Kodali Nani Slams TDP Chandrababu Naidu And Nara Lokesh - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్లున్నాడు: కొడాలి నాని సెటైరికల్‌ పంచ్‌

Published Fri, Feb 24 2023 3:21 PM | Last Updated on Fri, Feb 24 2023 4:46 PM

Kodali Nani Slams TDP Chandrababu Naidu And Nara Lokesh Babu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును పిచ్చి ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ‍ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేశాడు. మీ అంతు తేలుస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును జైల్లోగానీ, పిచ్చాసుపత్రిలోగానీ పెట్టాలి. చంద్రబాబు ఛాలెంజ్‌లకు భయపడేవారు ఎవరూ లేరు. నారా లోకేష్‌ పిచ్చి కూతలు కూస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. 

నారా లోకేష్‌ బ్రెయిన్‌లెస్‌ కిడ్‌. రాజ్యాంగం గురించి లోకేష్‌కు ఏం తెలుసు?. చంద్రబాబు ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.తర్వాత బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను వదులుకోవాలి. అప్పుడు చంద్రబాబు ఛాలెంజ్‌లు చేయాలి.  చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్లున్నాడు. సీఎం జగన్‌పై చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు.  లోకేష్‌ తన పిచ్చి వాగుడుని చంద్రబాబుకు అంటించినట్టున్నాడు. రాజ్యాంగం ముసుగులో చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడు. చంద్రబాబుతో ప్రజలకు ఇబ్బంది. పోలీసులను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పట్టాభిని గన్నవరం పంపింది చంద్రబాబే. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై చిన్న గీత కూడా పడలేదు’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement