
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఏ మాత్రం గౌరవించడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17 వేడుకలపై కేంద్రం రాష్ట్ర అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. తమకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించారని దుయ్యబట్టారు. ఇది టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా టీఆర్‌ఎస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకai నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment