రేవంత్‌ మూలాలు బీజేపీలో.. | KTR comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ మూలాలు బీజేపీలో..

Published Wed, Mar 6 2024 4:36 AM | Last Updated on Wed, Mar 6 2024 4:36 AM

KTR comments over Revanth Reddy - Sakshi

ప్రధాని మోదీని పొగిడి రాహుల్‌ను వేస్ట్‌ఫెలోను చేశాడు

ఆయన మరో ఏక్‌నాథ్‌ షిండే, హిమంత బిశ్వశర్మ

సిరిసిల్ల, ముస్తాబాద్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్‌

సిరిసిల్ల: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ‘పెద్దన్నయ్య’గా పొగిడి ఆయన ప్రాపకం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామా రావు విమర్శించారు. భవిష్యత్తులోనూ ప్రధాని ఆశీస్సులు ఉండాలని కోరడం ద్వారా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని పరోక్షంగా వేస్ట్‌ఫెలో అని రేవంత్‌ చెప్పినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

రేవంత్‌ మూలాలు బీజేపీలో ఉన్నా యని... ఆయన మరో ఏక్‌నాథ్‌ షిండే (శివసేనను చీల్చి బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎం అయిన నేత), హిమంత బిశ్వశర్మ (కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి సీఎం అయిన అస్సాం సీఎం) అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తా బాద్, సిరిసిల్లలో మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు.

రుణమాఫీ, రైతుబంధు ఏదీ?
బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్‌ చెప్పారు. తాము తీసుకొ చ్చిన అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నా రు. అలాంటిది రాష్ట్రంలో గుజరాత్‌ నమూనా అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్‌ కోరడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించ పరచడమేనని మండిపడ్డారు. ఆయన సీఎం కావ డం మన కర్మ అని పేర్కొన్నారు.

ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారని గతంలో మీడియా ముందు రేవంత్‌ చెప్పారని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ రైతుబంధు వేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హయాంలో ఎర్రని ఎండల్లోనూ చెరు వులు మత్తడి దూకితే ప్రస్తుతం కరెంట్‌ కోతలు, నీరులేక పొలాలు ఎండిపోతున్నాయన్నారు.

కాళేశ్వరం గురించి కాంగ్రెస్‌ సన్నాసులకు ఏం తెలుసు?
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రూ. లక్ష కోట్లు గంగ పాలయ్యాయని కాంగ్రెసోళ్లు అంటున్నారని, ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్‌ సన్నాసులకు ఏం తెలుసని కేటీఆర్‌ ప్రశ్నించారు. సగం తెలంగాణ కాళేశ్వరం పరిధిలో ఉందని, 270 కి.మీ. సొరంగంతో వందల కి.మీ. కాల్వలతో పంపుహౌస్‌లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో గోదావరి జలాలను ఎత్తి పోస్తూ చెరువులను నింపామన్నారు. కాళేశ్వరం నీటితో 3.50 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి రైతులు చేరుకున్నారని వివరించారు.

మేడిగడ్డలో ఒక్క పిల్లర్‌ కుంగిపోతే.. మొత్తం ప్రాజెక్టు గంగపాలైనట్లు ప్రచారం చేస్తున్నారని, మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్‌ చుట్టూరా కాఫర్‌ డ్యాం కట్టి ఇప్పటికీ నీటిని ఎత్తిపోయొచ్చని, పొలాలు ఎండకుండా చూడొచ్చన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ తెలివి లేదని కేటీఆర్‌ విమర్శించారు. కేసీఆర్‌పై కోపాన్ని రేవంత్‌ రైతులపై చూపుతున్నారని... సిరిసిల్ల పవర్‌లూం పరిశ్ర మకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా తనపై కోపాన్ని నేతన్నలపై చూపుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

రేవంత్‌ రంగు.. కాంగ్రెస్‌ పొంగు తెలిసింది 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు నియామక పత్రాలు అందిస్తూ 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్‌ పేర్కొన డం మందికి పుట్టిన బిడ్డను సొంత బిడ్డగా ముద్దా డినట్లు ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రంగు.. కాంగ్రెస్‌ పొంగు తెలిసిపోయిందని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు.

గురువారం సిరిసిల్లకు వస్తున్న రేవంత్‌... కేసీఆర్‌ హయాంలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. మల్కపేట రిజర్వా యర్‌ను ప్రారంభించాలని, సిరిసిల్ల వర్కర్లను ఓనర్లను చేయాలని, సిరిసిల్ల నేతన్నలకు బతు కమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని, పాత బకాయిలను నేతన్నలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సిరిసిల్ల జిల్లాకు బండి ఏం చేశారు?
కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సిరిసిల్ల జిల్లాకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా చెప్పులు మోయడం తప్ప ఒక్క గుడి.. ఒక్క బడి కట్టలేదని ఆరోపించారు. ప్రజలకు ఏం చేశారని ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement