భోపాల్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు 400కు పైగా స్థానాలు లభిస్తాయని సాక్షాత్తూ ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝాబూవా జిల్లాలో ఆదివారం గిరిజనుల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. ఆ పారీ్టకి గ్రామీణులు, రైతులు, పేదలు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరాముడితో సంబంధం ఉన్న ఆలయాలను దర్శించుకున్నానని, స్థానిక ప్రజల నుంచి తనకు అపరిమితమైన ప్రేమ లభించిందని చెప్పారు.
కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గ్రహించాయని, అందుకే దింపుడు కళ్లం ఆశతో కుటిల ప్రయత్నాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. టూటీ చేయడం, ప్రజలను విభజించడం.. ఇదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ము దోచుకోవడం, అధికారం పోయాక భాష, ప్రాంతం, కులం పేరిట విడదీయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిపోయిందన్నారు. అవినీతి, విభజన రాజకీయాలు అనే ఆక్సిజన్‌తో కాంగ్రెస్ బతుకుతోందన్నారు. ప్రజలకు నిజాలు తెలుసని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. గిరిజనులు, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందుకే ప్రతిపక్షాలు తనను దూషిస్తున్నాయని ఆరోపించారు.
ప్రతి బూత్‌లో అదనంగా 370 ఓట్లు
గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీకి అదనంగా 370 ఓట్లు వేయాలని ప్రజలను నరేంద్ర మోదీ కోరారు. మొత్తం 543 లోక్‌సభ సీట్లకు గాను తమకు 370కిపైగా సీట్లు కట్టబెట్టాలన్నారు. మధ్యప్రదేశ్‌లో డబులు ఇంజన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్‌తో పని చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రూ.7,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆక్షేపించారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రయతి్నంచిందని ధ్వజమెత్తారు.
విలువలతో కూడిన విద్య కావాలి
భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ తక్షణావసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా తాంకారాలో ఆదివారం వేడుకల్లో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. భారతీయ వ్యవస్థ వేదాల వైపు మళ్లాలంటూ దయానంద సరస్వతి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. సమాజం నుంచి బానిసత్వం, మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారని తెలిపారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలోని పాఠశాలలు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో జాతి నిర్మాణం అనే బాధ్యత చేపట్టాలని ఆర్య సమాజ్‌కు విజ్ఞప్తి చేశారు. దయానంద సరస్వతి జని్మంచిన గుజరాత్‌లో తాను కూడా జని్మంచడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment