సాక్షి, న్యూఢిల్లీ: విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాతనపై కోవర్టు ముద్ర వేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోమారు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన కోమటిరెడ్డి బుధవారం ముగ్గురు నేతలను విడివిడిగా కలిసి ఇటీవలి నకిరేకల్‌లో తనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్ల అంశంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రేవంత్ సూచనల మేరకు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంలోని సభ్యుడి పురమాయించడంతో కొందరు వ్యక్తులు తనను కోవర్టుగా ముద్రిస్తూ పోస్టర్లు వేశా రని వివరించారు. దీనిపై తాను స్వయంగా సునీల్‌తో మాట్లాడగా, క్షమాపణలు సైతం కోరారని తెలిపారు. దీనిపై రేవంత్‌తో మాట్లాడతామని ఖర్గే సహా ఇతర నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment