సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పని చేద్దామని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీసే ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు.
2014 జూన్2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ఎలా పని చేసిందీ, కృష్ణా జలాల్లో హక్కుల రక్షణకు ఎంతగా శ్రమించిందీ సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజేద్దామని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. ఈ అంశంపై రెండు, మూడురోజుల్లోనే ముఖ్య నేతలతో సమావేశమవుదామని తెలిపారు. శనివారం కేసీఆర్ నందినగర్‌నివాసంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి మాజీ చీఫ్‌విప్‌వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య ఆయనతో సమావేశమయ్యారు.
ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు
విశ్వసనీయం సమాచారం మేరకు.. బీఆర్‌ఎస్‌అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి ఒప్పుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బలవంతంగా గెజిట్‌అమలు చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణాలో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని తెలిపారు. రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నీటి పంపకాల విషయం అపెక్స్‌కౌన్సిల్‌తేల్చాలని కేఆర్‌ఎంబీ 17వ సమావేశంలో నిర్ణయించినా, ఆ తర్వాత అపెక్స్‌కౌన్సిల్‌సమావేశమే జరగలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌సర్కార్.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ప్రాజెక్టుల్లోని పది ఔట్‌లెట్లను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని, అదే జరిగితే రాష్ట్ర హక్కులను కోల్పోతామని చెప్పారు.
జల విద్యుత్‌ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఏటా శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో మొదలవగానే టీఎస్‌జెన్ కో విద్యుదుత్పత్తిమొదలు పెట్టేదని, తద్వారా రాష్ట్రంలోని ఎత్తిపోతలప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతో కరెంట్‌ఉత్పత్తి చేసుకునే వారమని గుర్తుచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఏపీ.. కృష్ణా బోర్డు మొదలు పార్లమెంట్‌వరకు అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిందని, సుప్రీం కోర్టులోనూ కేసు దాఖలు చేసిందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కేసీఆర్‌ను కలిసిన ప్రముఖులు
కేసీఆర్‌ను శనివారం సినీ నిర్మాత దిల్‌రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. తన తమ్ముడు శిరీ‹Ùరెడ్డి కుమారుడు ఆశి‹Ùరెడ్డి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా సీనియర్‌జర్నలిస్ట్‌దేవులపల్లి అమర్ ఏపీ రాజకీయాలపై తాను రాసిన ‘ది డెక్కన్‌పవర్‌ప్లే’పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేశారు. మరో సీనియర్‌జర్నలిస్ట్‌వనం జ్వాలా నర్సింహారావు.. ‘ఆంధ్రా వాలీ్మకి రామాయణంలో చంద్ర ప్రయోగం’పుస్తకాన్ని బహూకరించారు.
ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం: కేసీఆర్
Published Sun, Feb 4 2024 5:16 AM | Last Updated on Sun, Feb 4 2024 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment