక క్యాంపు కార్యాలయం లేక్ వ్యూ అతిథి గృహం మీద మరికొన్ని కోట్లు- ఇట్లా ప్రజాధనం, తమది కాని తాత్కాలిక అవస రాలకు మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేసిన ముఖ్యమంత్రి బహుశా దేశంలో చంద్ర బాబునాయుడు ఒక్కరేనేమో! ప్రజాధనం నమ్మకాల పాలు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సచివాలయాన్ని అక్కడి నుంచి మార్చే ఆలోచన చేశారు. ముఖ్య మంత్రి అధికారిక నివాసం విషయంలో కూడా ఆయనకు మొదటి నుంచి విముఖతే ఉంది. మనుషులకు విశ్వాసాలు ఉండటం సహజం. ఎవరి మత విశ్వాసాలు, వాస్తు నమ్మకాలు వారివి. అయితే అవి వ్యక్తిగతం కావాలి కానీ పరిపాలకుడి హోదాలో వాటిని ఆచరిస్తానంటేనే, అందుకోసం ఇంతింత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తానంటేనే అభ్యంతరం. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మత విశ్వాసాలకు అనుగుణంగా నూతన గృహ సముదాయ ప్రవేశం జరిగిందిలెమ్మని ఎవరైనా సరిపెట్టుకోవచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా సంక్ర మించిన ముఖ్యమంత్రి ఆసనంలో ఒక మతగురువును కూర్చోబెట్టడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని గురించి ఎవరూ మాట్లాడరు. మీడియా కూడా మౌనంగా ఉంటుంది. చంద్రశేఖరరావు గారి స్వగృహంలో ఆయన ఏ మత గురువును ఎక్కడ కూర్చోబెట్టినా ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. అడిగే హక్కు ఎవరికీ ఉండదు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ అధికారిక నివాస సముదాయం విషయంలో ముఖ్యమంత్రి ఇంకో విమర్శను ఎదుర్కోక తప్పదు. అధికారానికి రాక ముందు నుంచే పేద ప్రజలకూ, వివిధ వర్గాల వారికీ రెండు పడకల గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోలేని అనేక మంది ఆ హామీ నెరవేరుతుందని ఆశతో ఉన్న సమయంలో రెండున్నరేళ్లు గడిచినా ఆరంభశూరత్వంగానే మిగిలి పోవడం చూస్తున్నాం. అంతేకాదు, ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు మాసాల కాలంలో వివిధ వృత్త్తి, కులసంఘాలకు భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. ఇవన్నీ వదిలేసి అంత అత్యవసరంకాని ముఖ్యమంత్రి అధికార గృహ సముదాయాన్ని సమకూర్చుకోవడం ఎట్లా సమర్ధనీయం? చంద్రశేఖరరావు గారికి సొంత ఇల్లు ఉంది. అదీకాక గతంలో డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన అధికారిక గృహ సముదాయం ఉంది. తమ విశ్వాసాల కోసం వాటిని కాదని ఇప్పుడు మరో సముదాయం నిర్మించడం ఆక్షేపణీయమే. గతంలో ముఖ్యమంత్రులు చాలా వరకు తమ సొంత ఇళ్లలోనే ఉండేవాళ్లు. ఒకరిద్దరికి ఇల్లు లేకపోతే ప్రభుత్వ అతిథి గృహాన్ని అధికార నివాసం కింద మార్చుకున్నారు. ఒక్క డాక్టర్ రాజశేఖరరెడ్డి మాత్రమే 2004లో ముఖ్యమంత్రి అయ్యాక అధికార నివాసం నిర్మించారు. ముఖ్య మంత్రి అయ్యేనాటికి రాజధానిలో ఆయనకు సొంత ఇల్లు లేదు. అయినా రాజశేఖరరెడ్డి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తెలంగాణ ముఖ్య మంత్రి ఈ నూతన గృహ, కార్యాలయ సముదాయం నుంచి చేపట్టే జనహిత కార్యక్రమాల ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల నుంచి ఈ చర్యకు సమర్ధన. అయినా ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా వాళ్ల విశ్వాసాలకు అనుగుణంగా కొత్త బంగ్లాలు కడతామంటే ఎట్లా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తిక్కెక్కిస్తున్న పవన్ లెక్క
డేట్లైన్ హైదరాబాద్ పవన్ కల్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాలలో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? ఆయన ఎవరి వైపు? ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? అన్న సందే హాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగడానికి కారణం ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలలో అస్పష్టత, అభిప్రాయాలలో గందరగోళం ఆ సందేహాలకు మూలం. అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇది జరిగిన కొన్ని నెలలకే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసేసుకుని ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు కూడా చేశారు. దీనితో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో జనం ఒక విషయం పట్టించుకోకుండా వదిలేసినట్టు కనిపిస్తున్నది. అది– వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహాలు కేంద్ర ప్రభుత్వానికి అచ్చిరావని ఇప్పటికే ఒకసారి తేలిపోయింది. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే లక్ష్యంగా తిరుమల దారిలోని అలిపిరి వద్ద తీవ్రవాదులు మందుపాతర పేల్చారు. ఆ ఘటన ద్వారా వచ్చిన సానుభూతిని వాడుకుని మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆనాడు ఆలోచించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఆయన సలహా పాటించి ఆరునెలల ముందే ఎన్నికలకు (2004) వెళ్లింది. అప్పుడే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం, ఢిల్లీలో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కూడా చంద్రబాబు లేఖకు స్పందించి, ఆయన సలహా మేరకే జరిగి ఉంటే మోదీ ప్రభుత్వానికి తగులుతున్న జనాగ్రహం వేడితో బీజేపీ నేతలకు పొరపాటు అర్థమయ్యే ఉంటుంది. అంటే రెండోసారి ఎన్డీఏని చంద్రబాబు ఇబ్బందుల్లో పడేశారు. కానీ ఆయన ఆ లేఖ రాసి నప్పుడు చేసుకున్నంత ప్రచారం, ఇప్పుడు చేసుకోవడానికి మాత్రం సాహసం చేయడం లేదు. కేంద్ర నిర్ణయం వికటించేసరికి ఇదంతా తన లేఖ ఘనతేనని ప్రకటించుకునేందుకు ముందుకు రావడం లేదు. పెద్దనోట్ల రద్దు.. మింగలేక, కక్కలేక.. నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే పద్ధతి ఇది కాదనీ, ఇది ఒక పరిణతి చెందిన ప్రభుత్వ నిర్ణయం మాదిరిగా కాకుండా, ఆకతాయి పనిగా ఉందనీ అత్యధిక సంఖ్యాకులయిన ప్రజలు ఇవాళ అభిప్రాయపడుతున్నారు. ఒకటి నిజం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఏ మాత్రం సానుకూల ప్రజాస్పందన పొందినా, చంద్రబాబునాయుడు వెంటనే ఇదంతా తన లేఖ ఘనతేనని కచ్చితంగా ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు ఆయన పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టు తయారయింది. కేంద్ర నిర్ణయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలూ తీవ్రమయిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చే మాసాల్లో ఎదురుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బహిరంగంగానే కేంద్రం నిర్ణయాన్ని విమర్శి స్తున్నారు. కేంద్రంలో భాగస్వామి కావడం వల్లా, పెద్ద నోట్ల రద్దును కోరుతూ స్వయంగా లేఖ రాసిన కారణం వల్లా చంద్రబాబు ఇప్పుడు ఏమీ మాట్లా డలేరు. కానీ మోదీతోపాటు జనాగ్రహాన్ని కొంత తానూ మూటకట్టుకోక తప్పదు. అదీ కాకుండా రద్దు నిర్ణయం చాలా ముందే తెలుసు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ పెద్దలూ, వారి సమర్థకులూ ఇప్పటికే సర్దుకున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది. మొత్తానికి ఈ వ్యవహారం ప్రత్యేక హోదా హామీని అటక ఎక్కించిన కారణంగా 2019 ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి ఎదురుకానున్న వ్యతిరేకతను మరింత తీవ్రం చేస్తుం దనడంలో సందేహం లేదు. నోట్ల రద్దు గందరగోళంలో పడి అందరూ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఇక ఆయన క్రియాశీలక రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి పోటీ చేస్తానన్నారు! 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిర్ధారించారు. గత వారం అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగం మధ్యలో ఈ ప్రకటన చేశారు. 2014 ఎన్నికలకు కొద్ది ముందుగా ఆయన తన సొంత పార్టీ జనసేన ప్రకటించినా పోటీ చెయ్యబోవడం లేదని స్పష్టంగా చెప్పి బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం మాత్రం చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తీవ్రమయిన సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నా మిత్రధర్మం అనుకున్నారేమో, ఆయన తాను బలపరిచిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నర సంవత్సరాలు గడిచాయి. అడుగడుగునా సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే శాసనసభలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం ఆందోళన బాట పట్టి, దాదాపు రోజూ వీధుల్లోనే ఉంటున్న పరిస్థితిలో కూడా ప్రశ్నిస్తానూ, ప్రశ్నిస్తానూ అని పదే పదే చెప్పిన పవన్ ఒక్కమాట మాట్లాడకుండా ఇప్పుడు పెదవి విప్పారు. పవన్ వైఖరి ఏమిటి? ఎవరైనా రాజకీయాల్లోకి ప్రవేశించాలని అభిలషించినా, ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా ఆ ఆలోచన వెనుక చాలా అంతర్మథనం జరగడం సహజం. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల రాజకీయాల వైపు బలవంతంగానే ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. పవన్ కల్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాలలో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? ఆయన ఎవరి వైపు? ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? అన్న సందేహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగడానికి కారణం ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలలో అస్పష్టత, అభిప్రాయాలలో గందరగోళం ఆ సందేహాలకు మూలం. రాజకీయాల్లోకి వచ్చేవారు ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికీ, ఆ తరువాత అధికారంలోకి రావడానికే. పవన్ కల్యాణ్ గత రెండు మాసాల కాలంలో తిరుపతి నుంచి మొదలు పెట్టి అనంతపురం దాకా మాట్లాడిన మూడు సభల్లో ఎక్కడా ఆయన అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించదు. తిరుపతి తరువాత ఆయన ప్రత్యేక హోదా పోరాటం కాకినాడ నుంచి ప్రారంభించారు. ఆ తరువాత అనంతపురం వచ్చేసరికి మాత్రం ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అంశంలో స్పష్టత వచ్చింది. ఈ మధ్యలో ఆయన ఏలూరులో ఇల్లు తీసుకోవడం, అక్కడే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఆయనను అభిమానించే వారిలో కొంత నమ్మకం కలిగించిన మాట నిజమే కావచ్చు. అయినా ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కల్యాణ్ మాటలు మాత్రం ఆయన అభిమానులను నిరుత్సాహపరిచేవిగానే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో తన శత్రువు ఎవరో ఆయనకు స్పష్టత లేదు. బలంగా నిలిచి శత్రువు మీద గెలుస్తాననే ఆత్మవిశ్వాసమూ ఆయన మాటల్లో వినిపించదు. ప్రజలు తనను నమ్ము తున్నారనీ, తనతో ఉంటారనీ కూడా ఆయనకు నమ్మకం లేదు. అదే వేదిక మీద ఆయన ‘‘మీరు నాతో ఉన్నా లేకున్నా నేను మీతో ఉంటాను’’అనడం, అలాగే పోటీ అయితే చేస్తాను, గెలిచినా ఓడినా సరే అనడంతోనూ ఆయనకు తాను ఏం చేయదలుచుకున్నారన్న విషయంలో స్పష్టత లేదన్న సంగతి అందరికీ అర్థం అయింది. తెలుగుదేశం పార్టీలో అవినీతిని గురించి ఆయన ప్రస్తావించారు. 20 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొనడం తప్పు అనే మాట మాట్లాడరు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని విమర్శిస్తారు. సన్మా నాలు చేయించుకున్న వెంకయ్యనాయుడును ఇతర బీజేపీ నాయకులనూ విమర్శిస్తారు. కానీ మొట్టమొదటి రోజు నుంచీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనతో భుజం కలపడానికి సిద్ధపడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని తెలుగు దేశం, బీజేపీ కూటమి అంటుంటే నిరంతర పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆందోళన చేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి బరిలోకి దిగినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన అనేక సభల్లో మాట్లాడారు. అప్పుడు ఉన్న స్పష్టత ఇప్పుడు సొంత పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వారిని ఆయన చాలా మొహమాటంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో లేదా రైతు రుణమాఫీ, కాపుల రిజర్వేషన్లు మొదలయిన సమస్యల మీద పోరాటం చేస్తే, నిలదీస్తే పెద్ద పెట్టున విరుచుకుపడి సంస్కారహీనమయిన భాషలో దూషించే అధికారపక్ష పెద్దలు కూడా పవన్ కల్యాణ్‌ను గట్టిగా విమర్శించడానికి సిద్ధపడటం లేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని పవన్ చేసిన విమర్శ మీద తెలుగుదేశం సీనియర్ నాయకుడొకరు, ‘అవును కొద్ది మాసాల క్రితం మా ముఖ్యమంత్రి కూడా పార్టీ మీటింగ్‌లో ఈ విషయం చెప్పారు, పవన్‌కు మెల్లగా నచ్చచెబుదాం అన్ని విషయాలు’ అన్న స్వరంలో మాట్లా డారంటే ఏమనుకోవాలి? కాపుల రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ పద్మ నాభం పాదయాత్ర తలపెడితే అది శాంతిభద్రతల సమస్య అవుతుంది. దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే సమయంలో కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు పాదయాత్ర చెయ్యడానికి మాత్రం అనుమతి ఉంటుంది. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. వీటిలో వేటి గురించి పవన్ నోరు మెదపరు. విపక్షాలతో కలవరేం? ఇదే ధోరణి కొనసాగితే పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం కేంద్రం మీదనో, రాష్ట్ర ప్రభుత్వం మీదనో అని ఎవరూ అనుకోరు. ఈ సమస్యలన్నిటి మీదా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంతో కలసి నడిస్తేనే జనం నమ్ముతారు. అధికారపక్షాలతో పవన్ చేస్తున్నది లాలూచీ కుస్తీ అనే అపవాదు మూట కట్టుకోకుండా ఉండాలంటే, జనసేనను, సేనాధిపతినీ ప్రజలు నమ్మాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల మీద జరుగుతున్న పోరాటంలో నిజాయితీగా ఇతర పక్షాలతో భుజం కలిపి నడవటం ఒక్కటే మార్గం. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
దాతల భూములకూ శఠగోపం
డేట్లైన్ హైదరాబాద్ కొన్ని వందల గజాల ప్రభుత్వ భూమిని ఎవరికయినా ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే కూడా మంత్రివర్గం ఆమోదం పొందడం సాధారణంగా అనుసరించే పద్ధతి. మరి సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఎందుకు ఏపీ మంత్రివర్గ సమావేశం ముందుకు పోలేదు? ఈ భూములను అమ్మదల్చుకున్నట్టు బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదు? వెనుకటికి ఒక పెద్ద మనిషిని పాండవులు ఎవరో తెలుసా అని అడిగితే పంచ పాండవులు నాకు ఎందుకు తెలియదు మంచం కోళ్ళ వలె అని సుద్ద ముక్కతో నల్లబల్ల మీద మూడు అంకె వేసి చేతి వేళ్ళు రెండు చూపి నోటితో ఒక్కరు అన్నాడట. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా సాగుతున్న సదావర్తి సత్రం భూముల అమ్మకం వ్యవహారంలో అక్కడి అధికార పార్టీ పెద్దలు ప్రభుత్వ ముఖ్యులూ మాట్లాడు తున్న మాటలు ఈ పంచ పాండవుల కథనే గుర్తు చేస్తున్నాయి. ధార్మిక కార్యక్రమాల కోసం ఎవరో దానం చేసిన భూములను ప్రభుత్వాలు అమ్ము కోవచ్చా అన్న చర్చ తర్వాత చేద్దాం. సదావర్తి సత్రానికి దాతలు ఇచ్చిన భూమి చెన్నైనగరంలో ఉంది. సత్రంలో రాసి ఉన్న శాసనం ప్రకారం అక్కడికి వచ్చి బస చేసే వారికి అవసరమయిన భోజనం తదితర సదుపాయాలూ సమకూర్చడానికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు దాతలు ఆ భూములు దానం చేసారు. చెన్నైలో ఈ సత్రానికి సంబంధించి మొత్తం 554 ఎకరాల భూమి ఉండాలి. అందులో 471 ఎకరాల భూమి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వేర్వేరు సంస్థలకు ధారాదత్తం చేసినట్లు రికార్డ్‌లు చెపుతున్నాయి. పోయినవి పోగా 83 ఎకరాల భూమి మిగిలింది. అది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని సరయిన ఉపయోగంలో పెట్టి ఆ భూమి మీద వచ్చే ఆదాయాన్ని దాతలు ఏ ప్రయోజనం కోసం కేటాయించారో అందుకు ఖర్చు చెయ్యాలి. అక్కడెక్కడో చెన్నపట్నంలో ఉంది మనం దాన్ని అజమాయిషీ చెయ్యలేం అనుకుంటే నిబంధనలను అనుసరించి ఆ భూములు అమ్మి, వచ్చిన డబ్బుతో దాతల మనోభీష్టం నెరవేర్చవచ్చు. అసలు ఈ 83 ఎకరాలను ఏం చెయ్యాలో ఆలోచించే ముందు తమిళనాడు ప్రభుత్వం అమ్ముకున్న లేదా వితరణగా ఎవరికో ఇచ్చేసిన 471 ఎకరాల భూమిని తిరిగి ఎలా సాధించుకోవడం, సాధ్యం కాక పోతే బదులుగా ఆ రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎంత మొత్తం పరిహారం సాధిం చుకోవడం అన్న ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. కానీ ప్రభుత్వం ఆ భూమి గురించి ఆలోచన కూడా చేసినట్లు లేదు. ఈ మిగిలిన 83 ఎకరాలను ఎప్పుడెప్పుడు అమ్మేద్దామా అన్న ఆలోచనే చేసింది. సదావర్తి సత్రం భూముల్ని ఎంతో కొంత మొత్తానికి ఇప్పుడు వెంటనే అమ్మేసి ఆ డబ్బు తెచ్చుకోకపోతే కొత్త రాజధాని కట్టడానికి నిధులు ఉండవేమో అన్నంత హడావుడిగా ఆ భూములను అమ్మకానికి పెట్టింది. ఇక ఈ అమ్మకం వ్యవహారం ఎట్లా సాగిందో చూడండి. ఇదంతా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందికి వచ్చే వ్యవహారం. ఆ శాఖకు మంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాణిక్యాలరావుకు చెన్నైలోని సదావర్తి సత్రం భూముల అమ్మకం గురించిన సమాచారం ఏమీ లేనట్టుంది. ఈ భూముల అమ్మకం వ్యవహారంలో ఎంత చర్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి, ఆయన కుమా రుడు ఇద్దరి మీదా ఆరోపణలు వస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నారు కాబట్టి మాణిక్యాల రావుగారికి ఈ వ్యవహారం గురించి ఏమీ తెలిసినట్టు లేదు అనుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సరిగానే వ్యవహరిం చిందని సమర్థించచూసే బీజేపీ నాయకులు కూడా నీళ్ళు నమలడం చూస్తుంటే.. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా సాగిందనే అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తున్నది. కొన్ని వందల గజాలు ప్రభుత్వ భూమి ఎవరికయినా ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే కూడా మంత్రివర్గం ఆమోదం పొందడం సాధారణంగా అనుసరించే పద్ధతి. మొన్న ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయినప్పుడు కొన్ని సంస్థలకు భూముల కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. మరి సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఎందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముందుకు పోలేదు? ఈ భూములను ప్రభుత్వం అమ్మదల్చుకున్నట్టు బహిరం గంగా ఎందుకు ప్రకటించలేదు? ఆ భూములను వేలం వెయ్యాలని అనుకున్న ప్పుడు అక్కడ తమిళనాడులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలలో ప్రకటనలు ఇచ్చి అందరికీ తెలిసేట్టు చెయ్యకుండా ఎందుకు అధికార పక్షానికి చెందిన కాపు కార్పొరేషన్ అధ్యక్షుడి కుమారుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడి నుంచి, బయటకు తెలిసిన సమాచారం దగ్గరికి వద్దాం. సదావర్తి సత్రం భూములు చెన్నైలో ఉన్నాయని, వీటిని అమ్మితే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందనీ 2014 లోనే ఒక శాసన సభ్యుడు ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియపరిచారు. దేవాదాయశాఖ అధికారి ఒకరు స్వయంగా వెళ్లి ఆ భూముల విలువ తెలుసుకుని వచ్చాక అసలు కథ ప్రారంభం అయిన ట్టు స్పష్టంగా అర్థం అవుతుంది కథంతా వింటే. ఎంతో ఖరీదయిన సదావర్తి సత్రం భూములను రాష్ర్ట ప్రభుత్వం కారు చవకగా స్వపక్షం వారికే అప్పచెప్పుతోందన్న సమా చారంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో చెన్నై వెళ్లి వివరాలు సేకరించిన నిజ నిర్ధారణ బృందం వెల్లడించిన వాస్తవాలు ఎవరినయినా దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. చెన్నైలోని ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 16 కోట్ల రూపాయలకు ఎకరం ఉంటుందని స్థానికులను విచారించినప్పుడు తెలిసింది. పోనీ అంత లేదనుకుందాం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారి ఒకరు వెళ్లి నిర్ధారించిన విలువ చూసినా ఎకరానికి ఆరున్నర కోట్ల రూపాయలు పలుకుతోంది. ప్రభుత్వానికి నిధులకొరత ఉంది కాబట్టి ఆ భూములు అమ్మాల్సిందే అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే వేలం వేసేటప్పుడు ప్రభుత్వం కనీస ధర ఆ అధికారి సూచించినట్టు ఎకరానికి ఆరున్నర కోట్లు ఉండాలి. మరి ప్రభుత్వం ఎకరానికి 50 లక్షల రూపాయలు ఏ విధంగా నిర్ణయించి వేలానికి వెళ్ళింది. పోనీ ఆ 50 లక్షల రూపాయలకయినా కట్టుబ డిందా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ అధ్యక్షుని కుమారుడికి 27 లక్షలకు ఎకరం చొప్పున అమ్మేయడానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది? తాను నిర్ణయించిన రూ. 50 లక్షల ధర పలకక పోతే వేలం రద్దు చేసుకుని మళ్ళీ ఒకసారి అందరికీ తెలిసే విధంగా ప్రచారం కల్పించి రెండోసారి వేలానికి వెళ్ళిన సందర్భాలు ప్రభుత్వాల్లో ఎన్నో ఉంటాయి. ఏలినవారు ఆ పని ఎందుకు చెయ్యలేదు. ఎకరానికి 16 కోట్లు విలువ చేసే భూమికి ఆరున్నర కోట్లు ధర నిర్ణయించి వేలానికి వెళ్ళేసరికి 50 లక్షలకు కుదించి చివరికి 27 లక్షలతో సరిపుచ్చి బయానా తీసుకున్న ప్రభుత్వాన్ని.. ప్రారంభంలో ప్రస్తా వించిన పంచ పాండవుల కథ చెప్పిన పెద్ద మనిషితో పోలిస్తే తప్పేలా అవుతుంది? తమిళనాడు ప్రభుత్వం ఇతరులకు కేటాయించినట్టు చెబుతున్న 471 ఎక రాల భూమిని తిరిగి తీసుకో గలిగినా, దాని విలువ మొత్తం ఆ రాష్ర్ట ప్రభుత్వం నుంచి తీసుకోగలిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు ఏడున్నర వేల కోట్ల రూపాయలు వచ్చి ఉండేది. పొరుగునే ఉన్న చెన్నై వెళ్లి అక్కడి సీఎం జయలలితతో మాట్లాడి పని సాధించుకొచ్చే సమయం మా ముఖ్యమంత్రికి లేదు, ఆయనకు నిధుల వేటలో విదేశాలు తిరగడానికే సరిపోవడం లేదు అని తెలుగు దేశం పెద్దలు ఎవరయినా అనొచ్చు. సరే ఆ 471 ఎకరాలు ఇక మనవి కావు అనుకుంటే కనీసం మిగిలిన ఈ 83 ఎకరాలయినా సరయిన పద్ధతిలో అమ్మితే దాదాపు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అమరావతి రాజధాని నిర్మాణం అనే బృహత్తర కార్యం నెత్తి మీదేసుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రి సీడ్ కాపిటల్ నిర్మాణానికి సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టిన భూములకు బదులు ఆ విదేశీ కంపెనీలు ఇస్తున్నది 300 కోట్లు మాత్రమే. మూడు పంటలు, నాలుగు పంటలు పండే రైతుల భూములు తీసుకుని వాటిని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేకుండా, మిగిలి ఉన్న 83 ఎకరాల సదావర్తి సత్రం భూములను సక్రమ పద్ధతిలో అమ్మితే వచ్చే అయిదురెట్ల డబ్బును సీడ్ కాపిటల్ నిర్మాణానికి వెచ్చించి ఉంటే రైతుల భూములు మిగిలిపోయేవి, రేపు భవిష్యత్తులో లండన్ కోర్టుల చుట్టూ తిరిగే బాధలు తప్పేవి. ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు. ఇప్పటికే సదావర్తి భూములు వేలంలో కొనుక్కున్న కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు ఈ వ్యవహారంలో తెలియక ఇరుక్కున్నామని ప్రకటించేశారు. సదావర్తి సత్రం భూముల అమ్మకం ప్రక్రియను మొత్తం రద్దు చేసి ఆ భూములను సక్రమంగా విక్రయించి దాతలు నిర్దేశించిన లక్ష్యానికి వాటిని ఖర్చు చెయ్యాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ధర్మాదాయ భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకో వచ్చని ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘వలస’ పక్షులదే వర్తమానం
- డేట్లైన్ హైదరాబాద్ ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. ఒకప్పుడు తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో కామ్రేడ్లు పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టుల వల్ల అయ్యేదికాదు. అయితే నాటి చెన్నమనేని నుంచి నేటి రవీంద్రకుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నదే ప్రశ్న. తెలంగాణలో మరో జట్టు అధికారపక్షంలో చేరిపోవడానికి సిద్ధమైంది. నల్లగొండ జిల్లా నుంచి ఒక ఎంపీ; కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్నారు. అందరూ ఒకేసారి కాకుండా అప్పుడు కొందరు ఇప్పుడు కొందరు అధికార పార్టీలోకి వలసపోతే మీడియాకు కూడా వార్తలు ఉంటాయని కాబోలు కొంత కొంత విరామం ఇచ్చి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు పోయినా, ఎంపీలు పోయినా, మాజీలు పోయినా పలుకుతున్నది రెండు పలుకులే. మొదటిది, నియోజకవర్గాల అభివృద్ధి! రెండవది, తమని గెలిపించిన ప్రజలలో మెజారిటీ కోరుకుంటు న్నారు కాబట్టి! ఇట్లా గోడ దూకినవారు ఒక సంవత్సరం తరువాతో, రెండే ళ్లకో మేం అధికారపక్షానికి వలసరావడం వల్ల మా నియోజకవర్గాలకు ఇంత మొత్తం లాభం జరిగింది అనే లెక్కలు ఏమైనా చెబుతారా అంటే, అలాంటి దేమీ ఉండదు. పోనీ, ప్రజలు కోరుతున్నారని మీరే చెబుతున్నారు కదా, చట్టసభల సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ తరఫున ప్రజల మెప్పు పొంది రండి అంటే, అదీ చేతకాదు. తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక ప్రతిపక్ష సభ్యులను అధికారపక్షం తనవైపు లాక్కోవడం తెలంగాణ తోనే మొదలైనా, నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి పునాదే ఫిరాయింపు రాజకీయాలు. ఆ విషయం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహా, ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, నందమూరి హరికృష్ణకు, వలస పక్షులని వైస్రాయ్ గూట్లో వదిలిపెట్టిన కొందరు మీడియా పెద్దలకు బాగా తెలుసు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ విద్య అక్కడే నేర్చుకున్నారు. ఇది ఆయన కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. అయితే, ఇదేదో ప్రపంచంలోనే మొదటిసారి జరిగినట్టూ, తెలంగాణ రాష్ర్ట సమితే మొదటిసారిగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టూ చంద్రబాబునాయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆక్రోశిం చడం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌లో తన అపూర్వ సహోదరుడు చంద్రబాబు చేస్తున్న నిర్వాకం చూస్తూ పెదవి విప్పే సాహసం చెయ్యని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అక్కడెక్కడో ఉత్తరాఖండ్‌లో వలసపోయిన ఎమ్మెల్యే లను తలుచుకుని రాజకీయాలు భ్రష్టుపట్టాయని ఆవేదన చెందుతుంటారు. అందరిదీ గురవింద న్యాయమే ప్రజాస్వామ్య స్ఫూర్తిని బుగ్గిపాలు చేసే విధంగా సాగుతున్న ఈ అత్యంత నీతి మాలిన, ఏహ్యమైన కార్యక్రమం తెలంగాణ రాష్ర్ట సమితితోనే మొదలు కాలేదు, ఇక్కడితో ఆగిపోయేదీ కాదు. 1995 నుంచి మొదలు పెట్టి ఇప్పటి దాకా ఇటువంటి దుర్మార్గాలు అనేకం చేసి, తెలంగాణ లో తమ పార్టీ వారిని లాక్కుని టీఆర్ఎస్ నీతి తప్పిందని రంకెలు వేసి ఆరునెలలు తిరక్కుండానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎడా పెడా కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడు, వలస కార్యక్రమంలో తానే పాత్ర దారి కూడా అయిన జానారెడ్డి ఇప్పుడు సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు ఇంకో ఎల్లయ్య మల్లయ్య వలస పోతున్నారని వాపోవడం విచిత్రం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడా? కాదుకదా! తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పలు మంత్రిత్వశాఖలను నిర్వహించిన నాయకుడు. ఆ విషయం ఆయనే సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంత పెద్ద పీట వేస్తే, 1989లో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావులతో కలసి ఎందుకు తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన ట్టు? అప్పట్లో ఈ ముగ్గురూ తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం. దగ్గుబాటి వర్గానికి వ్యతిరేకులు. పార్టీ ఫిరాయింపుల సమయాలలో తేడాలు ఉండవచ్చు కానీ, అన్నీ ఆ తాను ముక్కలే. ఆ గూటి పక్షులే. 2015, ఏప్రిల్ 30న ఢిల్లీ విమానంలో పక్కన కూర్చున్న ఒక పెద్దమనిషి నన్ను గుర్తుపట్టి పలకరించారు. ఆయన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, మదర్ డైరీ అధ్యక్షులు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్వయానా సోదరుడు. ఢిల్లీ వరకు రెండుగంటల ప్రయాణంలో చాలా రాజకీయాలు మాట్లాడుకున్నాం. పాడి పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చాలా చెప్పారాయన. నిజానికి అటువంటి ఓ పని మీదే ఢిల్లీ బయలుదేరారు కూడా. తెలంగాణ కొత్త రాష్ర్టం, చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళుతున్న ప్రభుత్వం కదా, మీ సమస్యలు చెప్పుకోకపోయారా అంటే ఆయన చెప్పిన సమాధానం.. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఎన్నిమార్లు కలిసినా ఒకే పాట పాడుతున్నారు- ‘ముందు అందరూ మా పార్టీలో చేరండి, అప్పుడు చూద్దాం!’ అని. ‘చూస్తూ చూస్తూ టీఆర్ఎస్లో ఎలా చేరడం? మా అన్నగారు కాంగ్రెస్ నాయకులు, ఎంపీ కూడా. ఆయన ప్రతిష్ట దెబ్బతినదా?’ అన్నారాయన. నేను నవ్వి ఊరుకున్నానో, బయటికే అన్నానో గుర్తు లేదు కానీ, సుఖేందర్‌రెడ్డి ఏమన్నా అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడా? అని. అంతకుముందు ఆయన రాజకీయాలు ఏమైనా, రాజకీయాలలో ఎవరి శాశ్వత శిష్యుడైనా తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అయ్యాడన్న విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశాన్ని వీడి రాగలిగిన నాయకుడు కాంగ్రెస్‌ను వీడి ప్రస్తుత అధికారపక్షంలోకి వెళ్ళడనీ, అక్కడ లేని విలువలు ఇక్కడికొచ్చాక హఠాత్తుగా పుట్టుకొస్తాయనీ కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అనుకుంటున్నారో? ఆ ఢిల్లీ విమానంలో కలిసిన పెద్దాయన నేను అటు నుంచి పాకిస్తాన్ వెళ్లి, వారం పదిరోజులలో తిరిగి వచ్చేసరికే అధికార పక్షం తీర్థం పుచ్చేసుకున్నారు. అది ఆయన వ్యాపార అవసరం కావచ్చు. సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఆయన సోదరుడు సుఖేందర్‌రెడ్డి కూడా తమ్ముడి బాట పట్టారు. సిద్ధాంతమూ లేదు, విశ్వాసమూ లేదు తాజాగా సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ బలం నల్లగొండ జిల్లాలో నాలుగుకు పడిపోయింది. అందులో కోదాడ శాసన సభ్యురాలు మినహా మిగిలిన ముగ్గురూ కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు. ముగ్గురిలో ఒకరు సాక్షాత్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఇంకొకరు శాసనసభా పక్ష నాయకులు, మూడో ఆయన శాసనసభా పక్ష ఉప నాయకుడు. కాంగ్రెస్ నుంచి అధికారపక్షానికి వలస పోయిన ఎంపీ సుఖేం దర్‌రెడ్డి సహా వీరంతా రాజకీయాలలో బలమైన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా రాజకీయాలను అత్యంత ప్రభా వితం చేసిన సామాజిక వర్గం. దక్షిణ తెలంగాణలో అధికారపక్షం రాజ కీయంగా బలహీనంగా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ జట్టును చేర్చుకోవడం ద్వారా చంద్రశేఖరరావు పటాపంచలు చేశారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు రుజువైంది. బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి- ఇట్లా అనేక మందిని ఉదాహరించవచ్చు. మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీమంత్రి వినోద్ సోదరులూ అదే కోవకు చెందుతారు. ఒకసారి కేశవరావుతో కలసి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి దూకి, తిరిగొచ్చినా తమకు టికెట్లు ఇచ్చారన్న విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల, సోనియాగాంధీ పట్ల వీరికి ఎందుకు ఉండాలి, అవతల బంగారు భవిష్యత్తు కళ్ల ముందు ఉంటె! విభజన పుణ్యమా అని అవతల ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్సే లేకుండా పోయిన కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చి కూడా ఇక్కడ డీలా పడిపోవడానికీ, వలసలు ఆపలేకపోడానికీ ఎవరు బాధ్యత వహించాలి? అది కాంగ్రెస్‌లో సోషల్ఇంజనీరింగ్ పేరిట గందరగోళం చేస్తున్న కాంగ్రెస్ మేధావులు చెప్పాలి. లేదా వాస్తవ పరిస్థితులు తెలియకుండా పెత్తనాలు చేసే పరిశీల కులు చెప్పాలి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రస్తుతానికి తెలంగాణ మీద ఆశలు వదిలేసినట్టే! కమ్యూనిస్టుల మూలాలు కదులుతున్నాయి ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. కమ్యూనిస్టులు దానికి మినహాయింపు. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. ఒకప్పుడు తెలంగాణలో, ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో మంచి పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టు పార్టీల వల్ల అయ్యే పనికాదు. అయితే నాటి చెన్నమనేని రాజేశ్వరరావు నుంచి నేటి రవీంద్ర కుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నది సమీక్షించు కోవాలి. నల్లగొండ జిల్లా దేవరకొండ గిరిజన నియోజకవర్గం నుంచి కమ్యూ నిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచినా, అధికారపక్షానికి వలస పోవడానికి రవీంద్ర కుమార్ కూడా నియోజకవర్గ అభివృద్ధినే సాకుగా చూపుతున్నారు. చెన్నమ నేని రాజేశ్వరరావు వంటి యోధానుయోధుడైనకమ్యూనిస్టు నాయకుడిని పుత్ర ప్రేమ అధికారపక్షం వైపు లాగగా లేనిది, పుట్టుక నుంచి కమ్యూనిస్ట్ ఉద్య మంలో భాగం అయిన అజయ్‌కుమార్ కాంగ్రెస్‌కు అక్కడి నుంచి అధికార పక్షం టీఆర్ఎస్కు వలస పోతే ఆయన తండ్రి, మరో కమ్యూనిస్ట్ దిగ్గజం పువ్వాడ నాగేశ్వరరావు పుత్రపేమ దానిని అనుమతించగా లేనిది.. గిరిజన యువకుడు రవీంద్రకుమార్ నాయక్ వలసపోతే నిందించి ఏం లాభం? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వసతులు వారికి-వెతలు వీరికి!
- డేట్లైన్ హైదరాబాద్ ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందులోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని, అద్దెలు తగ్గించి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్యమంత్రి. రాష్ర్టం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబునాయుడును అభినందించడానికి సచివాలయ ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ర్టం విడిపోయింది కాబట్టి వీలైనంత తొందరగా మన కొత్త రాజధాని ప్రాంతానికి వెళ్లి, కష్ట నష్టాలకు ఓర్చి అయినా పనిచెయ్యడానికి సిద్ధపడదామంటూ ఆ సంద ర్భంలో ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ‘చెట్ల కింద పనిచేయడాని కైనా మేం సిద్ధం’ అని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. అప్పుడు ముఖ్య మంత్రి, ‘తమ్ముళ్లూ! ఆవేశపడొద్దు. మనకు తొందరలేదు. హైదరాబాద్ నుంచి పాలనా వ్యవహారాలు కొనసాగించడానికి విభజన చట్టం పదేళ్ల వెసులుబాటు కల్పించింది. కాబట్టి అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని, సావ కాశంగా వెళదాం!’ అని ప్రకటించారు. నిజమే, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టం చెబుతున్నది. అది ఈ రోజుకు కూడా వర్తిస్తుంది. కానీ, రెండేళ్లు గడవగానే ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటన తారుమారై హైదరాబాద్ నుంచి శాశ్వతంగా బిచాణా ఎత్తేయా ల్సిందేనని ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వెళ్లక తప్పదు అయినా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కొత్త రాష్ర్టం ఏర్పడింది. కాబట్టి ఏనాటికైనా ఉద్యోగులూ, అధికారులూ, మంత్రివర్గం అందరు కొత్తగా ఏర్పడే రాజధానికి తరలిపోవాల్సిందే. మరి, చెట్లకిందయినా పనిచెయ్యడానికి సిద్ధ పడ్డ ఉద్యోగులు, ఇప్పుడే వెళ్లడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? తొందరేం లేదన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రెండేళ్లు గడవక ముందే తాత్కాలిక రాజధానికి రావాల్సిందేనని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ముఖ్యమంత్రి తన అభినందన సభలో చేసిన వ్యాఖ్యల మేరకు అప్పుడు ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజల ముంగిట్లో పరిపాలన ఉండడం న్యాయమే. ఉద్యోగులూ, అధికారులూ రాష్ట్రానికి దూరంగా ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుంటే తమ అవసరాల కోసం ప్రజలు సచివాలయాన్ని వెతుక్కుంటూ ఏ శ్రీకాకుళం నుంచో, అనంతపురం నుంచో, నెల్లూరు నుంచో రావాల్సిన అగత్యం ఉండకూడదు. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నడి మధ్యనే ఉండాలి, అక్కడి నుంచే పరిపాలన సాగాలి. అయితే దానికి అవసరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ 27 నాటికి ఉద్యోగులంతా తరలి రావాల్సిందేనని చెబుతూ, ‘ఇంకా ఏం సౌకర్యాలు కావాలి? టాయిలెట్స్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. పని చేసుకోడానికి ఇంకా ఏం కావాలి?’ అని విసుక్కున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడి పోయి, సర్వీస్‌లో ఆదా చేసుకున్న డబ్బుతో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుని, పిల్లల్ని చదివించుకుంటూ కుదురుగా కాలం వెళ్లబుచ్చుతున్న ఉద్యోగులను ఉన్నఫళంగా టాయిలెట్లూ, క్యాంటీన్లూ చూపించి తరలి రమ్మంటే ప్రభుత్వం ఎంత యాంత్రికంగా ఆలోచిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మాన సికంగా ఒక బంధం ఏర్పడి ఉంటుంది, అది తెంచుకుని వెళ్లాలి. తప్పదు, కాబట్టి సిద్ధపడతారు. కానీ అటువంటి వారిని ఒకరినో ఇద్దరినో కాదు, వందలూ వేల సంఖ్యలో తరలిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతగా మానవీయ కోణం నుంచి సమస్యను చూడాలి? సచివాలయ ఉద్యోగులూ, వివిధ శాఖల ఉద్యోగులూ నూతన రాజధానికి వెళ్లబోమని ఎప్పుడూ అనలేదు. ఒకటికి పదిసార్లు ముఖ్యమంత్రికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ తాము వెంటనే తరలి వెళ్లమంటే ఎదురయ్యే ఇబ్బందులను గురించి విన్నవించుకున్నారు. అయినా ఎట్టి పరిస్థితులలో జూన్ 27కు వెళ్లాల్సిందే అన్నది ఈ పూటకు కచ్చితంగా చెబుతున్న మాట. రాజధాని ఇక్కట్లు నాడూ-నేడూ ‘‘ఉమ్మడి మద్రాస్ రాష్ర్టం నుంచి విడిపోయి కర్నూలును రాజధానిని చేసుకున్ననాడూ, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్‌కు తరలించిననాడూ ఉద్యోగులు, అధికార యంత్రాంగం ఆ నగరాలకు తరలి వెళ్లడానికి పెద్దగా బాధపడలేదు. కర్నూలులో ఏ సౌకర్యాలూ లేకపోయినా గుడారాలలో కూడా పనిచేశారు. హైదరాబాద్‌కు తరలివచ్చినప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ విలీనాన్ని ఇష్టపడని ఆనాటి హైదరాబాదీలు నిర సించినా, ఛీత్కరించినా బాధ పడలేదు, పనిచేశాం!’’ అని కర్నూలు నుంచి జీప్‌లో టైప్రైటర్లు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించిన తొలి బృందంలోని ఒక రిటైర్డ్ అధికారి అఖ్తర్ హుస్సేన్ చెబుతూ ఉంటారు. ఉద్యోగులు కొత్త రాజధానికి తరలి వెళ్లాల్సి రావడం ఇది మూడోసారి. కానీ ఇవాళ్టి పరిస్థితి మొదటి రెండుసార్లు ఎదురైనటు వంటిది కాదు. దీర్ఘకాల పోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం వారు బలవంతంగానే అయినా విడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉద్యో గులు రాష్ర్ట విభజనను వ్యతిరేకించారు. అటువంటి ఉద్యోగులను తరలి స్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిం చాలి తప్ప, ‘వస్తారా చస్తారా’ అన్న పద్ధతిలో వ్యవహరించడం అన్యాయం. ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్ర బాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందు లోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని ఉద్యోగులకు ఉద్బోధిస్తారు ముఖ్యమంత్రి. అద్దెలు తగ్గించి ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్య మంత్రి. తమ సామాజికవర్గం వారో, బంధువులో, మిత్రుల విష యానికో వచ్చేసరికి మాత్రం రాజధాని చుట్టూ భూముల బాగోతం గురించి ప్రశ్నిస్తే మా వాళ్లు వ్యాపారాలు చేసుకోవద్దా అని ఆగ్రహం ప్రదర్శిస్తారు. మరి విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఇంటి యజమానులు మాత్రం డబ్బు సంపాదించుకోవద్దా? ఉద్యోగులు కొత్త చోటికి వెళుతున్నప్పుడు అద నపు ఆదాయాన్ని ఆశించడం తప్పా? ఖరీదైన బస్సులో బస చేసి, ప్రత్యేక విమానాలలో ప్రయాణించి, తాత్కాలిక కార్యాలయాలకు వందల కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో నీతులు వల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు ఎందుకు? పదేళ్లపాటు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించే వీలు ఉండి కూడా హడావుడిగా విజయవాడకు 20 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగపూడి గ్రామంలో నిర్మిస్తున్న రెండు అంతస్తుల తాత్కాలిక భవంతికి వచ్చి పనిచేయవలసిందేనని ఉద్యోగులను ఎందుకు శాసిస్తున్నారు? ఓటుకు కోట్లు వ్యవహారంలో శృంగభంగమయ్యాక ముఖ్య మంత్రిలో ఈ మార్పు వచ్చిందనేది బహిరంగ రహస్యం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కూడా హైదరాబాద్ ఉమ్మడి శాసనసభా ప్రాంగణంలో కాకుండా విజయవాడకు మార్చాలని ఎన్నికల సంఘానికి విన్నవించుకుని కాదనిపించుకోవడం కూడా అధికార పక్షం దురుద్దేశానికి నిదర్శనమనే విమర్శ వచ్చింది. రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే ఒక వెయ్యీ 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రాష్ర్ట ప్రభుత్వం ఆ డబ్బు వెలగపూడిలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి ఖర్చు చేసింది. మరి శాశ్వత రాజధానికి మళ్లీ నిధులు ఎట్లా? పైగా కొండవీటి వాగు పొంగితే ఈ తాత్కాలిక సచివాలయ సముదాయం రెండు అంతస్తుల భవంతి మునిగిపోతుందని వెలగపూడి గ్రామం చుట్టుపక్కల గోచీ పెట్టుకుని గోళీలు ఆడుకుంటున్న చిన్నపిల్లలు కూడా చెబుతున్నారు. ఏదో విధంగా ఉద్యో గులను తరలించాల్సిందే అన్న పట్టుదల తప్ప ప్రభుత్వానికి ఇవేం పట్టవా? హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచి వాలయ భాగాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించవలసిందిగా అధికారు లను ఆదేశించినట్టు కూడా తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ఒక కొలిక్కి రాలేదు. అక్కడికి వెళ్లి పనిచెయ్యడానికి ఇంకా ఉద్యోగులు మానసికంగా సిద్ధం కాలేదు. పరిష్కరించాల్సిన సమస్యలు బోలెడు ఉన్నాయి. నేను త్యాగాలు చేస్తున్నాను అని తన మీద తానే జాలి పడటం(సెల్ఫ్పిటీ) మానేసి, ముఖ్యమంత్రి వ్యవహర్త లాగా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రానికి మంచి జరుగుతుంది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ప్రతిపక్షం మీద ఎందుకీ పగ?
డేట్లైన్ హైదరాబాద్ రైల్వే బడ్జెట్ వచ్చింది. సాధారణ బడ్జెట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటి మాదిరి గానే నాలుగు మెతుకులు విదిల్చి ఊరుకుంది కేంద్రం. రైల్వే బడ్జెట్లో విశాఖకు ప్రత్యేక జోన్ లేదు. సాధారణ బడ్జెట్లో పోలవరానికి ఎప్పటిలాగే వంద కోట్లు విదిల్చి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా కానిచ్చేశారు. రాజధాని ప్రస్తావన అంతకన్నా లేదు, బహుశా పార్లమెంట్ మట్టి, యమున నీళ్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు కళ్లలో మోదీకి కనిపించిన ఆనందం, సంతృప్తి కారణంగా ఇంకేమీ ఇవ్వనక్కరలేదు అనుకుని ఉంటుంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకీ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఎన్డీఏ కూటమి అసలు పట్టించుకుంటున్నదా? పార్టీ ఏదైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మామూలుగా ఉండే సంబంధాలు కూడా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య లేవా? ఎన్నికల సమయంలో తప్ప, మిగిలిన కాలంలో రాజకీయాలు మాట్లాడను అంటూ గతంలో తాను చెప్పిన మాటను కూడా చంద్రబాబునాయుడు మరచి పోయారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సాగుతున్న ధోరణులను చూస్తుంటే ఇటువంటివే ఇంకా ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. బాబు బాధ్యతా రాహిత్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు కావలసిన నిధులు వంటి అంశాల మీద వినతిపత్రాలు సమర్పిం చారు. నిజానికి ఆ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. కానీ మధ్య మధ్య విపక్ష నాయకుడు కేంద్రానికి గుర్తు చేయవలసి వస్తున్నది తప్ప, రాష్ట్ర ప్రభుత్వాధి నేతకు ఈ అంశాలేవీ పెద్దగా పట్టినట్టు కనిపించదు. రాష్ట్ర ప్రయోజనాలను సత్వరం నెరవేర్చేటట్టు చేయడానికి విపక్ష నేత ఢిల్లీలో ఉంటే, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులను తమ పార్టీలోకి లాక్కుని, కండువాలు కప్పే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలమునకలయ్యారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, తన మీద ఉన్న కేసులను గురించి మాట్లాడుకోవడానికే వెళ్లారని చంద్రబాబుకు సంబంధించిన ఒక వర్గం మీడియా అవాకులూ చెవాకులూ రాయడం, కూయడం మామూలే. ఈసారి ఆ వర్గం మీడియా నోరు మూత పడింది. వాళ్ల నోళ్లు మూయించినది మరెవరో కాదు, సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఆయన పార్టీ ప్రతినిధి బృందం తనను కలసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏయే సమస్యల మీద విజ్ఞాపనపత్రాలు సమర్పించారో ప్రణబ్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ఇలా ట్వీట్ చేయడం బహుశా ఇదే మొదటిసారి. దాంతో సత్యం కళ్లెదుట కనిపిస్తుంటే విపక్షనేత మీద బురద ఎలా చల్లాలో అర్థం కాక ఇప్పుడు జుట్టు పీక్కోవడం ఆ వర్గం మీడియా వంతయింది. ఓ పక్క ప్రతిపక్షం లేకుండా చేస్తాం రాష్ట్రంలో అని డంబాలు పలుకుతూనే మరో పక్క రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో పడితే నాయకుడు మాత్రం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని అదే మీడియా చేత రాయించే పనిలో పడ్డారు ఏలినవారు. రాజధాని, రైల్వేజోన్లకు మొండిచేయి ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయానికి వస్తే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి రెండురోజుల ముందు విజయవాడలో ముఖ్యమంత్రి తన పార్టీ ఎంపీలతో సమావేశమై, కేంద్రాన్ని బతిమాలుదాం, ఒత్తిడి తేవొద్దు. బడ్జెట్లో మనకు ఏమొస్తుందో చూసి ఆ తరువాత నేనే వెళ్లి అందరినీ కలసి, రావలసినవన్నీ సాధించుకు వస్తానని హితవు చెప్పి పంపేశారు. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. రైల్వే బడ్జెట్ వచ్చింది. సాధారణ బడ్జెట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటి మాదిరిగానే నాలుగు మెతుకులు విదిల్చి ఊరుకుంది కేంద్రం. రైల్వే బడ్జెట్లో విశాఖకు ప్రత్యేక జోన్ లేదు. సాధారణ బడ్జెట్లో పోలవరానికి ఎప్పటిలాగే వంద కోట్లు విదిల్చి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా కానిచ్చేశారు. రాజధాని ప్రస్తావన అంతకన్నా లేదు, బహుశా పార్లమెంట్ మట్టి, యమున నీళ్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు కళ్లలో మోదీకి కనిపించిన ఆనందం, సంతృప్తి కారణంగా ఇంకేమీ ఇవ్వనక్కరలేదు అనుకుని ఉంటుంది కేంద్రం. ఎందుకిట్లా జరుగుతున్నది అని ఏ బీజేపీ నాయకుడిని అడిగినా, అబ్బే అదేం లేదు! ఆంధ్రప్రదేశ్‌కు మేం పూర్తి న్యాయం చేస్తాం. చంద్రబాబు నాయుడు కేంద్రంలో మా చిన్న తమ్ముడు, ఇక్కడ రాష్ట్రంలో మా పెద్దన్న! అని కబుర్లు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర విభజన ఖాయం అని తేలిపోయిననాడు విపక్ష నాయకుడిగా ఉండిన చంద్రబాబు హడావుడిగా పత్రికా గోష్టి నిర్వహించి ఐదారు లక్షల కోట్లు ఇస్తే హైదరాబాద్ కంటే మంచి రాజధాని కట్టుకుంటాం అని ప్రకటించారు. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఐదారు లక్షల కోట్లు ఇమ్మని అడిగేందుకు ఆయన నోరెందుకు పెగలడం లేదో అర్థం కాదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా నిధులివ్వండి, లేదా మీరే బాధ్యత తీసుకుని 2018 నాటికి పూర్తి చేసివ్వండి అని అడగడానికి నోరెందుకు రావడంలేదో కూడా అర్థం కాదు. విభజన సమయంలో అందరూ అంగీకరించిన ప్రత్యేక హోదా సంగతి సరే సరి, కేంద్రం కంటే ముందు చంద్రబాబే ఆ ప్రస్తావన రావడాన్ని సహించడంలేదు. తన అపూర్వ సహోదరుడూ, కేంద్ర మంత్రి అయిన వెంకయ్య నాయుడు నుండి వ్యక్తిగత కితాబులు పొందడం తప్ప ఆయన ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించిందేమీ కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్లో మాకు న్యాయం జరగలేదంటారు. ఎన్డీఏలో మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి బడ్జెట్ బ్రహ్మాండం అంటూ పొగడ్తలు గుప్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటేనే అసలు కేంద్రంతో, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు ఎట్లా ఉన్నాయనే ప్రశ్న తలెత్తుతున్నది. ఆదరణ కరువైన ఆంధ్ర ఒకప్పుడు హైదరాబాద్‌లో కూర్చుని మీట నొక్కితే ఢిల్లీలో చక్రం గిర్రున తిరుగుతుందని చెప్పుకున్న చంద్రబాబు ఎందుకు ఇప్పుడు దస్త్రాలన్నీ తానే స్వయంగా మోసుకుంటూ తిరుపతి వెంకన్న లడ్డూలు కూడా పంచిపెడుతూ ఇంటింటికి తిరిగినా పైసా విదల్చడానికి కేంద్రం ముందుకు రావడంలేదు? బీజేపీ వారికి కేంద్రంలో చిన్న తమ్ముడు, రాష్ట్రంలో పెద్ద అన్నయ్య అయిన చంద్రబాబు కంటే కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఎందుకు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి? రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మాటల్లో చెప్పాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నడూ దస్త్రాలు మోసుకుని ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యదు. తన రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం అయినా అధికారుల ద్వారానే చక్కబెడతారామె. మహా అయితే ఏఐఏడీఎం కేకు చెందిన పార్లమెంట్ సభ్యులు చూసుకుంటారు ఢిల్లీ వ్యవహారాలు. వాళ్ల పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇట్లా ఏ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాధినేత అయినా ఢిల్లీ వెళితే కేంద్రం దగ్గర గౌరవం పొంది మరీ పనులు చక్కబెట్టుకుంటారు. పుల్లారావు గారే అన్నట్టు చంద్రబాబునాయుడు మోదీ ప్రభుత్వానికి నమ్మదగ్గ మిత్రు డిగా కనిపించడం లేదన్నమాట సోమవారం నాటి బడ్జెట్ కేటాయింపులతో స్పష్టమయింది. ఆర్థికంగా అతలాకుతలమై ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తల్లడిల్లుతుంటే పరిపాలనలో పద్దెనిమిది నెలలు అంతా చక్కబెట్టేశాను, ఇక రాజకీయాల మీద దృష్టి పెడుతున్నాను అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రలోభాల వలలు విసురుతున్నారు ముఖ్యమంత్రి. భారీగా డబ్బు ఇవ్వజూపడంతో పాటు, కొత్త నియోజకవర్గాల ఆశ కూడా చూపుతున్నారు. కేసులు ఉన్నవాళ్లు వాటి మాఫీ అడుగుతున్నారు. కేసులు లేకుంటే, మాట వినకుంటే కొత్తగా కేసులలో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. వచ్చే సోమవారం ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుండా రచ్చనే కోరుకుంటున్నది అధికార పక్షం. ఇది అందరికీ అర్థమైంది. సరే, సభలో ఏం చేయాలో ఓ ఆరుగురిని లాగేసినా బలంగానే ఉన్న ప్రతిపక్షం చూసుకుంటుంది. మరి ప్రజాస్వామ్యానికి చంద్రబాబు, లోకేశ్‌బాబుల రూపంలో వచ్చి పడుతున్న ప్రమాదాన్ని ఎవరు ఎదుర్కొనాలి? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని సెలవిచ్చారు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం మీడియా వారితో ముచ్చటించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌బాబు. ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇప్పుడు సన్నద్ధమై రాష్ర్టంలో ప్రతిపక్షాన్ని కాపాడుకోవాలి. అదే జరుగుతుంది. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్న సామెత లోకేశ్‌బాబుకు ఎవరైనా గుర్తు చేస్తే బాగుంటుంది. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
విద్యుత్ సౌధలో ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు నిలువెత్తు ప్రతిరూపం విద్యుత్ సౌధ.. ఉద్యమ రోజుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా విద్యుత్ సౌధ నుంచి తక్షణమే ప్రతిస్పందన వినిపించేది. సమైక్య రాష్ట్ర పాలకులు సైతం విద్యుత్ ఉద్యోగులను నియంత్రించే సాహసం చేయలేకపోయారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి రెండేళ్లయినా కాకముందే విద్యుత్ సౌధలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మీడియాతో ఉద్యోగులెవరూ మాట్లాడొద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సర్క్యులర్ జారీ చేశారు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ‘దుష్ర్పవర్తన’ కింద పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి చట్టంలోని 43వ నిబంధనను అడాప్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జారీ చేసినట్లు పేర్కొంటున్న ఈ సర్క్యులర్‌ను గురువారం ట్రాన్స్‌కో అధికారిక వెబ్సైట్లో ఉంచడంతో వెలుగు చూసింది. అనధికారికంగా పత్రికలకు ఏదైనా ప్రకటన చేసినా, పత్రికలు, మేగజైన్లలో ఏదైనా వార్త కథనానికి సహకరించినా, ముందస్తు అనుమతి లేకుండా రేడియోలో మాట్లాడినా, మీడియా లేక కరపత్రాల ద్వారా విన్నపాలు వినిపించినా... సదరు ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. ఇక విద్యుత్ సౌధలో ఇటీవల అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచుతున్నారు. దీంతో విలేకరులను కలిసేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. ఈఆర్సీకి వెళ్లొద్దు.. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)లో వ్యాజ్యాలు వేయవద్దని విద్యుత్ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, చార్జీల పెంపు వంటి వాటికి ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించే ముందు ఈఆర్సీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తుంది. సాంకేతికంగా క్లిష్టంగా ఉండే విద్యుత్ చట్టాలు, అంశాలపై పట్టున్న విద్యుత్ రంగ నిపుణులు మాత్రమే వీటిపై స్పందించగలుగుతారు. విద్యుత్ రంగ నిపుణులు కె.రఘు, తిమ్మారెడ్డి వంటి కొందరు మాత్రమే ప్రజల తరఫున ఈఆర్సీకి వెళుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలతో కె.రఘు వేసిన వ్యాజ్యం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు ఎవరూ ఈఆర్సీకి వెళ్లవద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అలాంటి హక్కు ఎవరికీ లేదు ‘పత్రికలకు సమాచారం ఇవ్వవద్దని సర్క్యులర్ జారీ చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. అలాంటి హక్కు ఎవరికీ లేదు. దీనిని ఖండిస్తున్నాం..’ - దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్