సాక్షి, హైదరాబాద్: నకిలీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నకిలీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. డిసెంబర్ 9లోగా నెరవేరుస్తామన్న ఆరు గ్యారెంటీ ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని కల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పినట్లుగా వైరల్ అవుతున్న వీడియోపై కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో స్పందించారు.
తాజాగా తెలంగాణలో నూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా సిద్ధరామయ్య తరహాలోనే చెబుతుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ పోస్టుపై సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘బీజేపీ నకిలీ వీడియోలు సృష్టిస్తుంది. దానిని మీరు ప్రాచుర్యంలో పెడతారు. అందుకే బీజేపీకి బీఆర్ ఎస్ పార్టీ బీ టీమ్ అనేది..’అంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కనీస అధ్యయనం చేసినట్టు లేదు: కేటీఆర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి ముందు కనీస అధ్యయనం కూడా చేసినట్టు లేదని కేటీఆర్ తొలుత ‘ఎక్స్’లో విమర్శించారు. ప్రజలను మోసగించేలా కాంగ్రెస్ అబద్ధపు హామీలి వ్వడం వల్లే తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నా రు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన రైతు భరోసా హామీ ఏమైందని నిలదీశారు.
రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ.4 వేల ఆసరా పింఛను, రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు రూ.2,500 మాటేమిటని ప్రశ్నించా రు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన చేస్తామని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ నుంచి..వాటిపై ఎలాంటి ప్రకటన ఎందుకు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు నకిలీనా? లేక వారి మాటలు నకిలీనా? అని ప్రశ్నించారు.
ఫేక్ వీడియోను గుర్తించలేని స్థితిలో బీఆర్‌ఎస్: సిద్ధరామయ్య
సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? కనీసం ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేయరు కాబట్టి..’అంటూ విమర్శించారు. వైరల్ అయిన వీడియో నిజమైనది కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా సృష్టించారని స్పష్టం చేశారు. ఫేక్, ఎడిటెడ్ వీడియోలను కూడా గుర్తించలేని స్థితిలో బీఆర్‌ఎస్ ఉందని ఎద్దేవా చేశారు.
మీ ఎమ్మెల్యే ప్రకటన అబద్ధమా?: కేటీఆర్
సిద్ధరామయ్య కౌంటర్‌పై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తిరిగి పోస్టు చేశారు. ‘కర్ణాటకలో మీరు ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని మీ సొంత పార్టీ ఎమ్మెల్యే సదాక్చరి చేసిన ప్రకటన అబద్ధమా? బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ అని మీ నాయకుడు రాహుల్ ప్రచారం చేశారు. కానీ ఇక్కడ ఆ పార్టీ ముఖ్య నేతలను మేం ఓడించాం..’అని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment