‘ఖబడ్దార్‌’ కూటమి సర్కార్‌.. జనం చూస్తున్నారు జాగ్రత్త! | YSRCP Fight Against CBN Govt Over Social Media Activists Arrests In AP | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

‘ఖబడ్దార్‌’ కూటమి సర్కార్‌.. జనం చూస్తున్నారు జాగ్రత్త!

కొనసాగుతున్న పోలీసుల వేధింపులు

సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చంద్రబాబు హామీలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన లోకేష్
హిందూపురంలో వాల్మీకి లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
 

2024-11-16 20:02:11

కడప పోలీసుల ఓవరాక్షన్

సోషల్ మీడియా యాక్టివిస్ట్ సునీతా రెడ్డి ఇంటికి అర్థరాత్రి వెళ్లిన పోలీసులు
పది మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం
ఓ మహిళ ఇంటికి అర్ధరాత్రి వెళ్లడం ఏంటని స్థానికుల ప్రశ్న
పోలీసుల నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్

2024-11-16 15:50:26

పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషం: పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత

ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి  గౌతమ్ రెడ్డి
పోలీసులు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది?
సుమారు 30 మందికి పైగా కరెంట్ తీసేసి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారు
అసలు పోలీసులు వచ్చింది దేనికి..
నా తండ్రి గౌతమ్ రెడ్డిని తీసుకెళ్లిపోవడానికా?.. ఎత్తుకెళ్లిపోవడానికా?.. దాచేయడానికా?..లేక ఏకంగా చంపేయడానికా?
పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి ఇది కాదు

2024-11-16 14:29:00

బాబు.. మీపై ఎందుకు 420 కేసు పెట్ట‌కూడ‌దు?: అనిల్‌ కుమార్‌ యాదవ్‌

  • అధికారంలోకి రాగానే ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌స్తాన‌ని, 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాన‌ని మాయ‌మాట‌లు
  • మాటలు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన మీరు ఆ దిశ‌గా ఒక్క అడుగు కూడా వేయ‌డం లేదు.
  • నిరుద్యోగుల‌కు రూ.3వేలు భృతి కూడా ఇస్తాన‌ని చెప్పి మోసం చేసిన బాబుపై ఎందుకు 420 కేసు పెట్ట‌కూడ‌దు?. 
2024-11-16 13:46:39

నమ్మించి మోసం చేసిన వ్యక్తి బాబు: శివప్రసాద్‌ రెడ్డి

  • అమ్మకు వందనం లేదు.
  • రైతు భరోసా లేదు.. ఆసరా లేదు.
  • నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు
  • ఇన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు మీద కదా కేసు పెట్టాలి..
  • ఆయన చేసింది నమ్మించి మోసం చేయడం కాదా.. అది నేరం కాదా?. 
2024-11-16 13:42:50

వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్స్‌: భూమన

  • తిరుపతి..
  • భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామెంట్స్...
  • సోషల్ మీడియా కార్యకర్తలు 600 మందికిపైగా కేసులు పెట్టారు,
  • 147 మందిని అరెస్ట్‌ చేశారు
  • వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి విష ప్రచారం చేశారు
  • దాన్ని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మీద ఆపాదించారు
  • 14 లక్షలు కోట్లు అప్పులు అంటూ, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విష ప్రచారం చేశారు.
  • బడ్జెట్‌లో మాత్రం 9.76 లక్షలు కోట్లు అని చూపించారు
  • నాడు చెప్పిన మాటలు, నేడు బడ్జెట్ తర్వాత చెప్పిన మాటలు సారాంశం వెనుక అర్థం ఏంటి?.
  • ఇదే విషయం బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి కూడా రాష్ట్రం అప్పుల ఉబిలో ఉందని ప్రచారం చేశారు. 
2024-11-16 13:37:10

వర్రా కేసులో పోలీసుల అత్యుత్సాహం..

  • వైఎస్సార్‌ జిల్లా..
  • వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల అత్యుత్సాహం
  • ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్ అంటించిన పోలీసులు
  • జిల్లా సోషల్ మీడియా యాక్టివిస్టులకు 41ఏ నోటీసులు
  • వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు సునీత రెడ్డి ఇంటికి పోలీసులు
  • సునీత ఇంట్లో లేకపోవడంతో 41ఏ నోటీసులు అంటించిన పోలీసులు
2024-11-16 10:59:18

సుందర్‌ కుమార్‌ అక్రమ అరెస్ట్‌..

  • పశ్చిమ గోదావరి..
  • కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల వేధింపులు.
  • ఉండి మండలం ఉనుదుర్రుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, న్యాయవాది గొర్రుముచ్చు సుందర్ కుమార్ అరెస్ట్‌
  • ఈరోజు తెల్లవారుజామున సుందర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.
  • ఇటీవలే అతనిని జిల్లా అధికార ప్రతినిధిగా ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
  • సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సుందర్ కుమార్.
  • ఉండి పోలీస్ స్టేషన్‌లో సుందర్ కుమార్‌ను విచారిస్తున్న పోలీసులు.
2024-11-16 09:18:53

సోషల్‌ మీడియా యాక్టివిస్టులకి అండగా వైఎస్సార్‌సీపీ

  • జిల్లాల వారీగా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి అండగా వైఎస్సార్‌సీపీ
  • కీలక నేతలతో బృందాలను ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌
     

 

2024-11-16 09:09:00

పులివెందులలో పలువురికి నోటీసులు..

  • కడప జిల్లా..
  • పులివెందుల నియోజకవర్గం పరిధిలో పలువురికి నోటీసులు.
  • కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్.
  • రాఘవరెడ్డి సొంత గ్రామం అంబకపల్లెలోని తన నివాసం వద్ద అంటించిన నోటీసులు.
  • వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ వివేకానంద రెడ్డి ఇంటికి 41ఏ నోటీసులు.
  • పులివెందులలోని వివేకానంద రెడ్డి ఇంటి వద్ద అంటించిన నోటీసులు
  • కడపలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ నిషాంత్‌కు 41ఏ నోటీసులు
2024-11-16 09:09:00

కూటమి సర్కార్‌ అక్రమ కేసులు..

  • సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు.
  • రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు
  • మూడు, నాలుగేళ్ల నాటి కేసుల్లోనూ బీఎన్‌ఎస్‌ సెక్షన్లు నమోదు
  • వాస్తవానికి జులై 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం
  • ఈ చట్టం అమల్లోకి రాక ముందు నాటి అభియోగాలపైనా బీఎన్‌ఎస్‌ 111 కింద కేసులు నమోదు
  • పాత కేసులకు కొత్త చట్టం వర్తించదని ఇటీవలే తేల్చి చెప్పిన రాజస్థాన్ హైకోర్టు
  • రాజ్యాంగం, కోర్టు తీర్పులతో తమకు పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
2024-11-16 09:09:00
Advertisement
 
Advertisement
 
Advertisement