మీరే నాకు స్ఫూర్తి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు | KTR Key Comments Over Women Power In Telangana | Sakshi
Sakshi News home page

మీరే నాకు స్ఫూర్తి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Published Thu, Nov 28 2024 8:20 AM | Last Updated on Thu, Nov 28 2024 8:24 AM

KTR Key Comments Over Women Power In Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్న ప్రజల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు మహిళల పోరాటానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి వారే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. సమ్మక్కలు, సారక్కలు.. మొక్కవోని ధైర్యంతో ముందుకురుతున్న ఐలమ్మలు.. అలుపెరగక పోరాటం చేస్తున్న రుద్రమ్మలు.. మీరంతా నాకు స్ఫూర్తి అంటూ ఫొటో షేర్ చేశారు.

అంతకుముందు లగచర్ల, దిలావర్పూర్ రైతులకు సంబంధించిన పోరాటంపై కూడా కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..  దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి.. వెంటనే లగచర్లలో..  అల్లుడి కోసం.. ఆదానీ కోసం..  
ఇండస్ట్రియల్  కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి..
అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలి.. అక్కడ శాంతిని నెలకొల్పాలి.

ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన  చరిత్ర మన కళ్ళ ముందు ఉంది..

అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్ లో  ఇథనాల్ మంటలను రాజేశారు.

తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుంది.

ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం.. వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలి..  తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత  మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదు.. లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది..

జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement