కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ | KTR Open Letter To Congress Government Stance On New Criminal Laws | Sakshi
Sakshi News home page

కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్‌ వైఖరి ఏంటో చెప్పాలి: కేటీఆర్‌ డిమాండ్‌

Published Mon, Jul 22 2024 3:06 PM | Last Updated on Mon, Jul 22 2024 3:22 PM

KTR Open Letter To Congress Government Stance On New Criminal Laws

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్‌ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. 

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. 

ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా అని  ప్రశ్నించారు.  లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్  రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపారు.

నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని కోరారు. దీంతోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని హె చ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement