సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం వైపు పలు పార్టీ నేతలు ఆకర్షితులవుతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలకు షాక్ తగిలేలా.. వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి కేడర్ మొదలు.. మాజీ మంత్రులు, కీలక నేతల దాకా అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా..
ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నేతలు సైతం వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్ రెడ్డి.
కిషోర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ… pic.twitter.com/fktBuN4W2R
— YSR Congress Party (@YSRCParty) March 4, 2024
‘‘భూమా అఖిల ప్రియ ఓ క్రిమినల్. ఆమె.. ఆమె భర్త కలిసి కిడ్నాప్‌లు, దొంగ తనాలు, కబ్జాలు చేస్తున్నారు. అలాంటి అరాచక వాదులు గెలవకూడదు అని వై ఎస్సార్ కాంగ్రెస్ లో చేరాను. ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. గంగుల నానిని గెలిపించడం కోసం భూమా కుటుంబం పనిచేస్తుంది. భూమా కుటుంబ మొత్తం అఖిల ప్రియకి వ్యతిరేకంగా పనిచేస్తాం. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరాను. ఏపీలో బీజేపీ నాయకులు టీడీపీ ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూస్తున్నారేగానీ.. నేతల, కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవడం లేదు’’ భూమా కిషోర్ అన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి ఏపీసీపీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్
ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ సీఎం జగన్ సమంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment