పదేళ్ల యూపీఏ, తొమ్మిదిన్నరేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలి
ఫేక్ వీడియోకు బాధ్యత సీఎందే.. ఆయనే మొదటి ముద్దాయి
మార్ఫింగ్ వీడియోలో ఎవరి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్ని దాడులు చేసినా, తప్పుడు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, మాకు కవచం తెలంగాణ ప్రజలే. నరేంద్రమోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణగడ్డపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను పాతరేయడం ఖాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవా రం పార్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవ ర్గానికి చెందిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్ కల్పన, డివిజన్ అధ్యక్షులు, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డారు.
‘బీజేపీ, బీఆర్‌ఎస్ వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరం లేదని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మోదీ మాత్రమే సమగ్రమైన, సుస్థిర మైన, సమర్థవంతమైన పాలన ఇవ్వగలరనే ఉద్దేశంతో తెలంగాణవ్యాప్తంగా ప్రజలంతా ఆదరిస్తున్నారు. దీంతో, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోయి బీజేపీపై ముప్పేట దాడికి ప్రయత్నిస్తున్నాయి. ఓటుకు నోట్లు కేసులో బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినట్టుగానే.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవి నీతి కేసుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేస్తోంది.
బీజేపీని గెలవనీయొద్దనే దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ డూ ప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్‌ఎస్–కాంగ్రెస్ రాజకీయ డ్రామా కార్య క్రమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. వారంరోజులుగా సీఎం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. పూర్తిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల వేళ తలపై గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నడు.
ఆ గుడ్లు తలపై పెట్టుకొని 5 నెలల పాలనలో తాను ప్రజలకిచ్చే ది ఇదేనంటూ ప్రజలకు వివ రిస్తున్నడు. ఆస్థాయికి దిగజా రిండు. ఎన్నికలకు వెళ్లేటప్పు డు ఏ పార్టీ అయినా ప్రజలకు చేసిన పనులు చేయాల్సిన పనులను వివరిస్తుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొది లేసింది. మళ్లీ ఆగస్టు 15న రుణమాఫీ అంటూ ఊదరగొడుతున్నా రు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడటం లేదు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్‌ది దిగజారుడుతనం
‘రాష్ట్రంలో మోదీ, బీజేపీకి ఆదరణ, మద్దతు పెరుగుతోంది. దీనిని తట్టుకోలేక మార్ఫింగ్ వీడియోలతో బీజేపీపై బురదజల్లుతూ కాంగ్రెస్ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. టెలిఫోన్ ట్యాపింగ్‌తోపాటు హోంమంత్రి వీడియో మార్ఫింగ్ అంశాలు రెండు నేరమే. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధా లు చెబుతుంటే, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఈ విషయంలో మొదటి ముద్దాయి సీఎం. మార్ఫింగ్ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. అందులో ఏ వ్యక్తి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు.
రేవంత్‌రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మి దిన్నరేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు ఎన్ని నిధులిచ్చా రనే దానిపై చర్చకు సిద్ధం కావాలి. ప్రెస్‌క్లబ్‌లో లేదా తెలంగాణ అమరవీరుల స్థూపంలేదా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం..ఏ చోటనైనా రేవంత్‌రెడ్డితో చర్చకు నేను సిద్ధం. గాడిద గుడ్లు నెత్తిన పెట్టుకోవడం కాదు.. తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు రావాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి.. ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా..?
‘పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఈరోజు తన కాళ్లకింద భూమి కదిలిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోజుకో విధంగా మాట్లాడుతున్నాడు. గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి పోటీ అని రేవంత్‌రెడ్డి అంటున్నడు. రేవంత్‌రెడ్డి అసలు ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా? టీడీపీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. మీ ఇటలీ పౌరుషానికి, అవినీతి పౌరుషానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు.
గుజరాత్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏనే ఇటలీది. ఐఎన్‌సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఒకరికొకరం తోడు అంటూ కేసీఆర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతున్నారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నరు’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment