సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా బీజేపీ ని ఎదుర్కో లేక, ప్రజ ల దృష్టి మరల్చేందు కు కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నేతలు పిరికిపందల మాదిరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏం అమలు చేశారో, మిగతావి ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. బీజేపీపై కాంగ్రెస్ ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు.
శుక్రవారం ఎల్‌బీ స్టేడి యంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశం కోసం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ల సర్టిఫికెట్లు తమకు అవ సరం లేదన్నారు. తమకు కావాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమేనని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో బీజే పీని విమర్శిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధు లు ఖర్చు చేస్తే.. ముఖ్యమంత్రి దాన్ని గాడిద గుడ్డుతో పోలుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ కుటుంబపాల నతో రాష్ట్రానికి, ప్రజలకు తీరనినష్టం జరిగితే బీజేపీ, మోదీ మాత్రమే ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగా ణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment