
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దీంతో, మునుగోడు ఉప ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్.. ‘నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు రూ. 18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా?.
ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు. రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు. గుజరాత్‌కు గత ఐదు నెలల్లో రూ.80,000 కోట్ల ప్యాకేజీలు. మా తెలంగాణకు కనీసం రూ.18,000 కోట్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు
— KTR (@KTRTRS) October 12, 2022
రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ 18,000 Cr కాంట్రాక్టు
ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు ₹18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా? pic.twitter.com/aWyb5ypDD6
Comments
Please login to add a commentAdd a comment