సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక తుపాను రాబోతోందని, నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వెలిబుచ్చేందుకు సిద్ధమవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైంది. ప్రజల్లో కాంగ్రెస్ పారీ్టపై ప్రేమ ఉంది. వారి తలుపు తడితే చాలు.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వెళ్లి ప్రతి గుండెకు చేరాలి.’ అని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత కూచాడి శ్రీహరిరావు, సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు నోముల ప్రకాశ్‌గౌడ్ వేలాది మంది అనుచరులతో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి పారీ్టలోకి ఆహా్వనించా రు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి, ప్రజల కు మధ్య యుద్ధం జరగబోతోందని, ఈ యుద్ధంలో ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఓడిస్తారని చెప్పారు.
కొడంగల్ ఎంతో.. నిర్మల్ కూడా అంతే నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోతే అక్కడ పార్టీనే ఉండదేమో అన్నట్టు కొందరు వ్యవహరించారని, ఇప్పుడు అంతకంటే బలమైన నేతలు పారీ్టలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కచి్చతంగా నిర్మల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, కొడంగల్‌లో గెలుపు ఎంత ముఖ్యమో, నిర్మల్‌లోనూ గెలుపు అంతే ముఖ్యంగా పరిగణిస్తామని రేవంత్ చెప్పారు. నిర్మల్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టించిన వారిని బీఆర్‌ఎస్ ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇల్లు పొందిన వారిని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, ఇందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను రైతులంతా కలిసి రాళ్లతో కొట్టినా తప్పు లేదు
‘ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి కేసీఆర్ పాల్పడుతున్న దోపిడీని చూస్తే ఆయన్ను తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో చెట్టుకు ఉరేసినా తప్పు లేదు. తెలంగాణ రైతులంతా కలిసి రాళ్లతో కొట్టినా తప్పు లేదు.’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత ఇప్పటివరకు దాదాపు 25 లక్షల లావాదేవీలు జరిగాయని, ఈ లావాదేవీలన్నింటిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు.
ధరణి లావాదేవీలపై పూర్తిస్థాయిలో ఆడిట్ జరపాలని కోరుతూ కాగ్‌కు తానే లేఖ రాస్తానని, అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని, న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తానని చెప్పారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ సైబర్ నేరగాళ్ల తరహాలో ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పిందని గుర్తు చేశారు.
– బీఆర్‌ఎస్ నేతల్లా డఫ్ఫా గాడినేమోనని
అర్వింద్ అనుకుంటున్నారా?
కాగా, తాను కొందరు బీఆర్‌ఎస్ నాయకుల్లాగా డఫ్ఫా గాడినేమోనని ఐఏఎస్ అధికారి అరి్వంద్‌కుమార్ అనుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఓఆర్‌ఆర్ టెండర్ల విషయంలో తాను చేసిన ఆరోపణలపై ఇచ్చిన లీగల్ నోటీసును వ్యక్తిగతంగా తనకు పంపకుండా మీడియాకు ఎలా పంపుతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment