![Kesineni Nani Sensational Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/23/Kesineni-Nani.jpg.webp?itok=BF8_x_DH)
సాక్షి, విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకే అలవాటని.. ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఆయనేనంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. శనివారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, గతంలో తన ఫోన్‌ను మోదీ ట్యాపింగ్ చేయించారని చంద్రబాబు ఆరోపించాడు.. ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించండి. నా ఫోన్‌ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్న నాకేం భయం లేదు. సీఎం జగన్‌కి, నాకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాప్ చేయడానికి కానిస్టేబుల్‌ని పంపిస్తారా.?. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు’’ అని కేశినేని పేర్కొన్నారు.
‘‘విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. ఆయన భూ కబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే. లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది. దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. 100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పారు’’ అని ఎంపీ కేశినేని నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment